Radio LIVE


Breaking News

Sunday 21 December 2014

బాహుబలిలో ‘అవంతిక’గా హాల్ చల్ చేస్తున్న తమన్నా..ఫస్ట్ లుక్

‘బాహుబలి’చిత్రంలో తమన్నా ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.కాగా ఆమె జన్మదినం సందర్భంగా బాహుబలి చిత్ర యూనిట్ సభ్యులు యువరాణి పాత్రలో ఉన్న తమన్నా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.ఈ చిత్రంలో తమన్నా పాత్ర పేరు అవంతిక. ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్,అనుష్క,తమన్నా,రానా తారాగణంతో బాహుబలిగా ఈ చిత్రం భారి బడ్జెట్ తో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బాహబలి చిత్రంలో ‘అవంతిక’గా దేవకన్యను తలపిస్తున్న తమన్నా స్టిల్ ని చూస్తుంటే ఈ చిత్రంపై అంచనాలు మరింతగా పెంచేస్తున్నాయి.
Read more ...

Thursday 18 December 2014

మిస్ ఇండియా అమెరికా-2014గా తెలుగమ్మాయి ప్రణతి

అందాల పోటీలో మిస్ ఇండియా అమెరికా-2014గా తెలుగమ్మాయి ప్రణతి గంగరాజు టైటిల్ ను కైవసం చేసుకున్నారు. న్యూయార్క్ కు చెందిన ఐఎఫ్సీ ఆధ్వర్యంలో జరిగిన ఈ అందాల పోటీల్లో అమెరికాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 21మంది భారత సంతతి అమ్మాయిలు పాల్గొన్నారు. గతంలో ఈ టైటిల్ ను గెలుచుకున్న మోనికా గిల్ ప్రణతి గంగరాజుకు మిస్ ఇండియా అమెరికా-2014 కిరీటాన్ని బహుకరించింది. జార్జియాలో నివాసం ఉంటున్న 19 ఏళ్ల ప్రణతి గంగరాజు ప్రస్తుతం ఫిల్మ్ఆక్టింగ్ ,ప్రొడక్షన్ కోర్సును అభ్యసిస్తుంది.
Read more ...

తెలంగాణ ఎక్స్ ప్రెస్ గా మారనున్నా ఏపీ ఎక్స్ ప్రెస్..

ఏపీ ఎక్స్ ప్రెస్ పేరును తెలంగాణ ఎక్స్ ప్రెస్ గా మార్చాలని సీఎం కేసీఆర్ అన్నారు.రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఎక్స్ ప్రెస్ పేరు అసమంజసంగా ఉందన్నారు. అదేవిధంగా హైదరాబాద్-సిర్పూర్-కాగజ్ నగర్ మధ్య నడిచే తెలంగాణ ఎక్స్ ప్రెస్ పేరును కొమరంభీం ఎక్స్ ప్రెస్ గా మార్చాలని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఈమేరకు పేర్ల మార్పును కోరుతూ కేంద్ర రైల్వేశాఖకు ఓ లేఖను రాయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
Read more ...

ప్రేయసిని మరిచిపోలేక..భార్యను ప్రేమించలేక..ఓ సాఫ్ట్ వేర్ ఆత్మహత్య

ప్రేమించిన అమ్మాయిని మరిచిపోలేక..కట్టుకున్న భార్యను ప్రేమించలేక ఓ సాప్ట్ వేర్ ఇంజనీర్ తనువు చాలించాడు.కట్టుకున్న భార్యకు తాను ప్రేమించిన ప్రేయసికి,తల్లిదండ్రులకు,ఇతర కుటుంబసభ్యులకు మరణవాంగ్మలాన్ని(సూసైడ్ నోట్)రాసి..ఉరివేసుకున్నాడు. బుధవారం రాత్రి కూకట్ పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..వరంగల్ జిల్లా నర్సంపేట ఇంద్రనగర్ కు చెందిన రవీంద్రనాథ్(29)ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు.డెంటల్ డాక్టర్ అయిన ప్రతిభ అనే యువతితో ఈ ఏడాది ఆగస్టులో వివాహం జరిగింది.వివేకానందనగర్ డివిజన్ మాధవరంకాలనీలో దంపతులిద్దరూ అద్దెకు ఉంటున్నారు. స్థానికంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రతిభ విధులు నిర్వహిస్తోంది.తన వివాహ విషయంలో మనస్తాపంతో ఉన్న రవీంద్రనాథ్ కొంతకాలంగా తీవ్రమానసిక వేదనకు గురవుతున్నాడు.కాగా బుధవారం రాత్రి ఇంట్లో ఎవరులేని సమయంలో సుమారు 8 గంటల సముయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయాన్ని స్థానికులు కూకట్ పల్లి పోలీసులకు అందించారు. పోలీసులు పరిశీలించగా సూసైడ్ నోట్ లభించింది.అందులో తాను పెళ్ళికి ముందే ఓ అమ్మాయిని ప్రేమించానని..ఆమెను మర్చిపోలేకపోతున్నానని ప్రతిభను ప్రేమించలేక పోతున్నానంటూ తన ఆవేదనని వ్యక్తం చేశాడు. అదేవిధంగా తన తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పి,అన్నావదనలు,అక్కాబావలకు తల్లిదండ్రులకు అండగా నిలవాలని ప్రాధేయపడ్డాడు. తన భార్య చాలా మంచిదని పేర్కొంటూ..రెండేళ్ల తర్వాత ఆమెను పెళ్లి చేసుకోవాలని సూచించాడు. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read more ...

Wednesday 17 December 2014

టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్తగా చేరిన మరో 6 మంత్రులు

ఇప్పటివరకు 12 మంది సభ్యులుగా ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్తగా మరో 6 మంత్రులు చేరడం వల్ల రాష్ట్రంలో పూర్తి స్థాయి ప్రభుత్వం ఏర్పడింది. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు : 1)తుమ్మల నాగేశ్వర్రావు -రోడ్లు,భవనాలు,మహిళా శిశు అభివృద్ధి. 2)అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి -గృహనిర్మాణం,న్యాయశాఖ,దేవాదాయ. 3)తలసాని శ్రీనివాస యాదవ్ -వాణిజ్య పన్నులు,సినిమాటోగ్రఫీ. 4)అజ్మీర చందూలాల్ -గిరిజన అభివృద్ధి,పర్యాటక,సాంస్కృతిక. 5)సి.లక్ష్మా రెడ్డి -విద్యుత్ 6)జూపల్లి కృష్ణారావు -పరిశ్రమలు,చక్కర,చేనేత,జౌళి. వీరితో మంగళవారం నాడు గవర్నర్ నరసింహన్ రాజ్ భవన్ లో ప్రమాణం చేయించారు. వీరితో పాటు ఇద్దరు మంత్రులు కూడా అదనపు బాధ్యతలను తీసుకున్నారు. వారు: 1)ఎక్సైజ్ మంత్రి T.పద్మారావు -క్రీడలు,యువజన సర్వీసులు 2)అటవీ మంత్రి జోగు రామన్న –BC సంక్షేమం.
Read more ...

ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డుకు ఎంపికైన టాటా స్టీల్ ప్లాంటు

సుకింద క్రోమైట్ మైన్ లోని టాటాస్టీల్ క్రోమ్ శుద్ధీకరణ ప్లాంట్ కు నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు లభించింది. మైనింగ్ కేటగిరి విభాగంలో జాతీయ శక్తి పరిరక్షణ అవార్డు-2014 కు ఎంపికైంది.
టాటా స్టీల్ ప్లాంటు ఈ కేటగిరిలో 2వ బహుమతిని కైవసం చేసుకుంది. ఈ అవార్డును విద్యుత్ మంత్రిత్వ శాఖ నేతృత్వంలో పనిచేస్తున్న బ్యూరో అఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రధానం చేస్తుంది. జాతీయస్థాయిలో గుర్తింపు పొంది పారిశ్రామిక రంగంలో శక్తి పరిరక్షణకు దోహదపడుతూ,నూతన మార్పులకు శ్రీకారం చుడుతున్న పరిశ్రమలకు ఈ అవార్డును ప్రధానం చేస్తారు.
Read more ...

ఇండియాలో పెరుగుతున్న ఫేస్ బుక్ వినియోగం

ఇండియాలో ఫేస్ బుక్ వినియోగం పెరుగుతుందని ఆ సంస్థ తెలిపింది. సెప్టెంబర్ నాటికి ఫేస్ బుక్ వినియోగదార్ల సంఖ్య 11.2 కోట్లకు చేరింది.ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య 132 కోట్లుగా ఉంది. రోజుకొక్క సారైనా ఫేస్ బుక్ ని సందర్శించే వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 84 కోట్లుగా ఉండగా మన ఇండియాలో ఈ సంఖ్య 5 కోట్లుగా ఉంది. అత్యధిక యూజర్లు ఉన్న దేశంగా అమెరికా మొదటి స్థానంలో ఉండగా, ఇండియా రెండవ స్థానంలో ఉంది. దీనికి ముఖ్య కారణం.. ఇంటర్నెట్ విస్తరణ,యువ జనాభా పెరగడం.
Read more ...

మూడు జిల్లాలుగా మారనున్నా మెదక్ జిల్లా

మెదక్ జిల్లా పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ జిల్లాపై వరాల జల్లు కురిపించారు. బుధవారం మెదక్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ..మెదక్ జిల్లాను మూడు జిల్లాలుగా చేసి పాలనను వికేంద్రీకరిస్తామని స్పష్టం చేశారు. ఇప్పుడున్న మెదక్ జిల్లా అలాగే ఉంటుందని మెదక్ హెడ్ క్వార్టర్ గా జిల్లాగా కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. కాగా సిద్ధిపేట, సంగారెడ్డిలను రెండు కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు. జిల్లా కేంద్రానికి మిగితా ప్రాంతాలకు చాలా దూరం ఉన్నందున మెదక్ ను 3 జిల్లాలుగా విభాజిస్తునట్లు ఆయన ప్రకటించారు.అంతేకాక పాలన దృష్ట్యా కూడా సిద్ధిపేటను జిల్లాగా చేయాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అన్నారు. తమ నిర్ణయానికి కొందరు ధర్నాలు చేస్తూ వ్యతిరేకించ వచ్చని అయిన కూడా సిద్ధిపేట జిల్లాగా ఏర్పడుతుందని సీఎం స్పష్టం చేశారు.
Read more ...

టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమితులైన సాంబశివ రావు

సీనియర్ ఐఏఎస్ అధికారి డీ. సాంబశివ రావు టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమితులయ్యారు.
ఈ మేరకు బుధవారం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఆయన బాధ్యతలను స్వీకరించారు. ఇంతకుముందు ఈ స్థానంలో ఈవోగా పనిచేసిన ఎంజీ గోపాల్ ను హైదరాబాద్ లోని జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి బదిలీ అయ్యారు.ఈ నేపధ్యంలో సాంబశివరావు ను గోపాల్ స్థానంలో నియమించడం జరిగింది.
Read more ...

ఎనిమిది భాషల్లోకి సచిన్ టెండుల్కర్ జీవిత చరిత్ర

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ జీవిత చరిత్ర ‘ప్లేయింగ్ ఇట్ మై వే’ 8 భాషల్లో లభించనుంది.ఆంగ్ల మాధ్యమంలో విడుదలైన ఈ పుస్తకం మరో 6 నెలల్లో 8 భాషల్లోకి అనువాదం కానుంది.
ఒక ఉన్నతాధికారి మొదట మరాఠీలోకి అనువదించిన తర్వాత 8 భారతీయ భాషల్లోకి అనువాదం చేయడం జరుగుతుందని వెల్లడించారు. భారత్ కు చెందిన పబ్లిషింగ్ సంస్థ హాట్ చెట్ పూణేకు చెందిన మెహతా ముద్రణకార్యాలయంతో సచిన్ పుస్తకానికి సంబంధించి ఒప్పందాన్ని కుదుర్చుకుందని మెహతా ముద్రణా సంస్థ స్థాపకుడు అనిల్ మెహతా వెల్లడించారు. ఆయన ప్రస్తుతం ఈ పుస్తకాన్ని తాము అనువాదం చేస్తున్నామని తెలిపారు. మరాఠీ భాషలో ‘ప్లేయింగ్ ఇట్ మై వే’ ను ఆవిష్కరించిన తర్వాత 50వేల కాపీలకు పైగా అమ్ముడవుతాయని మెహతా స్పష్టం చేశారు.
Read more ...

Tuesday 16 December 2014

పాక్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో ఉగ్రవాదుల కాల్పులు..

తాలిబన్ ఉగ్రవాదులు మంగళవారం ఉదయాన్నే తమ రక్తదాహం తీర్చుకున్నారు.పెషావర్ లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో ఉగ్రవాదులు చొరబడి కాల్పులు జరిపి 160 మందిని పొట్టన పెట్టుకున్నారు.మంగళవారం ఉదయాన్నే ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లో వెళ్లి వాహనాన్ని తగలబెట్టి పాఠశాలలోకి చొరబడి కాల్పులతో అంతా రక్తసికం చేశారు. పాఠశాలలో బీతవాహ పరిస్థితి నెలకొంది.మృతుల్లో విద్యార్ధులు,పాఠశాల సిబ్బంది కూడా ఉన్నారు.గాయపడిన మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పెషావర్ సైనిక పాఠశాలను సైనికులు తమ అధినంలోకి తీసుకున్నారు.సుమారు 9 గంటల పాటు సైనిక చర్య కొనసాగింది. ఈ ఘటనలో తాలిబన్లు ఒక్కో గదికి తిరుగుతూ పాశవికంగా విద్యార్ధులపై కాల్పులకు పాల్పడ్డారు. పాఠశాలలో చొరబడిన ఉగ్రవాదుల్లో 6 హతమైనట్లు పాక్ సైన్యం తెలిపింది. వెంటనే పెషావర్ చేరుకున్న పాక్ ప్రధాని పరిస్థితిని సమీక్షించారు.ఆయన ఈ ఘటనపై బుధవారం అఖిల పక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం 11 గంటలకు పెషావర్లోని అన్ని పార్లమెంటరీ పార్టీలతో సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. నవాజ్ షరీఫ్ ఆర్మీ స్కూల్ పై దాడిని జాతీయ విషాధంగా ప్రకటించారు.పిల్లలను కోల్పోవడం తనకు వ్యక్తిగత నష్టమని ఆయన అన్నారు. ఈ సంఘటనతో ప్రపంచం యావత్తు దిగ్బ్రాంతికి గురైంది.వివిధ దేశాలు ఉగ్రవాద చర్యను ముక్తకంఠంతో ఖండించాయి. ఇదిలా ఉండగా.. ఆర్మీ స్కూల్ పై దాడికి పాల్పడింది తామేనని ప్రతీకార చర్యగానే ఈ దాడికి దిగినట్లు తాలిబన్ ప్రకటించింది.
Read more ...

అత్యంత వెచ్చని ఏడాది దిశగా ప్రపంచ ప్రయాణం

ప్రపంచం అత్యంత వెచ్చని ఏడాది దిశగా ప్రయాణిస్తుంది. 1880 తర్వాత గత నెల అత్యంత వెచ్చని ఏడవ నవంబర్ గా నిలస్తున్నప్పటికి 2014 అత్యంత వెచ్చని ఏడాదిగా నిలవనుంది. ఒకవేళ డిసెంబర్ 20 వ శతాబ్దపు సగటు కంటే కనీసం 0.42 డిగ్రీల సెల్సియస్ ఎక్కువుంటే,2014 అత్యంత వెచ్చని ఏడాదిగా నిలవనుంది. 1998,2005,2010 లు అత్యంత వెచ్చని ఏడాదిలుగా నిలిచాయి.
Read more ...

రోకలిబండతో ప్రియురాలిని హత్యచేసిన ఉన్మాది

ప్రేమించినోడే కాలయముడయ్యాడు.ఈ దారుణం వీపనగండ్ల మండలం బెక్కంలో జరిగింది.ఓ ప్రేమికుడు రోకలిబండతో మోదీ ప్రియురాలిని హత్య చేశాడు.ఆమెను చంపిన అనంతరం ప్రేమికుడు పరారీలో ఉన్నట్లు సమాచారం.యువతీ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.పోలీసులకి మృతురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
Read more ...

పొగాకు వాడకంలో టాప్ మనమే

ప్రపంచంలో 80% పొగాకు వాడకం భారతదేశం,బంగ్లాదేశ్ ల్లోనే వాడుతున్నారు.ఈ విషయం సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్,నేషనల్ క్యాన్సర్ ఇన్ స్టిటూట్ చేసిన అధ్యయనంలో తేలింది. ప్రపంచం మొత్తం మీద ఆగ్నేసియాలోనే పొగాకు వాడకందార్లు ఎక్కువున్నారని ఈ అధ్యయనం తెలియజేసింది. 70 దేశాల్లో 30 కోట్ల మంది పొగ రాని పొగాకు వాడుతుండగా 89%మంది ఆగ్నేసియాలోనే నివసిస్తున్నారు.నోటి క్యాన్సర్ బారిన పడ్డ ప్రజలు కూడా ఎక్కువగా ఇక్కడే ఉన్నారు.
Read more ...

Monday 15 December 2014

రూ.47 కోట్ల విలువైన జగన్ ఆస్తులను జప్తు చేసిన ఈడీ

ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ పెన్నా సిమెంట్స్ కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన మరో రూ.47 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. జప్తు వివరాలు: జగతి,జనని,ఇందిరా టెలివిజన్ కు చెందిన రూ.47 కోట్ల ఆస్తులు జనని ఇన్ ఫ్రాకు చెందిన రూ. 16.56 కోట్ల విలువైన ఆస్తులు కరీంనగర్, నల్గొండ, మహబూబ్ నగర్ కేంద్రాల్లో సాక్షి ప్రచురణ భవనాలు జగతి పబ్లికేషన్స్ కు చెందిన రూ.5.59 కోట్ల విలువైన యంత్ర సామగ్రి ఇందిరా టెలివిజన్ కు చెందిన రూ.24.85 కోట్ల విలువైన ఆస్తులు చిత్తూరు,కర్నూలు,నెల్లూరు,ప్రకాశం,కృష్ణాలోని సాక్షి ప్రచురణ కేంద్రాలు
Read more ...

764పరిశ్రమల వల్లే గంగానది కలుషితం:ప్రభుత్వం

గంగానదిని 764 పరిశ్రమలు కాలుష్యపూరితం చేస్తున్నాయని ప్రభుత్వం తెలిపింది.రాజ్యసభలో సోమవారం లేవనెత్తిన ఈ అంశంపై ప్రభుత్వం స్పందిస్తూ కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు నిర్దేశించిన ప్రకారం పైన పేర్కొన్న పరిశ్రమల్లో కేవలం ఉత్తరప్రదేశ్ నుంచే 687 పరిశ్రమలున్నాయని తెలిపింది. ఈ పరిశ్రమలు విడుదల చేసే రసాయనాలు గంగానదిలో గానీ లేదా ఉపనదులైన రామ్ గంగా, కలీ ఈస్ట్ లో గానీ కలిసి కలుషితమవుతున్నాయని కేంద్ర జలవనరుల శాఖ సహాయకమంత్రి సన్వర్లాల్ పేర్కొన్నారు.
Read more ...

Sunday 14 December 2014

తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ కన్నుమూత

తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ మృతి చెందారు.గుండెనొప్పితో కొంతకాలంగా వెంకటరమణ(67)బాధపడుతున్నారు.చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వెంకటరమణ మృతి చెందారు.వైద్యులు వెంకటరమణకు బైపాస్ సర్జరీ చేశారు. 2004,2014లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.వెంకటరమణ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు నటుడు బాలకృష్ణ సంతాపం తెలిపారు. వెంకటరమణ1947మార్చిలో తిరుపతిలో జన్మించారు.ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
Read more ...

హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేత జర్మనీ

జర్మనీ హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది.పాకిస్తాన్ జట్టుపై ఫైనల్ మ్యాచ్ లో 2-0 గోల్స్ తేడాతో జర్మనీ విజయం సాధించింది.భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ హాకీలో నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.ఆస్ట్రేలియా చేతిలో 1-2 గోల్ఫ్ తేడాతో భారత జట్టు ఓడిపోయింది.
Read more ...

ఐటీ దర్యాప్తుల బాధ్యత తీసుకున్న సీబీడీటీ చైర్ పర్సన్ అనితాకౌర్

పన్ను ఎగవేత,నల్లధనంపై విచారణల బాధ్యతను తానే తీసుకోవాలని సెంట్రల్ బోర్డు అఫ్ డైరెక్ట్ ట్యాక్స్ స్ (సీబీడీటీ) చైర్ పర్సన్ అనితాకౌర్ నిర్ణయించారు.ఈ బాధ్యతలను సాధారణగా అయితే సీబీడీటీలోని సభ్యుడికి అప్పగించేవారు.కాని ఈ అదనపు బాధ్యతలను కూడా తానే తీసుకున్న అనితాకౌర్..4 సభ్యులకు మిగితా బాధ్యతలను అప్పజెప్పారు. నల్లధనంపై దర్యాప్తు చేస్తున్న సిట్ లో సీబీడీటీ చైర్ పర్సన్ కు..శాశ్వత సభ్యత్వం ఉండటం,ఎక్కువగా పన్ను ఎగవేతకు సంబంధించి కేసులను దర్యాప్తు చేస్తుండటంతో అనితాకౌర్ ఈ అదనపు బాధ్యతలను తీసుకున్నారని ప్రభుత్వవర్గాలు తెలిపాయి.
Read more ...

ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి గుండెపోటుతో మృతి

ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి (40)గుండెపోటుతో మృతి చెందారు.చక్రి స్వస్థలం వరంగల్ జిల్లా మహబూబాబాద్.15 జూన్ 1974 లో జన్మించిన చక్రి అసలు పేరు చక్రధర్ గిల్లా. బాచి సినిమాతో చక్రి సంగీత దర్శకుడిగా తన కెరీర్ ను ప్రారంభించారు.85 చిత్రాలకు చక్రి సంగీత దర్శకత్వం వహించారు.సత్యం సినిమాకు ఉత్తమ గాయకుడిగా చక్రి ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు.సింహ సినిమాకు చక్రి నంది అవార్డ్ అందుకున్నారు.చక్రి సంగీతం అందించిన చివరి చిత్రం ఎర్రబస్సు. చిన్న వయస్సులోనేచక్రి పలు హిట్ సాంగ్స్ అందించారు.సత్యం,ఇడియట్,అమ్మానాన్న తమిళ అమ్మాయి,శివమణి,దేశముదురు,గోపి గోపిక గోదారి,మస్కానేనింతే,భగీరథ,సరదాగా కాసేపు, ఢీ, రంగ ది దొంగ చిత్రాలకు చక్రి సంగీత దర్శకత్వం వహించారు.
Read more ...

పాకిస్తాన్ హాకీ జట్టుపై క్రమశిక్షణ చర్యలు: హాకీ సమైక్య

హాకీ సమైక్య పాకిస్తాన్ హాకీ జట్టుపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.ముగ్గురు ఆటగాళ్ళపై ఫైనల్లో ఆడకుండా వేటు పడే అవకాశం ఉంది.భారతదేశంపై సెమీఫైనల్లో విజయం తర్వాత ప్యానస్ ను పాక్ ప్లేయర్లు ఎగతాళి చేశారు.కాగా భారత హాకీ టీమ్ పాకిస్తాన్ కోచ్ క్షమాపనను తిరస్కరించింది.ఆటగాళ్లందరూ కూడా క్షమాపణ చెప్పాలని లేకపోతే మార్చి లో జరగబోయే ద్వైపాక్షిక సీరీస్ ను రద్దు చేసుకుంటామని భారత ఆటగాళ్ల టీమ్ డిమాండ్ చేస్తూ హెచ్చరించింది. .
Read more ...

రష్యాపై ఆంక్షల బిల్లుకు ఆమోదం

బరాక్ ఒబామాను ధిక్కరించి మరీ అమెరికన్ చట్టసభ సభ్యులు రష్యాపై ఆంక్షలు విధించే బిల్లుకు ఆమోదం తెలిపారు. బిల్లుకు అమెరికా సెనేట్,ప్రతినిధుల సభ ఈ మేరకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి.రష్యాపై మరిన్ని ఆంక్షలకు అమెరికా అధ్యక్షుడు ఒబామా మాత్రం సుముఖత వ్యక్తం చేయడం లేదు. మరోవైపు ఉక్రెయిన్ లో రష్యా అనుకూల తిరుగుబాటుదారుల దాడిపై అమెరికా మరింత కఠిన వైఖరిని తీసుకోవడంపై రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది.అమెరికా చర్యలకు దీటుగా తమ చర్యలు ఉంటాయని తెలిపింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్- రష్యా దౌత్య సంబంధాలపై తమకేమీ అభ్యంతరం లేదని అమెరికా తెలియజేస్తూ భారతదేశం రష్యాతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది.
Read more ...

భారత్ కు హాకీలో నాలుగో స్థానం

చాంపియన్స్ ట్రోఫీలో భారతదేశం నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.ఆస్ట్రేలియా చేతిలో 1-2 గోల్ఫ్ తేడాతో భారత్ ఓటమిని చవిచూసింది.
Read more ...

మరోసారి జపాన్ ప్రధానిగా షింజో అబే

మరోసారి జపాన్ ప్రధానిగా షింజో అబే ఎన్నికయ్యారు.పార్లమెంట్ లో 2/3శాతం సిట్లతో లిబరల్ డెమోక్రటిక్ పార్టీ సాధించింది.ఆర్ధిక విధానాల వల్ల షింబో అబే విజయం సాధించారు.
Read more ...

Saturday 13 December 2014

ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఇళయరాజాకు నేషనల్ ఎమినెన్స్ అవార్డు

ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఇళయరాజాకు శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతి నేషనల్స్ ఎమినెన్స్ అవార్డు లభించింది.ముంబైలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేశారు.ఇళయరాజాతో పాటు ఈ అవార్డును ఉత్తరప్రదేశ్ గవర్నర్ రామ్ నాయక్ మరియు ప్రొఫెసర్ కే.విజయరాఘవన్ (సైన్స్ అండ్ టెక్నాలజీ),ఏపీ నుంచి కోటేశ్వరరావులు అందుకున్నారు.
Read more ...

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, విప్ ల నియామకం

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ విప్, విప్ లను నియమించింది. చీఫ్ విప్ గా కొప్పుల ఈశ్వర్ (ధర్మపురి ఎమ్మెల్యే)ను నియమించింది. విప్ లుగా..ముగ్గురిని నియమించింది వారు: గంపగోవర్ధన్ (కామారెడ్డి ఎమ్మెల్యే) నల్లాల ఓదెలు (చెన్నూరు ఎమ్మెల్యే) గొంగడి సునితా మహేందర్ రెడ్డి (ఆలేరు ఎమ్మెల్యే) ప్రభుత్వం నలుగురు లేదా ఆరుగురు ఎమ్మెల్యేలను పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించనుంది. శ్రీనివాస్ గౌడ్ (మహబూబ్ నగర్ ఎమ్మెల్యే) మరియు జలగం వెంకట్రావు (కొత్తగూడెం ఎమ్మెల్యే)లకు పార్లమెంటరీ సేక్రటరీలుగా నియమించే అవకాశంఉంది. కార్పోరేషన్ ఛైర్మెన్ లుగా మరో ఐదుగురు ఎమ్మెల్యేలను నియమించనున్నట్లు సమాచారం.
Read more ...

ఈనెల 18న ఇండియా రానున్న బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్

ఈనెల 18న బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్ హమీద్ భారత్ కు రానున్నారు.రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తమదేశ అధ్యక్షుడికి సేరిమోనియాల్ విజిట్ లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం పంపించారని బంగ్లాదేశ్ హై కమిషనర్ సయ్యద్ ముజీమ్ అలీ తెలిపారు.ఈమేరకు ఇండియా ను హమీద్ రానున్నట్లు ఆయన తెలిపారు.ఈ పర్యటనలో భాగంగా అబ్దుల్ హమీద్ ప్రధాని మోదీతో భూ సరిహద్దు ఒప్పందాల పై (ఎల్ బీఏ)చేర్చించనున్నట్లు వెల్లడించారు.
Read more ...

ఇంటలిజెన్స్ బ్యూరో చీఫ్ గా నియమితులైన దినేశ్వర్ శర్మ

ఇంటలిజెన్స్ బ్యూరో(ఐబీ)కు కొత్త చీఫ్ గా ఇంటలిజెన్స్ బ్యూరో స్పెషల్ డైరెక్టర్ అయిన దినేశ్వర్ శర్మ నియమితులయ్యారు.ఆయన ఈ మేరకు జనవరి 1న ఐబీ చీఫ్ గా బాధ్యతలు తీసుకోనున్నారు.కేరళ రాష్ట్రానికి చెందిన దినేశ్వర్ 1979 బ్యాచ్ కు
చెందిన ఐపీఎస్ అధికారి.
Read more ...

హాకీ సెమీస్ లో ఆసిస్ పై విజయం సాధించిన జర్మనీ

ఛాంపియన్స్ ట్రోపీ హాకీలో సెమీస్ లో జర్మనీ ఆసిస్ పై విజయం సాధించింది.3-2 గోల్ఫ్ తేడాతో ఆసిస్ పై విజయాన్ని సాధించిన జర్మనీ ఫైనల్ కు చేరింది.
Read more ...

Friday 12 December 2014

నన్ను ఇందిరా గాంధీ తిట్టారు :రాష్టపతి ప్రణబ్

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిన్న విడుదలైన ది డ్రమాటిక్ డికేడ్:ది ఇందిరాగాంధీ ఇయర్స్ పుస్తకంలో ఆసక్తికర విషయాలు ఎన్నో పొందుపర్చారు.1980 ఎన్నికల్లో ఇందిరా గాంధీ చెప్పిన వినకుండా పోటీ చేసి ఓడినందుకు ఆమెచే చివాట్లు తిన్నానని ప్రణబ్ ముఖర్జీ చెప్పారు.ఆ ఎన్నికల్లో భోల్ పూర్ నియోజక వర్గం నుండి పోటీ చేసిన ప్రణబ్ 68,629 ఓట్ల భారీ తేడాతో ఓడిపోయినప్పటికి మత్రివర్గంలో ఆయనకు చోటు దక్కడం విశేషం.
Read more ...

Thursday 11 December 2014

తెలంగాణాలో రోడ్ల నెట్ వర్క్ కు రూపకల్పన

దేశంలోనే అత్యుత్తమ పంచాయతీ రాజ్ రోడ్ల నెట్ వర్క్ కు తెలంగాణా ప్రభుత్వం రూపకల్పన చేస్తోంది. బీటీ రోడ్ల రేన్యువల్స్ కు ఏకకాలంలోనే ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి కేటీఅర్ తెలిపారు.దశల వారిగా రోడ్ల అప్ గ్రేడేషన్, కొత్త రోడ్లను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. మొత్తం 64,046 కిలోమీటర్ల మేర పంచాయతీ రోడ్ల నెట్ వర్క్ జరుగుతుందన్నారు. 18,564 కి.మీ.- బీటీ రోడ్లు 14,148 కి.మీ.-మెటల్ రోడ్లు 29,617 కి.మీ – మట్టి లేదా మొరం రోడ్లు వేస్తామని కేటీఆర్ చెప్పారు. 4,180 కి.మీ.మెటల్ రోడ్డును 2,380 కోట్లతో బీటీ రోడ్డుగా అప్ గ్రేడ్ చేస్తామన్నారు. 20,000 కి.మీ మట్టి రోడ్డుకు రూ.600 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. 2014-15 ఏడాదికి గానూ 1,767 కోట్లతో 12,006 కి.మీ.బీటీ రోడ్ల రెన్యువల్ చేస్తామని ఆయన ప్రకటించారు.
Read more ...

నైటీలతో వీధుల్లోకి వస్తే జరిమానా!

ఈ రోజుల్లో మహిళలు నైటీ వేసుకోవడం సర్వసాధరణమైపోయింది.అంతేకాదు నైటీలతోనే వీధుల్లో పచార్లు చేయడం పరిపాటిగా మారిపోయింది.అత్యాచారాలకు నైటీలే కారణమవుతున్నాయని భావించిన ఓ మహిలమండలి వాటిని నిషేధించాలని బావించింది.ఆలోచన వచ్చిందే తడవుగా నైటీలు ధరించి వీధుల్లోకి వస్తే సదరు మహిళకు 500 రూపాయలు జరిమానా విధించాలని నవీ ముంబైలోని గోఠీవలి గ్రామంలోని ఇంద్రాయణి మహిళామండలి నిర్ణయించింది. ఇక మహిళలు నైటీలు వేసుకొని ఇంటికే పరిమితం కావాలి.బయటిసి వస్తే జరిమానే. సాక్షాత్తు మహిళా మండలే ఫర్మానా జారీ చేసినందుకు ఈ నిబంధన పాటించల్సోస్తుంది.కొంతమంది స్త్రీలు ఈ కట్టుబాటుపై చికాకు పడ్తున్నారు.ఇలాంటి వాటిని ఏ పురుష పుంగవుడో రుద్దితే పెద్ద ధుమారమే జరిగేది.
Read more ...

ఆయిల్ స్పిల్ తో డాల్ఫిన్లకు ముప్పు

రెండు చమురు ట్యాంకర్లు ఢీకొన్న ప్రమాదంలో చమురు సముద్ర ఉపరితలంపై వ్యాపించడంతో డాల్ఫిన్లకు ముప్పు ఏర్పడింది.ఈ ఘటన బంగ్లాదేశ్ లో చోటు చేసుకుంది. మంగళవారం నాడు 3,50,000 లీటర్లతో ఓ ట్యాంకరు,సముద్రంపై ఇంకొక పడవను ఢీకొనడంతో సముద్రంలో మునిగిపోయింది.దీంతో నీటి ఉపరితలంపై 60 కి.మీ మేర చమురు పరుచుకుంది.దీని కారణగా సుందర్బన్ ప్రాంతంలోని షేలా,పస్పూర్ నదులలోని అరుదైన డాల్ఫిన్లకు ప్రమాదం ముంచుకొచ్చింది.
Read more ...

Wednesday 10 December 2014

నోబెల్ శాంతి బహుమతి అందుకున్న సత్యార్ది,మలాలా మూసుఫ్ జాయ్

బాలకార్మికుల హక్కుల కోసం అహర్నిశలు శ్రమించిన సత్యార్ధికి,బాలికల విద్య కోసం కృషి చేసిన మలాలా యూసుఫ్ జాయ్ లకు సమున్నత గౌరవం దక్కింది.బుధవారం నార్వేలోని ఓస్లోలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు నోబెల్ ఫౌండేషన్ మన దేశానికి చెందిన కైలాష్ సత్యర్ది,పాకిస్థాని బాలిక మలాలా మూసుఫ్ జాయ్ కి సంయుక్తంగా నోబుల్ శాంతి పురస్కారాన్ని అందజేసింది. నోబుల్ పురస్కారాలను డిసెంబర్ 10 న అల్ఫ్రెడ్ నోబుల్ వర్ధంతి సందర్భంగా అందజేయడం ఆనవాయితీ.
Read more ...

భారతదేశ జీడీపీ 5-6%: మూడీ

వచ్చే ఏడాది భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) మెరుగుపడ్తుందని రేటింగ్ ఏజెన్సీ మూడీ అంటోంది.గడిచిన రెండేళ్ళలో జీడీపీ 5% కంటే తక్కువగానే నమోదైంది.కాగా 2015 లో జీడీపీ 5 నుంచి 6%గా ఉంటుందని మూడీ అంచనా వేసింది. బలమైన దేశీయ డిమాండు,వైవిధ్య ఎగుమతి మార్కెట్లు జీడీపీ పెరుగుదలకు దోహదపడనున్నాయి.ఉద్యోగాలతో పాటు వినియోగమూ పెరగనుంది.గ్లోబుల్ మార్కెట్లలో ధరల తగ్గుదల దేశీయ ద్రవ్యోల్భణాన్ని అదుపులో ఉంచగలదని రేటింగ్ ఏజెన్సీ చెప్పింది.
Read more ...

పాలస్తీనా మంత్రి హతం

ఆక్రమిత వెస్ ట్ బ్యాంక్ లో ఓ ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటున్న పాలస్తీనా మంత్రి ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయారు.జైదు అబూ ఈన్ (50)కు ఎటువంటి ఫోర్టుఫోలియో ఇవ్వలేదు.అక్రమ సేటిల్మెంట్లకు నిరసనగా ఇతను 100 మంది విదేశీ, స్థానిక పజలతో కలిసి ర్యాలీ చేస్తుండగా ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడ్డారు.ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే రామల్లాలో చనిపోయారు.దీనిని పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ తీవ్రంగా ఖండించారు.
Read more ...

Monday 8 December 2014

రూ.200 కోట్లతో లింగా సినిమాకు భారీ ఇన్సూరెన్స్

భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమా అట్టర్ ప్లాప్ అయితే పరిస్థితి ఏంటీ?..ఇన్సూరెన్స్ లేకుంటే నిర్మాతలు దివాళా తీయాల్సిందే. నష్టాల భారీ నుంచి బయట పాడేందుకు ఈ మధ్య నిర్మాతలు తమ సినిమాకు ఇన్సూరెన్స్ చేయిస్తున్నారు.రజినీకాంత్, సోనాక్షి సిన్హా, అనుష్క నటించిన లింగా సినిమాకు నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ భారీ మొత్తానికి ఇన్సూరెన్స్ చేశాడు.200 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ చేసినట్లు సమాచారం.జగపతిబాబు ప్రతినాయకుడిగా నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 23000 సెంటర్లలో ఈ నెల12 న విడుదల కానుంది.
Read more ...

బాలీవుడ్ లో మరో జంట విడిపోనుంది

తాజాగా బాలివుడ్ లో మరో జంట విడిపోతుంది. నటీ పూజాభట్ తన భర్త మనీష్ మఖజా తో విడిపోతుంది.ట్విట్టర్లో పూజానే స్వయంగా ఈ విషయం తెలిపింది.వీరి వివాహం 1997 జరిగింది.పాప్ చిత్ర సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.
Read more ...

Saturday 6 December 2014

నాగాలాండ్ గవర్నర్ కు అస్సోం అదనపు బాధ్యతలు

నాగాలాండ్ గవర్నర్ పద్మనాభ బాలకృష్ణ ఆచర్యకు త్వరలో అస్సోం గవర్నర్ గా అదనపు బాధ్యతలు అప్పగించనున్నారు. అస్సొంకు కొత్త గవర్నర్ నియమితులయ్యే వరకు ఆయన గవర్నర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తారు.ప్రస్తుతం అస్సోం గవర్నర్ గా ఉన్న బేజీ పట్నాయక్ పదవీకాలం ఈ నెల 10తో ముగియనుంది.
Read more ...

రోడ్డు ప్రమాదంలో నందమూరి జానకీ రామ్ మృతి

నటుడు నందమూరి హరికృష్ణ కుమారుడు జానకీరామ్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు.ఈ దుర్ఘటన ఆయన ప్రయనిస్తోన్న టాటా సఫారీ కారును ట్రాక్టర్ ఢీకొనడంతో సంభవించింది.ఈ ప్రమాదం నల్లగొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద చోటుచేసుకుంది.జానకీరామ్ హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది.ఆయనను కోదాడ ఆస్పత్రికి తరలించి చికిత్స జరిపించిన లాభం లేకపోయింది.పరిస్థితి విషమించడంతో ఆయన మృతిచెందారు.జానకీరామ్ మృతిపట్ల సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.ఆయన మరణ వార్త తెలిసి తాను తీవ్ర దిగ్భ్రాంతికి లోనైనట్లు పేర్కొన్నారు.జానకీరామ్ మృతి హరికృష్ణ కుటుంబానికి తీరనిలోటని తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ ఈ మేరకు సంతాప సందేశం విడుదల చేశారు.
Read more ...

కారెక్కిన గుర్రం.. కారు ధ్వంసం

నగరంలో ఓ గుర్రం హాల్ చల్ సృష్టించింది.బషీర్ బాగ్ లోని దుకాణాల వద్ద నిలిపి ఉంచిన ఓ స్కోడాకారుపైకి ఎక్కి హాల్ చల్ చేసింది.కారుపైకి ఎక్కి గుర్రం కరతాల నృత్యం చేయడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది.ఈ ఘటనతో కారు యజమాని ఖంగుతిన్నాడు.చేసేది లేక కారును చూస్తూ పోయాడు.
Read more ...

అల్ ఖైదా గ్లోబల్ ఆపరేషన్స్ హెడ్ అద్నన్ హతం

అల్ ఖైదా గ్లోబల్ ఆపరేషన్స్ హెడ్ అద్నన్ షుక్రిజమా హతమయ్యాడు.న్యూయార్క్ సబ్ వే పేలుళ్లలో అద్నన్ కీలక పాత్ర పోషించాడు.పాకిస్థాన్ ఆర్మీ
షుక్రిజమాను కాల్చి చంపినట్లు ప్రకటించింది.
Read more ...

ఫేస్ బుక్ ప్రేమపెళ్ళి..ముద్దుతో పెళ్ళి పెటాకులు

ఓ ముద్దుతో పెళ్ళి పెటాకులైంది.దీనికి ఉత్తర ప్రదేశ్ లోని ఆలీఘర్ లో పెళ్ళి మండపం వేదికైంది. వధూవరుల బంధు మిత్రుల పలకరింపులతో సందడి సందడిగా ఉంది ఆ వివాహ ప్రాంగణం.వేద పండితుల మంత్రోఛ్ఛారన, మంగళ వాద్యాలు మిన్నంటగా వధువు మెడలో వరుడు మాంగల్యధారణ కానిచ్చాడు. కానీ నివ్వరపోయే దృశ్యం అంతలోనే అక్కడ చోటు చేసుకుంది.

వరుడి పక్కనే ఉన్న అతని వదిన ఉద్రేకంతో అతన్ని ముద్దాడింది.అంతే అవక్కవ్వడం అక్కడున్న వారి వంతయింది.

ఆ తర్వాత వదిన, తన మరిదిని పక్కనే ఉన్న వేదిక మీదకు లాక్కెళ్ళి ఆనంద పారవశ్యంతో అతనితో కాలు కలిపి డాన్స్ చేసింది.దీంతో.. చిర్రెత్తుకొచ్చిన వధువు మండపం మీద నుంచే లేచి వెళ్ళిపోయింది.

ఇరు వర్గాల వారు భాహుభహీ తలపడ్డారు.వధువు తరుపు వారు వరున్ని ఒకరోజు గదిలో బంధించగా.. మరుసటి రోజు వరుని తరుపు బంధువులు వచ్చి అతన్ని విడిపించారు.

పెళ్ళిళ్ళు స్వర్గంలో నిశ్చయమవుతాయని పెద్దలంటారు.ఇప్పుడు ఫేస్ బుక్ లో నిశ్చయమవుతున్నాయనుకోండి! ఈ వధూవరులు కూడా ఫేస్ బుక్ లో పరిచయమై ప్రేమించుకొని పెళ్ళి వరకు వచ్చినవారే.

Read more ...

Friday 5 December 2014

భారత్ కు వస్తున్న రష్యా అధ్యక్షుడు

వచ్చేవారం డిసెంబర్ 10,11 న భారత్-రష్యాల 15వ ద్వైపాక్షిక సదస్సులో పాల్గొనడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ కు రానున్నారు.ఇటివల ఇరుదేశాల నాయకులు కొన్ని అంతర్జాతీయ సదస్సులో కలిసినప్పటికీ నిర్మాణాత్మక చర్యలు జరగలేదు.ఈ 15వ ద్వైపాక్షిక సదస్సులో మోదీ, పుతిన్ లు వ్యూహాత్మక చర్యలు జరుపుతారు.
Read more ...

మాల్దీవులకు తాగునీరు సాయం చేసిన ఇండియా

రాజధాని మాలేలో ప్రధాన వాటర్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో లక్ష్య మంది తగునీరులేక అలమటిస్తున్నారు. మాల్దీవుల ప్రభుత్వం తాగునీటి కోసం శ్రీలంక, ఇండియా,చైనా లను అభ్యర్ధించింది. దీనికి స్పందించిన భారత్ 5 విమానాల్లో తాగునీటిని ఐఎల్-76 విమానంలో మాల్దీవులకు పంపింది.అక్కడి చిన్న చిన్న పర్యాటక దీవులు మరియు ఆసుపత్రులు స్వంతంగా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లను కలిగి ఉంటాయి.
Read more ...

ఒరియస్ స్పేస్ క్రాఫ్ట్ ప్రయోగం విజయవంతం.

మానవ యాత్ర లక్ష్యంలో అరుణగ్రహానికి నూతన శకం ఆరంభమైంది.అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మనవ రహిత ఓరియన్ అంతరిక్ష నౌకను విజయవంతంగా ప్రయోగించింది.ఇది రెండు సార్లు భూమి చుట్టూ కక్ష్యలో పరిభ్రమించి,6000 కి.మీ. ఎత్తుకు వెళ్ళిన తర్వాత స్పేస్ క్యాపూల్స్ తిరిగి పసిఫిక్ సముద్రంలో కూలుతుంది.ఈ ప్రయోగానికి మొత్తం నాలుగున్నర గంటల సమయం పడుతుంది.42 ఏళ్ళ తర్వాత మానవుల ప్రయాణానికి ఉద్దేశించిన స్పేస్ క్రాఫ్ట్ ను నాసా పంపడం ఇదే తొలిసారి.
Read more ...

ప్రధానితో ఆర్మీ చీఫ్ అత్యవసర భేటీ

జమ్మూలో ఇవాళ ఉదయం నుంచి మూడుసార్లు వరుసగా తీవ్రవాదులు దాడులకు తెగబడ్డారు.ఈ దాడుల్లో లెఫ్ట్ నెంట్ కల్నల్ సహా 7గురు జవాన్లు మృతి చెందారు. దొంగ చాటు టెర్రర్ దాడులను భారతా దళాలు దీటుగానే ఎదుర్కొన్నాయి.ఆర్మీ కాల్పుల్లో ఆరుగురు ముష్కరులు హతమయ్యారు.జమ్మూకాశ్మీర్ లో టెర్రర్ దాడుల నేపధ్యంలో ప్రధాని నరేంద్రమోడీతో ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ సుహా అత్యవసర భేటీ అయ్యారు.
Read more ...

Thursday 4 December 2014

బీజీపీ జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర పర్యటన ఖరారు

బీజీపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్ర పర్యటన ఖరారు అయ్యింది.ఈమేరకు పార్టీ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. అమిత్ షా ఈ నెల 27,28 తేదీల్లో రాష్ట్రంలో పర్యటిస్తారు. వరంగల్ లో 27న జిల్లా అధ్యక్షుడు,ముఖ్యనేతలతో భేటీ కానున్నారు. 28న విడివిడిగా హైదరాబాద్ లో ముఖ్యనేతలతో సమావేశమవుతారు.
Read more ...

ఇస్లామిక్ మిలిటెంట్ కూతురే ఆమె

లెబనాన్ అధికారుల కస్టడీలో ఉన్న తల్లీ,కూతుళ్ళు ఇస్లామిక్ స్టేట్ చీఫ్ అబూబకర్ అల్ బాగ్దాది భార్యబిడ్డలని తేలింది.సాజా అల్ దులామి కూతురు డీఎన్ఏ ఇస్లామిక్ మిలిటెంట్ నాయకుడు అబూబకర్ డీఎన్ఏ సాంపిల్ తో సరిపోయింది.దీనిపై లెబనాన్ మంత్రి స్పందిస్తూ 3 నెలల సహజీవనానికి సమ్మతిస్తూ ఆరేళ్ళ క్రితం దులామి, అల్ బాగ్దాది వివాహం చేసుకున్నారని, వీరిద్దరితో పాటు మరో ఇద్దరు చిన్న పిల్లలను చైల్డ్ కేర్ సెంటర్ లో ఉంచమని ఆయన అన్నారు.
Read more ...
Designed By Published.. Blogger Templates