తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కే.తారకరామారావు, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రేమాండ్ పీటర్స్ తో కలిసి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు కు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హాడ్కో (గృహ, పట్టణ అభివృద్ధి సంస్థ) సోమవారం ఢిల్లీ లో అవార్డు ను అందజేయనుంది.
వీరు హడ్కో తన 47వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు.
తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పోరేషన్ ద్వారా చేపట్టిన పథకాలు, లక్ష్యాలను గుర్తిస్తూ హడ్కో అవార్డు ను ప్రకటించింది.ఈ అవార్డును తీసుకోవడానికి తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పోరేషన్ వైస్ ఛైర్మెన్, మంత్రి KTR తో సహా ముఖ్య కార్యదర్శి పీటర్ ఢిల్లీ కి వెళ్లారు.
అనంతరం ఢిల్లీ నుంచి బయలుదేరి హైదరాబాద్ లో పెరేడ్ గ్రాండ్ లో జరిగే TRS బహిరంగ సభలో మంత్రి పాల్గొంటారు.
No comments:
Post a Comment