ఓటుకు నోటు కేసులో ఏసీబీ కి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడి చంచల్ గూడ జైల్లో రిమాండ్ లో ఉన్న టీ-టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటీషన్ పై విచారణను ఏసీబీ ప్రత్యేక కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.
కౌంటర్ దాఖలు చేసేందుకు ఏసీబీ అధికారులు సమయం కోరడంతో విచారణను జూన్ 5,శుక్రవారానికి వాయిదా వేసింది.
అలాగే ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో రిమాండ్ లో ఉన్న రేవంత్ ను చర్లపల్లి జైలు కు తరలించాలని ఏసీబీ కోర్టులో అధికారులు వేసిన రిక్విజేషన్ పిటిషన్ పరిగణనలోకి తీసుకున్న కోర్టు అందుకు అనుమతినిచ్చింది.
చంచల్ గూడ జైల్లో ఉన్న రేవంత్ రెడ్డి ని పయ్యావుల కేశవ్ దూలిపాళ్ళ నరేంద్ర కలిశారు.ఇదే వ్యవహారంపై వైకాపా అధినేత జగన్,గవర్నర్ నరసింహన్ ను కలిసి రేవంత్ రెడ్డి అంశంపై,చంద్రబాబు పాత్రపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని కోరారు.
No comments:
Post a Comment