ఏటీఎంలలో లావాదేవీలకు సంబంధించి నవంబర్ 1 నుండి కొత్త నిబంధనలు అమలులోకి
రానున్నాయి.సొంత బ్యాంకు ఏటీఎం నుండి నెలకు ఐదుసార్లకు మించి డబ్బులు
తీసుకున్నా,బ్యాలెన్స్ చెక్ చేసుకున్నా,మినీ స్టేట్ మెంట్ లాంటివి
తీసుకున్నా ప్రతీ లావాదేవికి రూ.20 అదనంగా చార్జీ చేస్తారు.అంటే సొంత
బ్యాంకు ఏటీఎం నుండి ఉచితంగా లావాదేవీలు జరుపుకోవడానికి 5 సార్లే అవకాశం
ఉంది.అదే ఇతర ఏటీఎంల ద్వారా లావాదేవీలు ఉచితంగా జరుపుకునే అవకాశం ఐదు నుండి
మూడుకు తగ్గించారు.మెట్రో నగరాల్లో మూడు లావాదేవీలు, నాన్ మెట్రో నగరాల్లో
రెండు లావాదేవీలు నిర్వహించుకునే అవకాశం కల్పించింది ఆర్బీఐ.
ఈ నిబంధనలు దేశంలోని కేవలం ఆరు మెట్రో నగరాలకే వర్తిస్తాయి.హైదరాబాద్ తో
పాటు ఢిల్లీ,ముంబాయి,కోల్ కతా,చెన్నై,బెంగళూరులలో మాత్రమే ఈ నిబంధనలు
వర్తిస్తాయి.ఈ మార్పులు కరెంటు మరియు సేవింగ్స్ కు సంబంధించిన అన్ని
అకౌంట్లకు వర్తిస్తాయి.
No comments:
Post a Comment