ప్రపంచకప్ కు ముందు ఫామ్ లో లేని భారత్ ప్రపంచకప్ ప్రారంభం కాగానే ఫామ్ ను అందిపుచ్చుకుంది.వరుస విజయాలతో దూసుకుపోతుంది.పాకిస్తాన్,దక్షిణాఫ్రికాలపై సైతం భారీ విజయాలను నమోదు చేసుకొని మంచి ఊపు మీద కనిపిస్తుంది భారత్ జట్టు.
శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు జరిగే మ్యాచ్ లో భారత్ తన తదుపరి ప్రత్యర్థి వెస్టిండీస్ తో తలబడుతుంది.ఈ మ్యాచ్ లో నెగ్గి క్వార్టర్ ఫైనల్ చేరాలని చూస్తుంది.ఐతే వెస్టిండీస్ కు మాత్రం భారత్ తో జరిగే ఈ మ్యాచ్ చాలా కీలకం.ఒకవేళ భారత్ తో ఓడితే విండీస్ కు క్వార్టర్స్ చేరే అవకాశం దాదాపు కోల్పోతుంది.
విండీస్ పై ఈ మధ్య రికార్డు 100% ఉంది.జరిగిన ఆరు సీరీస్ లు భారత్ వే.ప్రపంచకప్ లో సైతం భారత్ దే పై చేయి,రెండు జట్లు 7 సార్లు పోటీ పడగా భారత్ 4సార్లు గెలుపొందగా 3సార్లు విండీస్ గెలిచింది.
భారత్ తన ఫామ్ ని కొనసాగించి విండీస్ మీద విజయం సాధించాలని చూస్తుంటే విండీస్ మాత్రం విజయం కోసం సర్వశక్తులను ఒడ్డనుంది.గేల్ గానీ రెచ్చిపోతే భారత్ గెలవడం కొంచెం కష్టసాధ్యం.గేల్ కు భారత్ మీద అంత పెద్ద రికార్డు ఏమీ లేదు.భారత్ బ్యాటింగ్ విషయానికి వస్తే ధోని తప్ప టాప్ ఆర్డర్ అంతా ఫామ్ లోనే ఉన్నారు.షమీ ఫిట్ గా ఉండడంతో భువి,షమీ లలో ఒక్కరిని ఆడిస్తారా లేక ఇద్దరినీ ఆడిస్తారో చూడాలి.
No comments:
Post a Comment