Radio LIVE


Breaking News

Saturday, 16 November 2013

How to Reduce Hair Fall(జుట్టు రాలడం ఎలా అరికట్టాలి)

How to Reduce Hair Fall(జుట్టు రాలడం ఎలా అరికట్టాలి)

hairfall
         జీవితంలో ఏదోఒక సమయంలో ప్రతీ ఒక్కరు జుట్టు రాలడం అనే సమస్యను ఎదుర్కొంటారు. ఈ రోజుల్లో వచ్చే సాదారణ సమస్య ఏదైనా ఉంది అంటే అది జుట్టు రాలడం. మామూలుగా రోజుకు 80 వెంట్రుకల వరకు ఊడి పోవడం సర్వసాదారణం. సమస్య అంతా వచ్చీ ఎక్కువగా జుట్టు రాలుతుంటేనే.ఇది చాల మందిని వేదించే సమస్య.
జుట్టు రాలడానికి గల కారణాలు
జుట్టు రాలడానికి చాలా కారణాలు ఉంటాయి.
ఏ కారణం చేత జుట్టు రాలుతుందో కనుక్కోవడం మాత్రం కొంచెం కష్టం.
సాదారణంగా అయితే జుట్టు రాలడానికి కొన్ని ముఖ్య కారణాలు చెప్పుకోవచ్చు.
అవి : జన్యు పరమైన కారణం కావచ్చు, వయస్సు పెరుగుతుంటే వచ్చే వ్యాధుల వల్ల కావచ్చు, అధిక ఒత్తిడి వల్ల కావచ్చు, పోషకాహారలోపం వలన కావచ్చు,ఖనిజ లోపం వల్ల కావచ్చు,మనం తీసుకునే మందుల వల్ల కావచ్చు,కాలుష్యం వల్ల కావచ్చు,helmets మరియు caps వల్ల కావచ్చు, స్త్రీలలో అయితే ప్రసవ సమయంలో జుట్టు అధికంగా రాలడం సమస్యగా ఉంటుంది.
ఏ సమస్య వలన జుట్టు రాలుతుందో తెలుసుకుంటే దానికి సరైన చికిత్స తీసుకోవచ్చు.
జుట్టు రాలే సమస్యల్లో కొన్ని రకాలు
1.Androgenic Alopecia : ఇది సర్వసాదారణంగా ఉండే సమస్య. ఒక విధంగా బట్టతల అని చెప్పవచ్చు.
ముఖ్యంగా ఈ సమస్య వంశపారపర్యముగా రావచ్చు, మరియు హార్మోన్ల లోపం ఈ సమస్యకు మూల కారణం.
30 సంవత్సరాల వయస్సు ఉన్న పురుషులలో ఈ సమస్య 30% ఉంటుంది.
2.Toxic Alopecia : ఈ రకమైన సమస్య ఎక్కువగా శారీరక మరియు మానసిక ఒత్తిడి వలన వస్తుంది.
ఇంకా అనారోగ్యం,తలపై చర్మానికి Infection రావడం, అకస్మాత్తుగా బరువు తగ్గడం,శస్త్ర చికిత్సలు, మత్తు పదార్థాల వాడకం వంటి వాటి వల్ల కూడా ఈ సమస్య వస్తుంది.
3. Alopecia Areata : నిజానికి ఇది చర్మ సమస్య. శరీరంలో ఈ వ్యాధి సోకినా చోట జుట్టు రాలడం జరుగుతుంది.
సాదారణంగా ఇది తలలో లేదా గడ్డం మీద ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది.
ఇది ఎక్కువగా యువకులకు వస్తుంది.
4. Alopecia Universalis or Totalis : ఈ రకమైన సమస్య వల్ల శరీరం మీద ఉన్న వెంట్రుకలన్నీ రాలిపోతాయి. కనురెప్పలకు,కనుబొమ్మలకు ఉన్న వెంట్రుకలు కూడా ఊడిపోతాయి.
జుట్టు రాలడం ఎలా అరికట్టాలి
ఆరోగ్యం కంటే అందానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల మనకు తెలియకుండానే సమస్య పెద్దది అవుతుంది.
Heating and Drying వంటి పద్ధతులకు దూరంగా ఉండడం చాల మంచిది. వెంట్రుకల softness మరియు shine కోసం heat procedure వాడితే దీనివల్ల హెయిర్ ప్రోటిన్స్ బలహీనమైపోతాయి. ఇలా heating,drying చేయడం వాళ్ళ వెంట్రుకల పెలుసుదనం పెరిగి జుట్టు అధికంగా రాలడం జరుగుతుంది.
Hair straighteners,hair dryers, hot curlers, hot brushes,hair fasteners and chemical treatments వంటి వాటి వాడకం వలన జుట్టు రాలే సమస్యను మనమే పెంచుకున్నట్టు అవుతుంది.జుట్టుని సహజ పద్దతిలో ఆరబెట్టడమే జుట్టుకు ఆరోగ్యకరము.జుట్టుకి ఎక్కువగా రంగు వేయడం తగ్గించాలి,కనీసం 7 వారాలకు ఒకసారి వేసుకునేలా ఉండాలి.హెయిర్ స్టైల్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.కొన్ని రకాల హెయిర్ స్టైల్ వల్ల జుట్టు రాలుతుంది.ఇలా జుట్టు రాలడాన్ని traction alopecia  అంటారు.
ఎప్పుడు జుట్టును శుభ్రంగా ఉంచుకోవాలి. తేలికపాటి షాంపూతో క్రమం తప్పకుండా తల స్నానం చేయాలి. ఇలా తల స్నానం చేయడం scalp infections ఏమైనా ఉంటే  పోతాయి. విశాలమైన పళ్ళు ఉన్న దువ్వెనతో దువ్వుకోవాలి అంతే కాని తడి జుట్టును brushing చేయవద్దు.తల స్నానం చేశాక బలమంతా ఉపయోగించి తుడవకూడదు.
కండిషనర్లు,షాంపులు రాలిపోయిన జుట్టును తీసుకు రాలేవు. అలా నమ్మి ఏది పడితే అది వాడడం కూడా జుట్టు రాలడానికి కారణం అవతాయి.

జుట్టు చిక్కులను చేతితో మాత్రమే  తీయండి,దువ్వెనతో లేదా వేరే సాదనాలతో తీయడం మంచిది కాదు.
తినాల్సినవి
అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మనం ఆరోగ్యంగా ఉంటే మన జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.బలమైన ఆహరం తీసుకుంటే జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది.వీలైనంత వరకు మన ఆహరంలో కూరగాయలు,పండ్లు అధికంగా ఉండేలా చూసుకోవాలి.
ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు చేపలు,ఆకు కూరలు,బీన్స్ వంటివి నిరంతరం తీసుకోవాలి.
ఐరన్ తో పాటు ప్రోటీన్స్ జుట్టును బలవర్ధకంగా చేస్తుంది. షాంపు ద్వారా వచ్చే ప్రోటీన్స్ కాదు. మనం తీసుకునే ఆహరం ద్వారా లభించే ప్రోటీన్స్ తీసుకోవాలి. ప్రోటీన్స్ ఎక్కువగా పాల ఉత్పత్తులు,బంగాల దుంపలు,కోడి గ్రుడ్లు,బీన్స్,నట్స్ మొదలగునవి ఎక్కువగా తీసుకోవాలి.
వీటితో పాటు విటమిన్-సి ,ఫాటీ ఆసిడ్స్ ఎక్కువ ఉన్న ఆహారపదార్థాలు తీసుకోవాలి.
జుట్టు పోషణకు జింక్ కూడా చాల సహాయకారిగా పనిచేస్తుంది.
తినకూడనివి
కొన్ని ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది జుట్టు రాలడాన్ని అరికట్టడానికి. 
జుట్టు రాలడానికి కారణమైన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. అవి ఏంటో చూద్దాం.
చాలా  తక్కువ కేలరీలు గల ద్రవ ఆహార పదార్థాలు మానేయాలి. ఇవి ఆరోగ్యాన్ని క్షీణింప చేయడమే కాకుండా జుట్టు రాలడానికి  ప్రధాన కారణం కూడా అవుతాయి.
పచ్చి గుడ్డు తెల్ల సొన కూడా జుట్టు రాలడానికి ఒక కారణం.
అత్యంత అధిక మోతాదులో విటమిన్-ఎ తీసుకోవడం కూడా జుట్టు రాలడానికి కారణం.
చక్కర,ఉప్పు,స్వీట్స్,సోడా, సాఫ్ట్ డ్రింక్స్ వంటివి చాలా వరకు తగ్గించాలి.
ఒత్తిడి
చివరిగా చెప్పాల్సింది స్ట్రెస్(ఒత్తిడి). ఇది అన్నిటికంటే చాలా ముఖ్యమైన కారణం.
మానసిక ఒత్తిడి వల్ల మొత్తం శరీరమే నాశనం అవుతుంది, అలానే జుట్టు కూడా,జుట్టు ఏమి ఒత్తిడి కి మినహాయింపు కాదు.
ఒత్తిడిని తగ్గించుకోవడం మన చేతులో పని. అనవసర విషయాలకు ఒత్తిడికి గురి కావొద్దు,చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు ఒత్తిడి జయించి సమస్యను పరిష్కరించుకోవాలి కాని మీకు మీరుగా ఒత్తిడిలోకి నేట్టివేయబడకూడదు.
Read more ...

How to lose weight fast but easily (సులభంగా బరువు తగ్గడం ఎలా)

weightappధిరువు ఉన్న ప్రతీ ఒక్కరు సహజంగా సులభంగా బరువు తగ్గడం ఎలా అని అన్వేషిస్తారు. రోజూ ఉదయం లేవగానే ఈ రోజూ నుండి అయినా బరువు తగ్గే నియమాలు పాటించాలని చాలా కఠినమైన నిర్ణయాన్ని తీసుకుంటారు అధిక బరువు ఉన్న వారు. ఇలా తీసుకున్న నిర్ణయానికి ఎంత మంది కట్టుబడి ఉంటారు అంటే ప్రశ్నార్ధకమే. కొందరు కొన్ని గంటలు, కొందరు కొన్ని రోజులు మాత్రమే పాటిస్తారు. ఉదయం లేవగానే ఒక బలమైన క్షణంలో నిర్ణయం తీసుకోవడం బలహీనమైన క్షణంలో వదిలివేయడం సర్వసాదారణం అయింది. ఎందుకు వారు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండరో వారికి తెలుసు అయిన పాటించడం కష్టంగా ఉంటుంది.
 weight3 కష్టపడకుండా డైటింగ్ చేయకుండా బరువు తగ్గించుకునే సాధనాలు ఏమైనా ఉన్నాయో చూద్దాం.
సహజమైన పద్దతిలో శాశ్వతంగా బరువు తగ్గడం చాలా సాదారణ మరియు సమర్దవంతమైన మార్గం. దీనికోసం డైటింగ్ చేయాల్సిన పని లేదు. తీవ్రంగా శ్రమించాల్సిన అవసరం అంతకంటే లేదు. మన ఆహారపు అలవాట్లు కొంత వరకు సర్దుబాటు చేసుకుంటే అనుకున్న పలితం త్వరితంగా సాదించవచ్చు.
ఒకసారి బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాక దానికి కట్టుబడి ఉండాలి, అలా అని కష్టమైన లక్ష్యాలను నిర్దేషించుకోవద్దు.ఆహారపు అలవాట్ల దగ్గర నిజాయితిగా ఉండాలి,మీరు తినే ఆహరం మీద ఒక కంట్రోల్ ఉండాలి.
అల్పాహారం తీసుకోవడం మానేసి దానికి బదులు ప్రోటీన్లు ఉన్న grains తీసుకోవడం మంచిది. మనం తినే ఆహరంలో పీచు(brownricefiber) ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.ఎక్కువగా ఫైబర్ ఫుడ్ తీసుకోవడం వలన తక్కువ తిన్నా ఎక్కువ తిన్నామన్న అనుభూతి కలుగుతుంది,ముఖ్యంగా లంచ్ లో తీసుకుంటే మంచిది.
ఫైబర్ ఎక్కువగా ఉండే కొన్ని ఆహార పదార్థాలు: Cauliflower,Cabbage,Berries,Leafy Greens,Beans,Oranges,Mushrooms,Mangoes,Apples,Corns,
Brown Rice,Wheat Bread,Almonds,Barley,Guava.
డిన్నర్ కి white rice బదులు brown రైస్ తీసుకుంటే ఇంకా మంచిది.Brown రైస్ తీసుకుంటే త్వరగా కడుపునిండడమే కాక ఇది మీ జీర్ణ వ్యవస్థని తీసివేస్తుంది.2 కప్పుల రైస్ ఒక కప్పు బ్రౌన్ రైస్ కి సమానం.
రెస్టారంట్ కి వెళ్ళడం తగ్గించాలి,నెలలో పదిసార్లు వెళ్ళే వారు రెండుసార్లే వెళ్ళండి.పుర్తిగా మానేస్తే ఇంకా మంచిది.
ఫాస్ట్ ఫుడ్ జోలికి వెళ్లకుంటే ఇంకా మంచిది. అలాగే స్వీట్స్,చాక్లెట్స్,బేకారి ఫుడ్స్ వంటి వాటికి వీలైనంత వరకు దూరంగా ఉండాలి.
స్నాక్స్,కూల్ డ్రింక్స్,ఫ్రూట్ జ్యూస్ ఎక్కువగా తీసుకోవడం వలన బరువు తెలియకుండానే పెరిగి పోతుంది,ఎందుకంటే వీటిలో కాలరీస్ ఎక్కువగా ఉంటాయి.వీటికి బదులు వాటర్ వీలైనంత ఎక్కువ మొత్తంలో తీసుకుంటే మంచిది. మంచి నీటిలో zero calories ఉండడమే కాకుండా జీవక్రియను పెంపొందిస్తుంది.
greenteaబరువు తగ్గాలనుకునే వారికి గ్రీన్ టీ అధ్బుతంగా పని చేస్తుంది. ఇందులో కూడా zero calories ఉంటాయి. గ్రీన్ టీ ఒక మంచి వరం బరువు తగ్గాలనుకునే వారికి. Exercise చేస్తే బరువు తగ్గోచు చాలా వరకు. కాని అందరికి వీలు కాదు చేయడం. Exercise చేయడం వలన ఎన్ని Calories కరిగిపోతాయో అంతే మొత్తంలో బరువు తగ్గొచ్చు. ఎప్పుడు వీలైతే అప్పుడు చిన్న చిన్న exercise చేయాలి.TV చూస్తూ చేయవచ్చు ,కొంచెం సమయం దొరికిన శరీరానికి పని చెప్పడం చెయాలి.
స్మోకింగ్ అలవాటు ఉంటే మానేయడం ఉత్తమం.
చిన్న పనికి కూడా నడిచి వెళ్ళడం అలవాటు చేసుకోవాలి.
రుచిగా ఉన్నాయని ఏవి కూడా అతిగా తినడం చేయకూడదు.
ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లో TV చూస్తూ భోజనం చేయకూడదు,ఇలా చేయడం వలన మన శ్రద్ధ అంత TV మీదనే ఉంటుంది,ఎంత తింటున్నామో కూడా తెలియదు,కిచెన్ రూంలో తింటే ఇంకా మంచిది.
వీలైనంత వరకు సాయంకాలం 7 లోపు డిన్నర్ చేయడం అలవాటు చెసుకోవాలి.
మీకున్న పెంపుడు కుక్కతో రోజు సాయంత్రం ఒక 15 నిమిషాల పాటు వాక్ కి వెల్లాలి.weigher
రాత్రిళ్ళు ఎక్కువ సేపు మేల్కొనవద్దు.
అన్నింటికీ మించి బరువు తగ్గడానికి మంచి సాధనం రోజు కొంత సేపు యోగ చేయడం.
Read more ...

Sachin Retires

God of Cricket Retires

Read more ...
Designed By Published.. Blogger Templates