సినిమా : అసుర
నటీనటులు : నారా రోహిత్, ప్రియ బెనర్జీ, రవి వర్మ
దర్శకుడు : కృష్ణ విజయ్
నిర్మాత : శ్యామ్ దేవభక్తుని
సంగీతం : సాయి కార్తీక్
సర్టిఫికేట్ : U/A
విడుదల : 05 జూన్ 2015
రేడియో జల్సా రేటింగ్ : 3/5
తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న యువ హీరో నారా రోహిత్ నటించిన చిత్రం 'అసుర' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అసుర సినిమా మీద ఒక్కసారిగా అంచనాలు పెరిగిన నేపథ్యంలో సినిమా ఎలా సమీక్ష చూద్దాం..
కథ :
ధర్మ తేజ(నారా రోహిత్) రాజమండ్రి సెంట్రల్ జైలులో జైలు అధికారిగా పనిచేస్తుంటాడు.నిజాయితీకి మారు పేరులా,తప్పు చేసిన వారికి సింహ స్వప్నంలా ఉంటాడు ధర్మ.దుష్టులను,నేరగాళ్లను శిక్షించడంలో అసురుడిలా వ్యవహరిస్తాడు హీరో,కాబట్టి చిత్రానికి 'అసుర' అనే పేరు పెట్టారు.
తన కుటుంబసభ్యులను హత్య చేసిన ఘటనలో చార్లీ(రవి వర్మ)ని మరణ శిక్ష విధించడానికి ధర్మ ఉన్న జైలుకు తరలిస్తారు.అయితే జైలు నుండి తప్పించుకునే పనిలో ధర్మ అనేక ఎత్తులు వేస్తుంటాడు.తనను జైలు నుండి తప్పిస్తే స్థానికంగా ఉన్న కొంతమంది తన అనుచరులకు 50 విలువైన వజ్రాలు ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకుంటాడు చార్లీ.ధర్మ కు ప్రాణమైన హారిక(ప్రియా బెనర్జీ) ను కిడ్నాప్ చేస్తారు.ఆ తరువాత ధర్మ ఏం చేస్తాడు?హారిక ను ఎలా రక్షించుకుంటాడు? చార్లీకి మరణ శిక్ష పడుతుందా ? మొదలగు అంశాలు తెలుసుకోవాలంటే చిత్రాన్ని వెండితెర మీద చూడాల్సిందే.
నటీనటుల పనితీరు :
తను నటించిన మిగతా చిత్రాలతో పోల్చుకుంటే నారా రోహిత్ నటన చాలా మెరుగైంది అని చెప్పాలి.డైలాగు డెలివరీ విషయంలో రోహిత్ ది ప్రత్యేక శైలి.పోలీసు అధికారిగా కనిపించిన రోహిత్ కొంచెం బొద్దుగా కనిపించాడు,అది ఒక్కటి తప్ప రోహిత్ చెప్పే డైలాగ్ లు యాక్షన్ సన్నివేశాలు బాగుంటాయి.
ప్రియా బెనర్జీ పాత్ర చిన్నదే అయినప్పటికీ స్మైల్ తోపాటు ప్రతిభతో కూడిన నటన కనబరిచింది.రవి వర్మ పోషించిన చార్లీ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు.కానిస్టేబుల్ గా నటించిన వెన్నెల రామా రావు పర్వాలేదు అనిపించాడు.ఇంకా మధు సింగంపల్లి, రవివర్మ, సత్య లు తమ పరిధిలో ఓకే అనిపించారు.
సాంకేతిక వర్గం :
సాంకేతిక వర్గం విషయానికి వస్తే ముందుగా సినిమాటోగ్రఫి గురించి మాట్లాడుకోవాలి.ఒక్కమాటలో చెప్పాలంటే యస్.వి.విశ్వేశ్వర్ అందించిన సినిమాటోగ్రఫి అద్భుతం.స్క్రీన్ ప్లే కూడా చాలా చాలా బాగుంటుంది.సాయి కార్తీక్ అందించిన సంగీతం బెష్.ఎడిటింగ్ విషయానికి వస్తే సినిమా చూస్తుంటే ఎడిటింగ్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు కనిపిస్తుంది.
ప్లస్ పాయింట్లు :
నారా రోహిత్ నటన,అతని బేస్ వాయిస్ తో చెప్పే డైలాగ్ లు
దర్శకుడు
సాంకేతిక వర్గం
విజువల్స్ సినిమాకు హైలైట్ గా నిలుస్తాయి
సంగీతం
యస్.వి.విశ్వేశ్వర్ అందించిన సినిమాటోగ్రఫి
సినిమాలో వచ్చే ట్విస్ట్ లు నచ్చుతాయి
ఇంటర్మిషన్ ముందు వచ్చే సన్నివేశాలు ఉత్కంఠకు గురిచేయడమే కాకుండా క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలను ఊహించలేము
మైనస్ పాయింట్లు :
నారా రోహిత్ పోలీసు ఆఫీసర్ గా కనిపించాడు కాబట్టి కొంచెం లావు తగ్గి ఉండాల్సింది.తెర మీద రోహిత్ కనిపించగానే ప్రతీ ఒక్కరి మదిలో మెదిలేది అదే.
సినిమా అక్కడక్కడా నెమ్మదించడం
కామెడీ లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేవనే చెప్పాలి
ప్రియా బెనర్జీ పాత్ర పరిమితం
పాటల్లో తప్ప రోహిత్,ప్రియా ల మధ్య రొమాన్స్ సినిమా కథను పక్కకు మల్లించినట్టు కనిపిస్తుంది
తీర్పు :
ఒక సాధారణమైన కథను దర్శకుడు చెప్పాలనుకున్న విధానం బాగుంది.అన్యాయాలు,నేరాలు చేసిన వ్యక్తులు తప్పించుకోకుండా ఒక పోలీసు అధికారి తన విధులను నిర్వర్తించడమే సినిమా కథ.నారా రోహిత్ అంటే ఒక వర్గం ప్రేక్షకులకు ఓ ప్రత్యేక అభిప్రాయం ఉంది,వారికి కచ్చితంగా మెప్పించే సినిమా అసుర. కమర్షియల్ ఎలిమెంట్స్ కోరుకునే వారిని నిరుత్సాహపరుస్తుంది.యాక్షన్,తిల్లర్ సినిమా లు కోరుకునే వారికి నచ్చే సినిమా 'అసుర'.
No comments:
Post a Comment