Radio LIVE


Breaking News
Showing posts with label Telugu Cinema News. Show all posts
Showing posts with label Telugu Cinema News. Show all posts

Saturday, 6 June 2015

నటి ఆర్తి అగర్వాల్ కన్నుమూత


ప్రముఖ తెలుగు సినీ నటి ఆర్తి అగర్వాల్(31) కన్నుమూశారు.అమెరికా లోని అట్లాంటికి సిటీ న్యుజర్సీ లోని ఒక ఆసుపత్రిలో ఊబకాయంతో పాటు శ్వాశకోశ వ్యాధితో భాదపడుతూ గుండెపోటుతో మృతి చెందారు.కొద్ది రోజుల క్రితం ఊబకాయాన్ని తగ్గించుకోవడానికి లైపోసక్షన్ ఆపరేషన్ చేయించుకున్నా అది వికటించడం కూడా తన మరణానికి కారణం అని తెలుస్తుంది.
2001 లో 'నువ్వు నాకు నచ్చావ్' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ఆర్తి అగర్వాల్ 1984 మార్చి 5న న్యూ జర్సీ లో జన్మించారు.'పాగల్ పన్' అనే బాలీవుడ్ చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేసిన ఆర్తి తరువాత తెలుగులో దాదాపు 30 సినిమాల్లో హీరోయిన్ గా అందరూ ప్రముఖుల సరసన నటించి తనకంటూ తెలుగు సినీ రంగంలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది.ఆర్తి అగర్వాల్ చివరిసారిగా నటించిన చిత్రం రణం 2.
చిరంజీవితో ఇంద్ర,బాలకృష్ణ తో పల్నాటి బ్రహ్మనాయుడు, నాగార్జున తో నేనున్నాను,వెంకటేష్ తో నువ్వు నాకు నచ్చావ్,సంక్రాంతి,వసంతం, మహేష్ బాబుతో బాబి ,జూనియర్ ఎన్టీఆర్ అల్లరి రాముడు,ప్రభాస్ తో అడవి రాముడు,తరుణ్ తో నువ్వు లేక నేను లేను,ఉదయ్ కిరణ్ నీ స్నేహం,సునీల్ తో అందాల రాముడు,రవి తేజ తో వీడే,రాజశేఖర్ తో గోరింటాకు మొదలగు చిత్రాల్లో నటించింది ఆర్తి.
2005 సంవత్సరంలో ఆత్మహత్యా యత్నం చేసిన ఆర్తి అగర్వాల్ 2007 సంవత్సరంలో గుజరాతీ ప్రవాస భారతీయుడు ఉజ్వల్ తో వివాహం చేసుకున్న ఆర్తి ఆ తరువాత ఉజ్వల్ తో విడాకులు తీసుకుంది.
అయితే ఆర్తి కేవలం 31 సంవత్సరాలకే తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోవడం ప్రతీ ఒక్కరిని దిగ్భ్రాంతికి గురిచేసింది.తన మృతి పట్ల సినీ ప్రముఖులు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఆర్తి అగర్వాల్ సోదరి అతిధి అగర్వాల్ కూడా పలు తెలుగు సినిమాల్లో నటించింది.

Read more ...

Friday, 5 June 2015

అసుర సినిమా రివ్యూ


సినిమా : అసుర 
నటీనటులు : నారా రోహిత్, ప్రియ బెనర్జీ, రవి వర్మ 
దర్శకుడు : కృష్ణ విజయ్ 
నిర్మాత : శ్యామ్ దేవభక్తుని 
సంగీతం : సాయి కార్తీక్ 
సర్టిఫికేట్ : U/A
విడుదల : 05 జూన్ 2015
రేడియో జల్సా రేటింగ్ : 3/5
తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న యువ హీరో నారా రోహిత్ నటించిన చిత్రం 'అసుర' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అసుర సినిమా మీద ఒక్కసారిగా అంచనాలు పెరిగిన నేపథ్యంలో సినిమా ఎలా సమీక్ష చూద్దాం..

కథ :

ధర్మ తేజ(నారా రోహిత్) రాజమండ్రి సెంట్రల్ జైలులో జైలు అధికారిగా పనిచేస్తుంటాడు.నిజాయితీకి మారు పేరులా,తప్పు చేసిన వారికి సింహ స్వప్నంలా ఉంటాడు ధర్మ.దుష్టులను,నేరగాళ్లను శిక్షించడంలో అసురుడిలా వ్యవహరిస్తాడు హీరో,కాబట్టి చిత్రానికి 'అసుర' అనే పేరు పెట్టారు.
తన కుటుంబసభ్యులను హత్య చేసిన ఘటనలో చార్లీ(రవి వర్మ)ని మరణ శిక్ష విధించడానికి ధర్మ ఉన్న జైలుకు తరలిస్తారు.అయితే జైలు నుండి తప్పించుకునే పనిలో ధర్మ అనేక ఎత్తులు వేస్తుంటాడు.తనను జైలు నుండి తప్పిస్తే స్థానికంగా ఉన్న కొంతమంది తన అనుచరులకు 50 విలువైన వజ్రాలు ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకుంటాడు చార్లీ.ధర్మ కు ప్రాణమైన హారిక(ప్రియా బెనర్జీ) ను కిడ్నాప్ చేస్తారు.ఆ తరువాత ధర్మ ఏం చేస్తాడు?హారిక ను ఎలా రక్షించుకుంటాడు? చార్లీకి మరణ శిక్ష పడుతుందా ? మొదలగు అంశాలు తెలుసుకోవాలంటే చిత్రాన్ని వెండితెర మీద చూడాల్సిందే.

నటీనటుల పనితీరు :

తను నటించిన మిగతా చిత్రాలతో పోల్చుకుంటే నారా రోహిత్ నటన చాలా మెరుగైంది అని చెప్పాలి.డైలాగు డెలివరీ విషయంలో రోహిత్ ది ప్రత్యేక శైలి.పోలీసు అధికారిగా కనిపించిన రోహిత్ కొంచెం బొద్దుగా కనిపించాడు,అది ఒక్కటి తప్ప రోహిత్ చెప్పే డైలాగ్ లు యాక్షన్ సన్నివేశాలు బాగుంటాయి.
ప్రియా బెనర్జీ పాత్ర చిన్నదే అయినప్పటికీ స్మైల్ తోపాటు ప్రతిభతో కూడిన నటన కనబరిచింది.రవి వర్మ పోషించిన చార్లీ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు.కానిస్టేబుల్ గా నటించిన వెన్నెల రామా రావు పర్వాలేదు అనిపించాడు.ఇంకా మధు సింగంపల్లి, రవివర్మ, సత్య లు తమ పరిధిలో ఓకే అనిపించారు.

సాంకేతిక వర్గం :

సాంకేతిక వర్గం విషయానికి వస్తే ముందుగా సినిమాటోగ్రఫి గురించి మాట్లాడుకోవాలి.ఒక్కమాటలో చెప్పాలంటే యస్.వి.విశ్వేశ్వర్ అందించిన సినిమాటోగ్రఫి అద్భుతం.స్క్రీన్ ప్లే కూడా చాలా చాలా బాగుంటుంది.సాయి కార్తీక్ అందించిన సంగీతం బెష్.ఎడిటింగ్ విషయానికి వస్తే సినిమా చూస్తుంటే ఎడిటింగ్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు కనిపిస్తుంది.

ప్లస్ పాయింట్లు :

నారా రోహిత్ నటన,అతని బేస్ వాయిస్ తో చెప్పే డైలాగ్ లు
దర్శకుడు 
సాంకేతిక వర్గం 
విజువల్స్ సినిమాకు హైలైట్ గా నిలుస్తాయి
సంగీతం 
యస్.వి.విశ్వేశ్వర్ అందించిన సినిమాటోగ్రఫి
సినిమాలో వచ్చే ట్విస్ట్ లు నచ్చుతాయి
ఇంటర్మిషన్ ముందు వచ్చే సన్నివేశాలు ఉత్కంఠకు గురిచేయడమే కాకుండా క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలను ఊహించలేము

మైనస్ పాయింట్లు :

నారా రోహిత్ పోలీసు ఆఫీసర్ గా కనిపించాడు కాబట్టి కొంచెం లావు తగ్గి ఉండాల్సింది.తెర మీద రోహిత్ కనిపించగానే ప్రతీ ఒక్కరి మదిలో మెదిలేది అదే.
సినిమా అక్కడక్కడా నెమ్మదించడం  
కామెడీ లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేవనే చెప్పాలి
ప్రియా బెనర్జీ పాత్ర పరిమితం 
పాటల్లో తప్ప రోహిత్,ప్రియా ల మధ్య రొమాన్స్ సినిమా కథను పక్కకు మల్లించినట్టు కనిపిస్తుంది

తీర్పు :

ఒక సాధారణమైన కథను దర్శకుడు చెప్పాలనుకున్న విధానం బాగుంది.అన్యాయాలు,నేరాలు చేసిన వ్యక్తులు తప్పించుకోకుండా ఒక పోలీసు అధికారి తన విధులను నిర్వర్తించడమే సినిమా కథ.నారా రోహిత్ అంటే ఒక వర్గం ప్రేక్షకులకు ఓ ప్రత్యేక అభిప్రాయం ఉంది,వారికి కచ్చితంగా మెప్పించే సినిమా అసుర. కమర్షియల్ ఎలిమెంట్స్ కోరుకునే వారిని నిరుత్సాహపరుస్తుంది.యాక్షన్,తిల్లర్ సినిమా లు కోరుకునే వారికి నచ్చే సినిమా 'అసుర'. 
 

Read more ...

Monday, 1 June 2015

బాహుబలి ట్రైలర్ విడుదల

ఎట్టకేలకు బాహుబలి ట్రైలర్ ను విడుదల చేశారు.ట్రైలర్ చూస్తుంటే అంచనాలు పెంచుతున్నాయి సినిమా మీద.
Read more ...

బాహుబలి ట్రైలర్ ను థియేటర్ లో విడుదల,ట్రైలర్ ఇలా ఉంది…!


బాహుబలి ట్రైలర్ ను సోమవారం ఉదయం 10:30 నిమిషాలకు రాష్ట్ర వ్యాప్తంగా పలు థియేటర్ లలో విడుదల చేశారు.సినిమాను విడుదల చేస్తే ఎలాంటి కోలాహలం ఉంటుందో అలాంటి కోలాహలమే థియేటర్ల వద్ద ఉంది.కేవలం విడుదల చేసింది 2 నిమిషాల ట్రైలరే అయినా భారీ కటౌట్ లతో థియేటర్ ప్రాంగణాలు నిండిపోయాయి.
రెండు నిమిషాల 5 సెకండ్ల నిడివి గల ఈ ట్రైలర్ పై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇంతకీ ట్రైలర్ లో ఏముంది? ట్రైలర్ ఎలా ఉంది ?
ట్రైలర్ చూస్తే సినిమా కథ ఏంటో దాదాపు అర్థం అవుతుంది.హీరో చిన్నతనంలో తప్పిపోవడం,వేరే చోట పెరగడం,కాని అతడి మూలాలు అతన్ని వెంటాడుతుంటాయి.
ట్రైలర్ మొత్తంలో ఒక్క చోట తప్ప ఎక్కడా మాటలు ఉండవు.ఆ ఒక్క మాట “ఎప్పుడూ చూడని కళ్ళు నన్ను దేవుడిలా చూస్తున్నాయి,ఇంతకి నేను ఎవరిని”అని బాహుబలి ప్రశ్నిస్తాడు.”మా దేవుడు అమరేంద్ర బాహుబలి రక్తానివి నువ్వు”….
ట్రైలర్ లో కనిపించే వాటర్ ఫాల్ సన్నివేశం,కీరవాణి గారి బ్యాక్ గ్రౌండ్ సంగీతం చాలా బాగున్నాయి.వర్షంలో ప్రభాస్,రాణా ఇంట్రడక్షన్ అదుర్స్.జూలై 10న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.
Read more ...

Sunday, 31 May 2015

మహేష్ బాబు 'శ్రీమంతుడు' టీజర్ విడుదల

మైత్రి మూవీ మేకర్స్,మహేష్ బాబు నిర్మాణ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్న 'శ్రీమంతుడు' టీజర్ ను ఆదివారం విడుదల చేశారు.కొరటాల శివ దర్శకతంలో మహేష్ బాబు,శృతి హసన్ జంటగా నటించిన ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా మే 31న శ్రీమంతుడు టీజర్ ను విడుదల చేశారు.
Read more ...

Saturday, 30 May 2015

ప్రిన్స్ మహేష్ బాబు 'బ్రహ్మోత్సవం' లోగో విడుదల,షూటింగ్ షురూ

ప్రిన్స్ మహేష్ బాబు తదుపరి చిత్రం 'శ్రీమంతుడు' ఫస్ట్ లుక్ విడుదల అయిన 24 గంటల్లో 'బ్రహ్మోత్సవం' లోగో ను విడుదల చేశారు.శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న 'బ్రహ్మోత్సవం' షూటింగ్ సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు అయిన మే 31 న ప్రారంభం కానుంది.

కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా 'బ్రహ్మోత్సవం' లోగో ను విడుదల చేశారు.లోగో లో పేరు పక్కనే వెంకటేశ్వర స్వామి పాదాలు,పూర్ణ కుంభం ఉన్నాయి.'బ్రహ్మోత్సవం' పేరు చూడడానికి చాలా బాగుంది.

పీవీపీ బ్యానర్ లో ప్రసాద్ వి పొట్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించనుంది.పద్మాలయ స్టూడియోస్ లో మే 31న చిత్ర పూజా కార్యక్రమాలు జరుగుతాయి.



Read more ...

బాహుబలి ది బిగినింగ్ టీజర్ విడుదల చేసిన నటి అనుష్క

మొదటిసారి బాహుబలి చిత్ర టీజర్ ను శనివారం సాయంత్రం 7:25 నిమిషాలకు విడుదల చేశారు నాటి అనుష్క. జూన్ 1,2015న బాహుబలి చిత్ర ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. టీజర్ మీకోసం... వీక్షించండి....
Read more ...

Friday, 29 May 2015

మహేష్ బాబు ‘శ్రీమంతుడు’ ఫస్ట్ లుక్ విడుదల

‘మిర్చి’ ఫేం కొరటాల శివ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు,శృతి హసన్ కలిసి నటిస్తున్న చిత్రం ‘శ్రీమంతుడు’.ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను శుక్రవారం విడుదల చేశారు చిత్ర బృందం.

సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు మే-31న ఫస్ట్ లుక్ తోపాటు,టీజర్ ను విడుదల చేస్తామని చిత్ర యూనిట్ భావించినా రెండు రోజుల ముందుగానే శ్రీమంతుడు ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.అయితే టీజర్ ను 31న విడుదల చేసే అవకాశం ఉంది.

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, మోహన్‌లు సమష్టిగా నిర్మించిన శ్రీమంతుడు ఫస్ట్ లుక్ పోస్టర్ లో మహేష్ బాబు సైకిల్ మీద దూసుకొచ్చే పోస్టర్ ను ముందుకు తీసుకొచ్చారు. అయితే చిత్రాన్ని జూలై 17న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Read more ...

Friday, 22 May 2015

బాహుబలి చివరి పోస్టర్ విడుదల చేసిన రాజమౌళి

సాహస విక్రమ ధీశాలి ! రణతంత్ర కళా కుశలి !! అంటూ చివరి బాహుబలి పోస్టర్ ను ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు దర్శకుడు రాజమౌళి.భారీ శివలింగం మోస్తున్న ప్రభాస్ మొదటి పోస్టర్ ను విడుదల చేసిన రాజమౌళి,శుక్రవారం బాహుబలి చివరి పోస్టర్ లో ప్రభాస్ రణరంగంలో శతృవులను చీల్చి చెండాడుతున్న పోస్టర్ ను విడుదల చేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా బాహుబలి చిత్రానికి విపరీత ప్రచారం చేసిన రాజమౌళి చిత్ర ఆడియోను మే 31 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.
Read more ...

Wednesday, 20 May 2015

భల్లాలదేవ గా ధీరత్వం ఉట్టిపడే రాణా పోస్టర్ తో బాహుబలి మరో పోస్టర్

బాహబలి చిత్రంలో మరో పోస్టర్ ను విడుదల చేశారు దర్శకుడు రాజమౌళి.ధీరత్వం ఉట్టిపడేలా యుద్దరంగంలో పోరాడుతున్న భల్లాలదేవ పాత్రను పోషించిన రాణా పోస్టర్ ను ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు మౌళి.భల్లాలదేవ ఒక నిరంకుశ రాజు అని తన ట్వీట్ లో తెలిపాడు దర్శకుడు రాజమౌళి. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్ లు చూస్తుంటే సినిమా మీద అంచనాలు ఎక్కువయ్యాయి.మే 22న చివరి పోస్టర్ ను విడుదల చేశాక మే 31న ఆడియో విడుదల చేస్తున్నారు.ఆడియోను లహరి మ్యూజిక్ ద్వారా విడుదల చేస్తున్నట్టు లహరి మ్యూజిక్ అధినేత జి.మనోహర్ నాయుడు తెలిపారు.ఇప్పటి వరకు ఏ సినిమాకు లేని విధంగా బాహుబలి సినిమా ఆడియో తెలుగు,తమిళ హక్కులను దక్కించుకుంది లహరి మ్యూజిక్.
Read more ...

Monday, 18 May 2015

'ఆమె అందం ఒక రహస్యం'..బాహుబలి లో అవంతికగా తమన్న

'ఆమె అందం ఒక రహస్యం'.... అంటూ ట్వీట్ చేస్తూ ట్విట్టర్ ద్వారా బాహుబలి మరో కొత్త పోస్టర్ ను విడుదల చేశారు దర్శకుడు రాజమౌళి.'బాహుబలి ది బిగినింగ్' సినిమాలోని ముఖ్యపాత్రల పోస్టర్లను విడుదల చేస్తూ సినిమా మీద అంచనాలను పెంచుతున్న రాజమౌళి సోమవారం అవంతిక పాత్రదారి అయిన తమన్నా పోస్టర్ ను విడుదల చేశారు. ఇంకో రెండు పోస్టర్లను విడుదల చేశాక మే 31 చిత్ర ఆడియోతో పాటు ట్రైలర్ ను విడుదల చేయనున్నారు.మే 20న భల్లాలదేవ పోస్టర్ ను,మే 22న బాహుబలి పోస్టర్లు విడుదల కావాల్సిఉన్నాయి.
Read more ...

Sunday, 17 May 2015

'జ్యోతిలక్ష్మి' ఫస్ట్ లుక్ ట్రైలర్ ను విడుదల చేసిన పూరిజగన్నాథ్

పూరిజగన్నాథ్ దర్శకత్వంలో ఛార్మి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'జ్యోతిలక్ష్మి'.ఛార్మి పుట్టినరోజు అయిన మే 17న 'జ్యోతిలక్ష్మి' ఫస్ట్ లుక్ ట్రైలర్ ను విడుదల చేశారు దర్శకుడు పూరిజగన్నాథ్. కేవలం 37 రోజుల్లోనే 'జ్యోతిలక్ష్మి' చిత్రాన్ని పూర్తి చేశారు పూరి.సికే ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వస్తున్న ఈ చిత్రాన్ని సి.కళ్యాణ్ నిర్మించారు. ఈ ట్రైలర్ లో కొత్తగా కనిపిస్తుంది.అలాగే బ్రహ్మానందం,సంపూర్నేష్ బాబు కూడా ఈ ట్రైలర్ లో కనిపించారు.త్వరలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ట్రైలర్ ను మీరు వీక్షించండి..............
Read more ...

Saturday, 16 May 2015

బాహుబలి కొత్త పోస్టర్ విడుదల : అస్లాం ఖాన్ గా కిచ్చా సుదీప్

బాహుబలి ది బిగినింగ్ లో మరో కొత్త పోస్టర్ ను దర్శకుడు రాజమౌళి విడుదల చేశారు.శుక్రవారం కట్టప్ప పాత్రలో నటించిన సత్యరాజ్ పోస్టర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే.మరో 24 గంటల్లోనే కన్నడ నటుడు అస్లాం ఖాన్ గా కనిపించే కిచ్చా సుదీప్ పోస్టర్ ను విడుదల చేశారు రాజమౌళి. నా అభ్యర్థన మేరకు బాహుబలి ది బిగినింగ్ చిత్రంలో అతిథి పాటలో నటించినందుకు సుదీప్ కు నా కృతజ్ఞతలు అని తన ట్వీట్ లో తెలిపారు రాజమౌళి.
Read more ...

Friday, 15 May 2015

బాహుబలి కొత్త పోస్టర్ : కట్టప్పగా కనిపించనున్న సత్యరాజ్

బాహుబలి మరో పోస్టర్ ను ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి శుక్రవారం విడుదల చేశారు.ఈ పోస్టర్ లో సత్యరాజ్ కట్టప్పగా కనిపించారు. "జీవితాంతం నిజాయితీకి మారు పేరుగా జీవించిన కట్టప్ప,ఆ నిజాయితి అతన్ని గర్వంగా చెప్పుకునేలా నిలబెట్టిందా లేకా అదే నిజాయితి అతన్ని బలి తీసుకుందా" అని ట్వీట్ లో తెలిపారు రాజమౌళి. కట్టప్ప వెనకాల బ్యాక్ గ్రౌండ్ కూడా పెద్ద యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుంది. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లతో బాహుబలి మీద అంచనాలు పెరిగాయి.  
Read more ...

Thursday, 14 May 2015

నందమూరి బాలకృష్ణ మాస్ మసాలా 'లయన్' మూవీ రివ్యూ మరియు రేటింగ్

సినిమా : లయన్ 
నటీనటులు : బాలకృష్ణ, త్రిష, రాధిక ఆప్టే, ప్రకాశ్ రాజ్
సంగీతం : మణిశర్మ
నిర్మాత : రుద్రపాటి రమణారావు 
దర్శకత్వం : సత్యదేవ్ 
విడుదల : మే 14, 2015
రేడియో జల్సా రేటింగ్ : 3/5
'లెజెండ్' తో విజయాన్ని అందుకున్న బాలకృష్ణ తదుపరి చిత్రం 'లయన్' భారీ అంచనాలతో గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.బాలకృష ద్విపాత్రాభినయం చేసిన మాస్ మసాలా ఎంటర్టైనర్ 'లయన్' అందరి అంచనాలను అందుకుందా,బాలయ్య బాబుకు మరో హిట్ ఇచ్చిందా ఇప్పుడు చూద్దాం.
కథ :
సినిమా కథ ముంబై లోని ఒక ఆసుపత్రిలో మొదలౌతుంది.కట్ చేస్తే  గాడ్సే(బాలకృష్ణ) ఒకటిన్నర సంవత్సరం నుండి అదే ఆసుపత్రిలో కోమాలో ఉంటాడు.బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ గాడ్సే కాగా మరో క్యారెక్టర్ బోస్.గాడ్సే కోమా నుండి బయటపడ్డాక తమ కొడుకు అని వచ్చిన జయసుధ,చంద్రమోహన్ లకు నేను మీ కొడుకును కాదు, నేను బోస్ అని చెప్తాడు.అతను గాడ్సే అని అన్నిరకాల ఆధారాలు చూపించాక తను గాడ్సేనా లేకుంటే బోస్ నా అని తెలుసుకోవడానికి హైదరాబాద్ వస్తాడు. కట్ చేస్తే ......
బోస్ పవర్ ఫుల్ సీబీఐ ఆఫీసర్,ఎవ్వరికీ భయపడడు,అనుకున్నది చేసే టైపు.ఇలా చాలా మందిని జైల్లో పెడతాడు.రాష్ట్ర ముఖ్యమంత్రి అచ్యుతరామయ్య(విజయ్ కుమార్) గుండెపోటుతో మరణిస్తాడు.కాని అది సహజ మరణం కాదని తెలిసి ఆ కేసును సీబీఐ ఆఫీసర్ బోస్ కు అప్పజెప్పుతారు.ఈ కేసు విచారణలో బోస్ చాలా సమస్యలు ఎదుర్కొంటాడు.ఈ కేసులో నిందితులు తన కుటుంబాన్ని వేధిస్తుంటారు.అనుకోకుండా బోస్ మిస్ అవుతాడు.
అ తరువాత ఏం జరిగింది.అసలు బోస్ కు,గాడ్సే కు సంబంధం ఏంటి.అచ్యుతరామయ్య మరణం వెనుక ఎవరున్నారు,త్రిష,రాధిక ఆప్టే లు ఎవరు?ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే థియేటర్ కు వెళ్ళాల్సిందే.
ప్లస్ పాయింట్లు :
  • బాలకృష్ణ నటన,డైలాగ్ లు,ఫైట్లు,డ్యాన్స్ 
  • సినిమా మొదటి 20 నిమిషాలు 
  • కథలో వచ్చే ట్విస్ట్ లు 
  • మొదటి సినిమా అయినా పర్వాలేదు అనిపించిన సత్యదేవ్ దర్శకత్వం 
  • బాలకృష్ణ,ప్రకాశ్ రాజ్ మధ్యలో వచ్చే ఫోన్ సంభాషణ 
  • ప్రీ క్లైమాక్స్,క్లైమాక్స్ 
  • బ్యాక్ గ్రౌండ్ సంగీతం 
  • రామ్ - లక్ష్మణ్ ల ఫైట్ కంపోస్
మైనస్ పాయింట్లు :
  • మొదటి 20 నిమిషాల తరువాత కథ నెమ్మదించడం 
  • బాలకృష్ణ,త్రిష ల మధ్య లవ్ ట్రాక్ 
  • అంతగా హాస్యానికి ప్రాధాన్యత లేకపోవడం 
  • అక్కడక్కడా కావాలని కథ సాగదీయడం 
  • స్క్రీన్ ప్లే చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు
తీర్పు :
మాస్ కి కావాల్సిన మసాల అంతా ఈ సినిమాలో చొప్పించాడు సత్యదేవ్,కాబట్టి మాస్ ని దాదాపుగా సంతృప్తి చెందుతారు లయన్ సినిమా చూసి బయటికి వచ్చాక.ఇక అభిమానుల గురించి చెప్పాల్సిన పని లేదు.వారికి 100% నచ్చే సినిమా 'లయన్'.
యాక్షన్,ట్విస్ట్ లు కోరుకునే వారిని నిరుత్సహాపరచదు సినిమా.బాలయ్య విజయాల ఖాతాలో మరోచిత్రం లయన్.
Read more ...

Wednesday, 13 May 2015

మహేష్ బాబుతో మూడో సినిమా : స్క్రిప్ట్ ఫైనల్ చేసిన పూరీజగన్నాథ్

ప్రిన్స్ మహేష్ బాబుతో మూడో సినిమా తీయడానికి పూరీజగన్నాథ్ స్క్రిప్ట్ తయారు చేసుకున్నాడు.ఈ విషయాన్ని స్వయంగా పూరీజగన్నాథ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. "ఇప్పుడే స్క్రిప్ట్ మొత్తం ఫైనల్ అయింది మహేష్ బాబుతో మూడో సినిమా కోసం,హ్యాట్రిక్ కోసం రెడీ గా ఉన్నాం,మహేష్ బాబు అభిమానులతో పంచుకోవడానికి సంతోషంగా ఉంది..చీర్స్" అని పూరీ తన ట్వీట్ లో తెలిపారు. ఐతే మహేష్-పూరీ కాంబినేషన్ లో వచ్చే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో ఇంకా స్పష్టత రాలేదు.'ధమ్కీ' అనే పేరు దాదాపుగా ఖరారు అయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి మహేష్ బాబు 'శ్రీమంతుడు' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది.జూన్ రెండో వారం కల్లా ఈ సినిమా పూర్తి అవుతుంది.ఆ వెంటనే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'బ్రహ్మోత్సవం' చిత్రంలో నటించనున్నారు మహేష్ బాబు.  
Read more ...

బాహుబలి మరో కొత్త పోస్టర్ : బిజ్జలదేవ గా కనిపించనున్న నాజర్

బాహుబలి మరో పోస్టర్ ను బుధవారం సాయంత్రం విడుదల చేశారు దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి.బిజ్జలదేవ గా నాజర్ కనిపించే పోస్టర్ ను ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు రాజమౌళి. రెండు మూడు రోజులకోసారి బాహుబలి చిత్ర క్యారెక్టర్ పోస్టర్ లను విడుదల చేస్తూ సినిమా మీద అంచనాలను పెంచుతున్నారు.'నాకు వ్యక్తిగతంగా ఇష్టమైన ఈపాత్రను నాజర్ గారు ప్రాణం పోశారు', 'ప్రతి పదం లో విషం..ప్రతి అడుగు లో ఆగ్రహం..ప్రతి ఆలోచనలో అసూయ'.. ఉన్న పాత్ర బిజ్జలదేవ అని రాజమౌళి తన ట్వీట్ లో తెలిపారు.
Read more ...

Monday, 11 May 2015

బాహుబలి కొత్త పోస్టర్ : బార్బేరియన్ సైనికుడిగా భయంకర 'కాళకేయ'

బాహుబలి సినిమా విడుదలకు రెండు నెలల ముందు నుండే దర్శకుడు రాజమౌళి సినిమా మీద మరింత అంచనాలను పెంచే పనిలో పడ్డాడు.అందులో భాగంగానే బాహుబలి చిత్ర పోస్టర్లను ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు.తాజాగా సోమవారం సాయంత్రం భయంకర 'కాళకేయ' పోస్టర్ ను విడుదల చేశారు. మర్యాద రామన్న చిత్రంలో బైరెడ్డిగా నటించిన ప్రభాకర్ 'కాళకేయ' పాత్రలో కనిపించే పోస్టర్ సినిమా మీద మరింత అంచనాలను పెంచేస్తున్నాయి.'రక్తం అతని దాహాన్ని తీర్చుతది,హింస అతనికి శాంతినిస్తుంది,లక్ష మంది బార్బెరియన్లకు అతను కమాండర్' అని రాజమౌళి ట్వీట్ చేస్తూ పోస్టర్ ను విడుదల చేశారు. ఇప్పటికే మే1 న బాహుబలి ఫస్ట్ లుక్ పోస్టర్ ను,మే 4న ప్రభాస్,మే 6న అనుష్క,మే 8న రమ్యకృష్ణ పోస్టర్లను విడుదల చేశారు రాజమౌళి.  
Read more ...

చిరు 150వ సినిమా దర్శకుడు పూరిజగన్నాథ్

మెగా స్టార్ చిరంజీవి 150వ సినిమా దర్శకుడు ఎవరు అని ఇన్ని రోజులుగా అభిమానులను వేధిస్తున్న ప్రశ్నకు ఈరోజు సమాధానం దొరికింది. "అవును ఇది నిజం,చివరగా నాన్న నిర్ణయం తీసుకున్నారు.మెగాస్టార్ 150వ సినిమాను పూరిజగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు,సంతోషంగా ఉంది" అని రామ్ చరణ్ సోమవారం తెలిపారు. సొంత బ్యానర్లో రామ్ చరణ్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా బీవీఎస్.రవి స్క్రిప్ట్ అందిస్తున్నారు.ఇక సినిమా చిరంజీవి పుట్టినరోజు అయిన ఆగష్టు 22న లాంచ్ చేయనున్నారు.పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2న సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.సంక్రాతికి సినిమాను విడుదల చేయనున్నారు. ఐతే సినిమా పేరు 'ఆటో జాని' అని అనుకుంటున్నారు.చిరంజీవి 150వ సినిమా పూరిజగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు అని వెలువడగానే పూరీ ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నారు."ఒకప్పుడు చిరంజీవి సినిమాకి థియేటర్ దగ్గర డెకరేషన్లు చేసేవాడికి ఏం తెలుసు ఏదో ఒకరోజు వాడే ఆయన 150వ సినిమా డైరెక్ట్ చేస్తాడని PL BLESS HIM" ఇది పూరీ చేసిన ట్వీట్.
Read more ...

Friday, 8 May 2015

బాహుబలి మరో ఫస్ట్ లుక్ : శివగామి గా రమ్యకృష్ణ


బాహుబలి క్యారెక్టర్ల ఫస్ట్ లుక్ లు వరుసగా ట్విట్టర్ ద్వారా విడుదల చేస్తున్న ఎస్ ఎస్ రాజమౌళి శుక్రవారం నాడు రమ్యకృష్ణ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
శివగామి గా బాహుబలి చిత్రంలో రమ్యకృష్ణ కనిపించనున్నారు.రమ్యకృష్ణ మా మొత్తం యూనిట్ కు ఒక చోదక శక్తిగా ఉంది, ఇంతలా సినిమా కోసం కష్టపడే వారిని ఇప్పటి వరకు నేను చూడలేదు,గత రెండున్నర సంవత్సరాలుగా మా బృందంతో పనిచేస్తున్నారు అని రాజమౌళి తన ట్విట్టర్ లో తెలిపారు.
రాజామౌళి విడుదల చేస్తున్న క్యారెక్టర్ల ఫస్ట్ లుక్ లు సినిమా మీద మరింత ఆసక్తిని రేపుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

Read more ...
Designed By Published.. Blogger Templates