Radio LIVE


Breaking News

Sunday, 26 April 2015

నేపాల్ కు 13 ఎయిర్ క్రాఫ్ట్ లు : భారత్

నేపాల్ కు సహాయక చర్యల కోసం భారత్ 13 ఎయిర్ క్రాఫ్ట్ లు పంపనున్నట్లు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి జై శంకర్ మీడియాకు తెలిపారు. మరో మూడు NDRF బృందాలను కూడా పంపించనున్నట్లు ఆయన తెలిపారు. ఆదివారం 2టన్నుల వైద్య సామగ్రిని పంపించామని, మరో 6 NDRF బృందాలను రానున్న 48 గంటల్లో నేపాల్ కు పంపిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ బృందాలు కూడా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.
భారత దేశం తన ఆర్మీని నేపాల్ సహాయక చర్యల్లో పాల్గొనుటకు పంపించగా భారత సైన్యం “ ఆపరేషన్ మైత్రి “ పేరుతో సేవలను అందిస్తుంది. బీహార్ లో 4, యూపీలో ఒక NDRF బృందం సహాయక చర్యల్లో పాల్గొన్నాయని అయన వెల్లడించారు. నేపాల్ భూకంపం వల్ల తీవ్ర ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించిన విషయం తెలిసిందే. మృతుల సంఖ్య 2,250 కు చేరగా 5,600 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. భూకంప నేపధ్యంలో నేపాల్ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని కూడా విధించింది.
భారీ భూకంపం నేపాల్ ను అతలాకుతలం చేసింది. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ లో ఉన్న పర్వతారోహకులు మృత్యవాత పడ్డారు. 22 మంది పర్వతారోహకులు మృతి చెందగా, 60 మంది తీవ్రంగా గాయపడ్డారు.వేల సంఖ్యలో భూకంప క్షతగాత్రులు ఆస్పత్రులకు చేరుకున్నారు.ఇంకా శిధిలాల నుంచి మృతదేహాలు బయట పడుతూనే ఉన్నాయని సమాచారం. భూకంపం వల్ల దేశంలో 67 మంది మృతి చెందారు.బీహార్ లో 47మంది, ఉత్తరప్రదేశ్ లో 17 పశ్చిమ బెంగాల్ లో 3 మృతి చెందారు. భూకంపంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు కేంద్రం రూ.2 లక్షలు పరిహారంగా ప్రకటించింది

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates