Radio LIVE


Breaking News

Saturday, 14 March 2015

విజయవంతమైన మొదటి పురుషాంగ మార్పిడి శస్త్రచికిత్స

మొదటిసారి పురుషాంగ మార్పిడి శస్త్రచికిత్సలో దక్షిణాఫ్రికా డాక్టర్లు విజయవంతమయ్యారు.వైద్య చరిత్రలో ఇదొక అద్భుత ఘట్టం.స్టెల్లెన్ బోష్ యూనివర్సిటీలో యూరాలజీ విభాగానికి అధిపతి అయిన ప్రొ.వాన్ డర్ మర్వ్ అధ్యక్షతన టైగెర్ బర్గ్ హాస్పిటల్ లో ఈ శస్త్రచికిత్స జరిగింది.
21 సంవత్సరాల దక్షిణాఫ్రికా యువకునికి నిర్వహించిన ఈ శస్త్రచికిత్స ప్రపంచంలోనే మొదటిది.డిసెంబర్ 11న జరిగిన ఈ శస్త్రచికిత్సకు దాదాపు తొమ్మిది గంటలు పట్టింది.శస్త్రచికిత్స చేయించుకున్న యువకుడు అన్ని  విధాల ఆరోగ్యంగా ఉన్నాడని మర్వ్ చెప్పారు.
వివరాల్లోకి వెళ్తే ..
సాంప్రదాయకంగా జరిగిన ఒక వేడుకలో 18 సంవత్సరాల వయసులో ఆ యువకుడు సున్తీ చేయించుకున్నాడు.తగు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో పురుషాంగం పూర్తిగా పాడవడంతో 3 సంవత్సరాల క్రితం పురుషాంగాన్ని తొలిగించారు.
ఐతే చనిపోయిన ఒక వ్యక్తి యొక్క పురుషాంగాన్ని దానం చేయడానికి అతని కుటుంబం ఒప్పుకోవడంతో ఈ ఆపరేషన్ నిర్వహించారు.ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తి యొక్క వివరాలు గోప్యంగా ఉంచారు.అతని యొక్క పురుషాంగం పూర్తి స్థాయిలో పని చేస్తుంది,మూత్రం,అంగ స్తంభన కూడా బాగానే ఉంది అని మర్వ్ చెప్పారు.ఇద్దరిదీ ఒకే రంగు కావడం కూడా కలిసొచ్చింది అని ప్రొఫెసర్ అన్నారు.
మూత్రాశయం నుంచి మూత్రం వెలికి వచ్చే మార్గము లో ఉన్న చిన్న రంధ్రానికి చికిత్స చేశాము,ఇంత తొందరగా ఫలితం విజయవంతంగా కనిపిస్తుందంటే మేమే చాలా ఆశ్చర్యానికి గురయ్యాము,అసలైతే రెండు సంవత్సరాల్లో ఫలితం పూర్తి స్థాయిలో కనిపిస్తుంది అని ముందు ఊహించాం, ఇలాంటి వినూత్నమైన ఆపరేషన్ చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని అని వాన్ డర్ మర్వ్ అన్నారు.
పురుషాంగంలో మిల్లీమీటర్ కంటే తక్కువ స్థాయిలో ఉండే రక్తనాళాలలను,కడుపులో ఉన్న రక్త నాళాలను కలపడం చాలా కష్టం అయిందని,ఒక రక్త నాళంలో కొన్ని గంటలపాటు రక్తం గడ్డ కట్టింది,తరువాత సర్డుకుపోయింది అని  డాక్టర్ల బృందం చెప్పింది.
ఈ డాక్టర్ల బృందం ఇంకో తొమ్మిది ఇలాంటి శస్త్రచికిత్సలు చేయడానికి సిద్దమవుతున్నారు.
2006 సవత్సరంలో కూడా చైనాలో ఒక వ్యక్తికి పురుషాంగం మార్పిడి చేసినా రెండు వారాల తరువాత దానిని తొలిగించారు.
doc

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates