ప్రముఖ తెలుగు సినీ నటి ఆర్తి అగర్వాల్(31) కన్నుమూశారు.అమెరికా లోని అట్లాంటికి సిటీ న్యుజర్సీ లోని ఒక ఆసుపత్రిలో ఊబకాయంతో పాటు శ్వాశకోశ వ్యాధితో భాదపడుతూ గుండెపోటుతో మృతి చెందారు.కొద్ది రోజుల క్రితం ఊబకాయాన్ని తగ్గించుకోవడానికి లైపోసక్షన్ ఆపరేషన్ చేయించుకున్నా అది వికటించడం కూడా తన మరణానికి కారణం అని తెలుస్తుంది.
2001 లో 'నువ్వు నాకు నచ్చావ్' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ఆర్తి అగర్వాల్ 1984 మార్చి 5న న్యూ జర్సీ లో జన్మించారు.'పాగల్ పన్' అనే బాలీవుడ్ చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేసిన ఆర్తి తరువాత తెలుగులో దాదాపు 30 సినిమాల్లో హీరోయిన్ గా అందరూ ప్రముఖుల సరసన నటించి తనకంటూ తెలుగు సినీ రంగంలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది.ఆర్తి అగర్వాల్ చివరిసారిగా నటించిన చిత్రం రణం 2.
చిరంజీవితో ఇంద్ర,బాలకృష్ణ తో పల్నాటి బ్రహ్మనాయుడు, నాగార్జున తో నేనున్నాను,వెంకటేష్ తో నువ్వు నాకు నచ్చావ్,సంక్రాంతి,వసంతం, మహేష్ బాబుతో బాబి ,జూనియర్ ఎన్టీఆర్ అల్లరి రాముడు,ప్రభాస్ తో అడవి రాముడు,తరుణ్ తో నువ్వు లేక నేను లేను,ఉదయ్ కిరణ్ నీ స్నేహం,సునీల్ తో అందాల రాముడు,రవి తేజ తో వీడే,రాజశేఖర్ తో గోరింటాకు మొదలగు చిత్రాల్లో నటించింది ఆర్తి.
2005 సంవత్సరంలో ఆత్మహత్యా యత్నం చేసిన ఆర్తి అగర్వాల్ 2007 సంవత్సరంలో గుజరాతీ ప్రవాస భారతీయుడు ఉజ్వల్ తో వివాహం చేసుకున్న ఆర్తి ఆ తరువాత ఉజ్వల్ తో విడాకులు తీసుకుంది.
అయితే ఆర్తి కేవలం 31 సంవత్సరాలకే తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోవడం ప్రతీ ఒక్కరిని దిగ్భ్రాంతికి గురిచేసింది.తన మృతి పట్ల సినీ ప్రముఖులు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఆర్తి అగర్వాల్ సోదరి అతిధి అగర్వాల్ కూడా పలు తెలుగు సినిమాల్లో నటించింది.
No comments:
Post a Comment