బాహుబలి ట్రైలర్ ను సోమవారం ఉదయం 10:30 నిమిషాలకు రాష్ట్ర వ్యాప్తంగా పలు థియేటర్ లలో విడుదల చేశారు.సినిమాను విడుదల చేస్తే ఎలాంటి కోలాహలం ఉంటుందో అలాంటి కోలాహలమే థియేటర్ల వద్ద ఉంది.కేవలం విడుదల చేసింది 2 నిమిషాల ట్రైలరే అయినా భారీ కటౌట్ లతో థియేటర్ ప్రాంగణాలు నిండిపోయాయి.
రెండు నిమిషాల 5 సెకండ్ల నిడివి గల ఈ ట్రైలర్ పై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇంతకీ ట్రైలర్ లో ఏముంది? ట్రైలర్ ఎలా ఉంది ?
ట్రైలర్ చూస్తే సినిమా కథ ఏంటో దాదాపు అర్థం అవుతుంది.హీరో చిన్నతనంలో తప్పిపోవడం,వేరే చోట పెరగడం,కాని అతడి మూలాలు అతన్ని వెంటాడుతుంటాయి.
ట్రైలర్ మొత్తంలో ఒక్క చోట తప్ప ఎక్కడా మాటలు ఉండవు.ఆ ఒక్క మాట “ఎప్పుడూ చూడని కళ్ళు నన్ను దేవుడిలా చూస్తున్నాయి,ఇంతకి నేను ఎవరిని”అని బాహుబలి ప్రశ్నిస్తాడు.”మా దేవుడు అమరేంద్ర బాహుబలి రక్తానివి నువ్వు”….
ట్రైలర్ లో కనిపించే వాటర్ ఫాల్ సన్నివేశం,కీరవాణి గారి బ్యాక్ గ్రౌండ్ సంగీతం చాలా బాగున్నాయి.వర్షంలో ప్రభాస్,రాణా ఇంట్రడక్షన్ అదుర్స్.జూలై 10న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.
No comments:
Post a Comment