సీరీస్ కోల్పోయిన భారత్
న్యూజిలాండ్ తో మంగళవారం జరిగిన 4వ వన్డే లో ఇండియా ఓటమి చవి చూసింది.దీంతో అయిదు వన్డేల సీరీస్ ను 3-0 తో కీవీస్ ఆధిక్యంలో ఉంది..వరుసగా రెండో విదేశీ సీరీస్ ని కోల్పోయింది భారత్.శిఖర్ ధావన్, సురేష్ రైనా స్థానంలో అంబటి రాయుడు మరియు స్టువర్ట్ బిన్నీ ఈ మ్యాచ్ లో ఆడారు.
హమిల్టన్ లో జరిగిన నాల్గవ వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న
భారత్ నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి అయిదు వికెట్ల నష్టానికి 278 పరుగులు సాధించింది. న్యూజిలాండ్ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 279 పరుగుల లక్ష్యాన్ని చేదించింది.రాస్ టేలర్(112నాటౌట్),విలియమ్సన్(60) చివర్లో బ్రెండన్ మెకల్లమ్ (36 బంతుల్లో 49) వేగంగా పరుగులు చేయడంతో ఇంకా 11 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఆది లోనే కోహ్లి(2),రహనే(3) వికెట్లను కోల్పోయిన రాయుడు 37 పరుగులు చేసి వెనుతిరిగాడు.ఓపెనర్ రోహిత్ శర్మ 79 పరుగులు ధోని (79నాటౌట్) పరుగులు మరియు జడేజా(62నాటౌట్) పరుగులతో రాణించారు.
ఇంకా ఒక వన్డే మిగిలి ఉండగానే 3-0తో సీరీస్ కోల్పోయింది భారత్. చివరి మ్యాచ్ వెల్లింగ్టన్ వేదికగా జనవరి 31న జరుగుతుంది.
రాష్ట్రంలో ఆరు రాజ్యసభ స్థానాలకు తొమ్మిది నామినేషన్లు
రాష్ట్రంలో ఖాలిగా ఉన్న ఆరు రాజ్యసభ స్థానాలకు మొత్తంగా తొమ్మిది నామినేషన్లు దాఖలు అయ్యాయి.
కాంగ్రెస్ తరుపున కేవీపీ రామచంద్రరావు, టీ.సుబ్బరామిరెడ్డి, ఎంఏఖాన్ ముగ్గురు నామినేషన్ దాఖలు చేశారు.
టీడీపీ నుంచి సీతామహాలక్ష్మి, గరికిపాటి మోహనరావు నామినేషన్లు దాఖలు చేశారు.
టీఆర్ఎస్ తరుపున కేశవరావు నామినేషన్ దాఖలు చేశారు.
ఇక కాంగ్రెస్ నుంచి తిరుగుబాటు అభ్యర్ధులుగా సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్ రెడ్డి,ఎమ్మెల్సీ చైతన్యరాజు మరియు జాజుల భాస్కర్ కూడా నామినేషన్ దాఖలు చేశారు.
జనవరి 29న న నామినేషన్ల పరిశీలన చేస్తారు.నామినేషన్ల ఉపసంహరణ గడువు జనవరి 31.ఎన్నికలు ఫిబ్రవరి 7న జరుగుతాయి.

గే సెక్స్ నేరమే - సుప్రీంకోర్టు
స్వలింగ సంపర్కం నేరమంటూ ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై
కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన సంగతి విదితమే.భారతీయ
శిక్షాస్మృతిలోని సెక్షన్ 377ను సమర్థిస్తూ వెల్లడించిన తీర్పు వల్ల చాలా
మంది స్వలింగ సంపర్కులు ప్రాసిక్యూషన్ రిస్క్తోపాటు వేధింపులు ఎదుర్కొనే
ప్రమాదం ఉందని, కాబట్టి తీర్పును పునఃపరిశీలించాలని కోరింది.
తీర్పును తిరిగి సమీక్షించాలని దాఖలైన పిటీషన్ ను తోసిపుచ్చింది సుప్రీం కోర్టు.గతంలో జస్టిస్ దత్తు, జస్టిస్ ఎస్.జే.ముఖోపాధ్యాయతో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పును సమర్ధించింది.
తీర్పును తిరిగి సమీక్షించాలని దాఖలైన పిటీషన్ ను తోసిపుచ్చింది సుప్రీం కోర్టు.గతంలో జస్టిస్ దత్తు, జస్టిస్ ఎస్.జే.ముఖోపాధ్యాయతో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పును సమర్ధించింది.