తెలంగాణా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస సత్తా చాటింది.ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఈ ఎన్నికల్లో మొత్తం ఆరు స్థానాలకు పోటీ జరిగాయి.తెరాస 5 గెలుచుకుంటే,కాంగ్రేస్ ఒక్క ఎమ్మెల్సీ గెలుచుకుంది.అనూహ్యంగా ఐదో అభ్యర్థిని పోటీలో నిలబెట్టిన తెరాస ఐదో స్థానాన్ని కూడా కైవసం చేసుకుంది.టీడీపీ-బీజేపీ సంయుక్త అభ్యర్థి టీడీపీ కి చెందిన వేం నరేందర్ రెడ్డి ఓటమి పాలయ్యారు.
సరైన సంఖ్యా బలం లేనప్పటికీ 5వ అభ్యర్థి యాదవ రెడ్డిని పోటీలో నిలబెట్టి మరీ గెలిపించుకున్నారు.నిజానికి తెరాస కు ఉన్న బలంతో 4 మాత్రమే గెలుచుకునే అవకాశం ఉంది,కాని ఎంఐఎం,వైకాపా అభ్యర్థుల మద్దతుతో 5వ స్థానాన్ని గెలుచుకుంది తెరాస.
గెలిచిన అభ్యర్థులు :
1. తుమ్మల నాగేశ్వర్ రావు (తెరాస)
2. కడియం శ్రీహరి (తెరాస)
3. యాదవ రెడ్డి (తెరాస)
4. బి వెంకటేశ్వర్లు (తెరాస)
5. విద్యాసాగర్ రావు (తెరాస)
6. ఆకుల లలిత (కాంగ్రేస్)
శాసన మండలి ఎన్నికల్లో మొత్తం 5 చెల్లని ఓట్లు పడ్డాయి.ఒకరు నోటా పడింది.ఈ ఆరు కూడా టీడీపీ-బీజీపీ ఎమ్మెల్యేలు వేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఎందుకంటే టీడీపీ అభ్యర్థి అయిన వేం నరేందర్ రెడ్డి కి 9 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.నిజానికి 15 ఓట్లు పడాలి నరేందర్ రెడ్డికి.
నోటా వేసింది టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అని తెలుస్తుంది.కృష్ణయ్య ఒంటరిగా వచ్చి ఓటేసి వెళ్ళిపోయారు,ఒక్క టీడీపీ ఎమ్మెల్యేను కూడా కలవలేదు ఓటు వేసే సమయంలో.
అసెంబ్లీ ప్రాంగణంలో తెరాస ఎమ్మెల్యేలు సంబరాలు చేసుకుంటున్నారు.
ఇక తెలంగాణా శాసన మండలిలో టీడీపీ ప్రాతినిధ్యం శూన్యం.
No comments:
Post a Comment