Radio LIVE


Breaking News
Showing posts with label Telangana News. Show all posts
Showing posts with label Telangana News. Show all posts

Sunday, 7 June 2015

చంద్రబాబు,స్టీఫెన్ సన్ ల మధ్య ఫోన్ సంభాషణ ఇలా సాగింది...!



ఓటుకు నోటు కేసులో స్టీఫెన్ సన్ కు 50 లక్షలు ఇస్తూ ఏసీబీ కి చిక్కిన రేవంత్ రెడ్డి వ్యవహారంలో ఆ పార్టీ నేతలు ఇన్ని రోజులు దమ్ముంటే చంద్రబాబు,స్టీఫెన్ సన్ తో మాట్లాడిన టేప్ లు బయట పెట్టాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఆ టేప్ బయటికి వచ్చింది.
టేప్ లో ఉన్న దాని ప్రకారం చంద్రబాబు మరియు స్టీఫెన్ సన్ ల మధ్య ఫోన్ సంభాషణ ఇలా సాగింది.
ట్రింగ్....... ట్రింగ్ ......
స్టీఫెన్ సన్ : హలో ...
చంద్రబాబు మనిషి : యా ..  బ్రదర్, బాబు గారు వాంట్స్ టు టాక్ టూ యు, బీ ఆన్ ద లైన్ 
చంద్రబాబు : హలో 
స్టీఫెన్ సన్ : సర్,గుడ్ ఈవినింగ్ సర్.
చంద్రబాబు : ఆ..గుడ్ ఈవెనింగ్ బ్రదర్.హౌ ఆర్ యు 
స్టీఫెన్ సన్ : ఫైన్ థాంక్స్ సర్.
చంద్రబాబు : మనవాళ్ళు,బ్రీఫ్డ్ మీ,ఐయామ్ విత్ మి,డోంట్ బాదర్.
స్టీఫెన్ సన్ : రైట్ సర్..
చంద్రబాబు : ఫర్ ఎవ్రీ థింగ్ .. వాట్ ఆల్ దే స్పోక్..విల్ హానర్
స్టీఫెన్ సన్ : ఎస్ సర్..రైట్ సర్ ..
చంద్రబాబు : ఫ్రీలీ యు కెన్ డిసైడ్..no ప్రాబ్లమ్ ఎట్ ఆల్ ...
స్టీఫెన్ సన్ : ఓకే సర్..
చంద్రబాబు : దట్ ఈస్ అవర్ కమిట్ మెంట్ .. వి విల్ వర్క్ టుగెదర్...
స్టీఫెన్ సన్ : రైట్ .. థాంక్యు..
చంద్రబాబు : థాంక్యు ......

Read more ...

Tuesday, 2 June 2015

రేవంత్ రెడ్డి బెయిల్ పిటీషన్ శుక్రవారానికి వాయిదా,చర్లపల్లి కి తరలింపు

ఓటుకు నోటు కేసులో ఏసీబీ కి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడి చంచల్ గూడ జైల్లో రిమాండ్ లో ఉన్న టీ-టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటీషన్ పై విచారణను ఏసీబీ ప్రత్యేక కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.
కౌంటర్ దాఖలు చేసేందుకు ఏసీబీ అధికారులు సమయం కోరడంతో విచారణను జూన్ 5,శుక్రవారానికి వాయిదా వేసింది.
అలాగే ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో రిమాండ్ లో ఉన్న రేవంత్ ను చర్లపల్లి జైలు కు తరలించాలని ఏసీబీ కోర్టులో అధికారులు వేసిన రిక్విజేషన్ పిటిషన్ పరిగణనలోకి తీసుకున్న కోర్టు అందుకు అనుమతినిచ్చింది.
చంచల్ గూడ జైల్లో ఉన్న రేవంత్ రెడ్డి ని పయ్యావుల కేశవ్ దూలిపాళ్ళ నరేంద్ర కలిశారు.ఇదే వ్యవహారంపై వైకాపా అధినేత జగన్,గవర్నర్ నరసింహన్ ను కలిసి రేవంత్ రెడ్డి అంశంపై,చంద్రబాబు పాత్రపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని కోరారు.
Read more ...

Monday, 1 June 2015

జూలై లో 25వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ - ముఖ్యమంత్రి కెసిఆర్

తెలంగాణలో గత సంవత్సర కాలంగా ఉద్యోగాల భర్తీ ఎప్పుడెప్పుడా అని ఎదురుస్తున్న నిరుద్యోగులకు శుభవార్త.మంగళవారం సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల్లో పాల్గొన్న సీఎం కెసిఆర్ మాట్లాడుతూ జూలై లో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న దాదాపు 25వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామని కెసిఆర్ ప్రకటించారు.
ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయిన ప్రతిబంధకాలు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు అయినప్పటికీ తెలంగాణాలోని నిరుద్యోగులను నిరాశకు గురిచేయకుండా జూలై లో నోటిఫికేషన్ విడుదల చేసి త్వరితగతిన ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పారు సీఎం.
అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా క్రమబద్దీకరించే ప్రక్రియ కూడా జూలై నుండి మొదలు పెట్టి సంవత్సర కాలంలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు.
Read more ...

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా,టీడీపీ అభ్యర్థి ఓటమి


తెలంగాణా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస సత్తా చాటింది.ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఈ ఎన్నికల్లో మొత్తం ఆరు స్థానాలకు పోటీ జరిగాయి.తెరాస 5 గెలుచుకుంటే,కాంగ్రేస్ ఒక్క ఎమ్మెల్సీ గెలుచుకుంది.అనూహ్యంగా ఐదో అభ్యర్థిని పోటీలో నిలబెట్టిన తెరాస ఐదో స్థానాన్ని కూడా కైవసం చేసుకుంది.టీడీపీ-బీజేపీ సంయుక్త అభ్యర్థి టీడీపీ కి చెందిన వేం నరేందర్ రెడ్డి ఓటమి పాలయ్యారు.
సరైన సంఖ్యా బలం లేనప్పటికీ 5వ అభ్యర్థి యాదవ రెడ్డిని పోటీలో నిలబెట్టి మరీ గెలిపించుకున్నారు.నిజానికి తెరాస కు ఉన్న బలంతో 4 మాత్రమే గెలుచుకునే అవకాశం ఉంది,కాని ఎంఐఎం,వైకాపా అభ్యర్థుల మద్దతుతో 5వ స్థానాన్ని గెలుచుకుంది తెరాస.
గెలిచిన అభ్యర్థులు :
1. తుమ్మల నాగేశ్వర్ రావు (తెరాస)
2. కడియం శ్రీహరి (తెరాస)
3. యాదవ రెడ్డి (తెరాస)
4. బి వెంకటేశ్వర్లు (తెరాస)
5. విద్యాసాగర్ రావు (తెరాస)
6. ఆకుల లలిత (కాంగ్రేస్)
శాసన మండలి ఎన్నికల్లో మొత్తం 5 చెల్లని ఓట్లు పడ్డాయి.ఒకరు నోటా పడింది.ఈ ఆరు కూడా టీడీపీ-బీజీపీ ఎమ్మెల్యేలు వేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఎందుకంటే టీడీపీ అభ్యర్థి అయిన వేం నరేందర్ రెడ్డి కి 9 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.నిజానికి 15 ఓట్లు పడాలి నరేందర్ రెడ్డికి.
నోటా వేసింది టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అని తెలుస్తుంది.కృష్ణయ్య ఒంటరిగా వచ్చి ఓటేసి వెళ్ళిపోయారు,ఒక్క టీడీపీ ఎమ్మెల్యేను కూడా కలవలేదు ఓటు వేసే సమయంలో.
అసెంబ్లీ ప్రాంగణంలో తెరాస ఎమ్మెల్యేలు సంబరాలు చేసుకుంటున్నారు.
ఇక తెలంగాణా శాసన మండలిలో టీడీపీ ప్రాతినిధ్యం శూన్యం.
Read more ...

Sunday, 31 May 2015

రేవంత్ రెడ్డికి 14 రోజుల రిమాండ్,ఓటు వేసే అవకాశం కల్పించిన కోర్టు

ఆదివారం సాయంత్రం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీవెన్ సన్ కు రూ.50 లక్షలు ఇస్తూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు దొరికిపోయిన రేవంత్ రెడ్డిని సోమవారం ఉదయం ఏసీబీ న్యాయమూర్తి లక్ష్మీపతి ఎదుట హాజరుపరిచారు.
అనంతరం రేవంత్ కు 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి.రేవంత్ రెడ్డి మీద 120B, 34 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
ఏ 1 - రేవంత్ రెడ్డి
ఏ 2 - సెబాస్టియన్
ఏ 3 - ఉదయ్ సింహ
ఏ 4 - మాథ్యూస్ జెరూసలెం
ఐతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అనుమంతించాలని రేవంత్,న్యాయమూర్తిని కోరగా అందుకు పిటీషన్ దాఖలు చేయమని కోరగా అందుకు రేవంత్ రెడ్డి లాయర్లు పిటీషన్ దాఖలు చేయగా అందుకు న్యాయమూర్తి ఓటు వేసేందుకు అనుమతించారు.అనంతరం 14 రోజుల రిమాండ్ కోసం రేవంత్ ను చర్లపల్లి జైలు కు తరలించనున్నారు.
ఓటు వేసేందుకు రేవంత్ ను పోలీసులు అసెంబ్లీ ఆవరణకు తీసుకొచ్చారు.రేవంత్ వచ్చే వరకు అసెంబ్లీ ప్రాంగణంలోనే టీ-టీడీపీ ఎమ్మెల్యేలు వేచి ఉండి రేవంత్ రాగానే ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు తోటి ఎమ్మెల్యేలు.అనంతరం టీడీపీ ఎమ్మెల్యేలతో కొంతసేపు భేటీ అయ్యారు. ఆ తరువాత బీజేపీ ఎమ్మెల్యేలు కూడా రేవంత్ ను కలిశారు.
Read more ...

మరో వీడియో:రేవంత్ రెడ్డి స్వయంగా డబ్బులు పంచుతూ

మరో వీడియో విడుదలైంది.రేవంత్ రెడ్డి స్వయంగా డబ్బులు సర్దుతూ వీడియో లో స్పష్టంగా కనిపిస్తుంది.డబ్బులున్న నల్లటి సంచిలోనుండి రూ.1000 ,రూ.500 నోట్ల కట్టలను అక్కడే ఉన్న టేబుల్ మీద అతనితోపాటు వచ్చిన మరో వ్యక్తి సర్దారు. బ్యాగ్ తీసుకురా,డోర్స్ పెట్టండి అని రేవంత్ అనగానే,ఎవరూ రారు అని స్టీఫెన్ చెప్పాడు. కానియ్యి కానియ్యి తొందర పావాలే పని ఉంది,మై సైడ్ వెరీ క్లియర్,మొత్తం రూ.50 లక్షలు ఇప్పుడు తీసుకోండి.రేపు మిగతా నాలుగున్నర తీసుకోండి,నాలుగున్నర అంటే ఏంటి అని స్టీవెన్ అనగానే నాలుగున్నర కోట్లు అని రేవంత్ సమాధానం ఇచ్చారు.మీకేమి కాదు,నేను ఉన్నాను. రేవంత్ అరెస్ట్ అయిన సమయంలో అతను వేసుకున్న టీ-షర్ట్ రంగు,అతను డబ్బులు పంచుతున్నప్పుడు వేసుకున్న షర్ట్ రంగు ఒకటే.
Read more ...

లంచం ఇస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ రేవంత్ రెడ్డి-వీడియో మీడియాలో

తెలంగాణాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.కొడంగల్ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీవెన్ సన్ కు లంచం ఇస్తూ ఏసీబీ కి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు.
సోమవారం జరిగే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు ఓటు వేస్తే రూ.5 కోట్లు ఇస్తామని అందులో భాగంగా సికింద్రాబాద్ లోని లాలాగూడ  స్టీవెన్ సన్ కుమారుడి ఇంట్లో  రూ.50 లక్షలు ఇస్తూ ఏసీబీ కి అడ్డంగా దొరికిపోయాడు రేవంత్ రెడ్డి.అప్పటికే అక్కడే మాటు వేసి ఎదురు చూస్తున్న ఏసీబీ అదను చూసి రేవంత్ ను పట్టుకున్నారు.
రేవంత్ ను అరెస్ట్ చేసి తీసుకెళ్తు రెండు సంచులు కూడా పోలీసులు తీసుకెళ్ళారు.రేవంత్ మీద ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు పోలీసులు.
రేవంత్ రెడ్డి కొన్ని రోజులుగా ప్రలోభాలకు లోనుచేస్తున్నాడని స్టీవెన్ సన్ చెప్పాడు.
రేవంత్ రెడ్డి ని ఏసీబీ ఆఫీస్ లో విచారిస్తున్నారు.రేపు కోర్టు లో హాజరు పరుస్తారు.
అయితే రేవంత్ రెడ్డి,స్టీవెన్ సన్ ల మధ్య జరిగిన సంభాషణ ను ఏసీబీ విడుదల చేసింది.
ఈ వీడియో లో "బాసే నన్ను ఇక్కడికి పంపించారు.మీరేదైనా నెంబర్(money) చెప్తే నేను బాస్ తో మాట్లాడి సమాచారం అందిస్తాను.మీకు ఏలాంటి సమస్య రాదు,17 మంది ఎమ్మెల్యేలతో పాటు మీరు.తెలంగాణాలో పార్టీని నేనే లీడ్ చేసేది,నా కూతురి పెళ్లి అయ్యాక నేను ఫ్రీ అవుతాను,నీకేమైనా సమస్య వస్తే ఆంధ్రలో ఇప్పిస్తాను.నాకు కులం ఉంది,బంధువులు ఉన్నారు,జైపాల్ రెడ్డి నాకు మామ,జానారెడ్డి కూడా నాకు బంధువే,జానారెడ్డి పని అయిపోయింది, నేను వేం నరేందర్ రెడ్డి కి ఫైనాన్స్ చేస్తున్నాను అని రేవంత్ రెడ్డి వీడియోలో మాట్లాడారు.రెండున్నర అనే మాట వాడారు రేవంత్ ఈ వీడియో లో".

Read more ...

Thursday, 21 May 2015

భానుడి ప్రతాపంతో తెలుగు రాష్ట్రాల్లో ఒక్కరోజే 30 మంది మృతి

గత రెండు రోజులుగా ఒక్కసారిగా ఎండ తీవ్రత పెరగడంతో తెలుగు రాష్ట్రాల్లో వడదెబ్బకు 30 మంది మృతి చెందారు.ఒక్క కరీంనగర్ జిల్లాలోనే గురువారం 6గురు చనిపోయారు.మరో మూడు,నాలుగు రోజులపాటు ఎండ తీవ్రత బాగానే ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
నల్గొండ,నిజామాబాద్ జిల్లాల్లో గురువారం 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.రామగుండంలో 46 డిగ్రీల, విజయనగరం,శ్రీకాకుళం,ఒంగోలు,ఆదిలాబాద్ లో 45 డిగ్రీల,హైదరాబాద్ లో 44 డిగ్రీల,వరంగల్ లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మరో రెండు రోజులు 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది.సాయంత్రం సమయంలో కూడా వేడి గాలులు వీస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఎండకు తాళలేక ప్రజలు అల్లాడిపోతున్నారు.మధ్యాహ్నం రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి.
ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు బయటికి వెల్లకుంటేనే మంచిది.మరీ ముఖ్యంగా చిన్న పిల్లలను,వృద్దులను బయటకు పంపించకూడదు.
రోజుకు కనీసం 3 లీటర్ల మంచినీళ్ళు తీసుకోవాలి.కొబ్బరి నీళ్ళు,నిమ్మరసం,మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలి.వడదెబ్బ బారిన పడితే ఉప్పు,నిమ్మరసం  కలిపిన నీరు తాగాలి.
Read more ...

Sunday, 10 May 2015

పాత బస్తీలో WWF,యువకుడి మృతి


హైదరాబాద్ పాత బస్తీలో ఆకతాయి యువకులు నిర్వహించిన స్ట్రీట్ ఫైట్ లో ఇంటర్ చదువుతున్న 17 సంవత్సరాల నబీల్ అనే యువకుడు చనిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.wwf తరహాలో సంపన్నుల పిల్లలు బెట్టింగ్ లకు పాల్పడుతూ వీధి పోరాటాలకు దిగి ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటన పాత బస్తీ మీర్ చౌక్ లో సంభవించింది.
నిజానికి ఈ ఘటన మే 3 నే జరిగింది.ఆక్సిడెంట్ జరిగిందని స్నేహితుల మృతుడి తల్లిని నమ్మించి మృతదేహాన్ని పూడ్చి పెట్టారు.ఐతే మృతుడు నబీల్ తండ్రి దుబాయ్ నుండి వెంటనే హైదరాబాద్ చేరుకున్నాడు.అసలు ఆరోజు ఏమైందని నబీల్ స్నేహితులను ఆరా తీశాడు.తన కుమారుడి మరణం ఆక్సిడెంట్ వల్ల కాదు అని తెలుసుకొని మీర్ చౌక్ పోలీసులను ఆశ్రయించారు.
పోలీసులు దర్యాప్తు చేయగా అసలు విషయం బయట పడింది.మే 3 తెల్లవారుజామున 10 నుండి 12 మంది యువకుల బృందం మీర్ చౌక్ లోని ఒక వీధిలో స్ట్రీట్ ఫైట్ కు సన్నాహాలు చేసుకున్నారు.నబీల్ అహ్మద్ మరియు మొహమ్మద్ అనే యువకుడితో తలపడ్డాడు.మొహమ్మద్ పిడి గుద్దులకు కుప్పకూలాడు నబీల్.
నబీల్ మరణించాడు అని తెలుసుకొన్నాక అక్కడి వారు అది రోడ్డు ప్రమాదంలో మరణంగా చిత్రీకరించి నబీల్ ఇంట్లో తెలిపారు.ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి క్లూ లేకుండా చేశారు,పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేసి విచారించగా వీడియో సహా నిజం బయటపడింది.నబీల్ మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు.హత్యా నేరం కింద కేసు నమోదు విచారిస్తున్నారు పోలీసులు.
Read more ...

Monday, 4 May 2015

తెలంగాణ సీఎస్ తో భేటి అయిన ఆస్ట్రియా సైంటిస్టుల బృందం

ఆస్ట్రియా సైంటిస్టుల బృందం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ తో భేటి అయింది.
హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, నీటి శుద్ధి వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.
హుస్సేన్ సాగర్ ప్రక్షాళన కోసం తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే.
అయితే ఈ నేపధ్యంలోనే ఆదివారం ఆస్ట్రియా సైంటిస్టుల బృందం హుస్సేన్ సాగర్ ను పరిశీలించారు.
ఈ మేరకు సోమవారం డాన్యూబ్ నదిని శుద్ధి చేసిన పద్ధతిలోనే హుస్సేన్ సాగర్ ని కూడా శుద్ధి చేసే ఛాన్స్ ఉందని వారు సూచించారు.
ఈ బృందం మంగళవారం దీనిపై ముఖ్యమంత్రి KCR కు నివేదికను ఇవ్వనున్నారు.
Read more ...

కిడ్నాప్ కు గురైన సిగ్మా క్యాబ్స్ ఎండీ కుమారుడు అశ్విన్ కుమార్

సిగ్మా క్యాబ్స్ యజమాని కూమరుడు అశ్విన్ కుమార్(17) కిడ్నాప్ అయ్యారు.ఇన్నోవా కారులో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అశ్విన్ కుమార్ ను ఎక్కించుకొని పారిపోయారు.
రైతిబౌతి ఫిల్లర్ నంబర్ 45 వద్ద ఈ ఘటన చోటు చేసుకోగా.. సిగ్మా క్యాబ్స్ ఎండీ కుటుంబ సభ్యులు లంగర్ హౌస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తూను ప్రారంభించారు. వ్యాపార విభేదాలే బాలుడి అపహరణకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.
Read more ...

Saturday, 2 May 2015

తెలంగాణ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులను జారి చేసింది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా 418 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, 125 అసిస్టెంట్ ఇంజనీర్ల నియామకాలకు ఉత్తర్వులు జారీ చేసింది.
TPSC ఛైర్మన్ ఘంటా చక్రపాణి
Read more ...

నేడు నగరంలో ఆస్ట్రియ బృందం పర్యాటన

నేడు నగరంలో ఆస్ట్రియ బృందం పర్యటిస్తుంది.ఈ బృందం హుస్సేన్ సాగర్ ప్రక్షాళన నిమిత్తం ఈ పర్యాటనను చేపట్టారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్, హెచ్ఎండీఏ, జల, కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో ఈ బృందం సమావేశమైంది.
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ
అనంతరం ఈ బృందం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను కలవనున్నట్లు సమాచారం.
Read more ...

Friday, 1 May 2015

హోంశాఖ చీఫ్ విజిలెన్స్ అధికారిగా అనితా రాజేంద్ర నియామకం

ఐఏఎస్ అధికారిణి అనితా రాజేంద్ర తెలంగాణ రాష్ట్ర హోంశాఖ చీఫ్ విజిలెన్స్ ఆఫిసర్ గా నియామకమయ్యారు. ప్రభుత్వం ఈమేరకు శుక్రవారం అనితా రాజేంద్రను నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది.
Read more ...

Thursday, 30 April 2015

రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చిన “ఐకియా ఇండియా”

ఐకియా ఇండియా సంస్థ తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించడానికి ముందుకొచ్చింది. ఈ సంస్థ తమ వ్యాపార నిర్వహణ కోసం 50 వేల చదరపు మీటర్ల స్థలం కావాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. టీస్ఐఐసీ కి చెందిన భూమిని ఎకరం రూ.19.21 కోట్లతో కొనడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది.
Read more ...

Wednesday, 29 April 2015

తెలంగాణలో అమలుచేయనున్న ఇజ్రాయెల్ సాగు పద్ధతులు

ఇజ్రాయెల్ తమ పంటల సాగుకు అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులు, విధానాలను తెలంగాణ రాష్ట్రంలోను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పొచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇజ్రాయల్ లోని టెల్ అవీవ్ లో అంతర్జాతీయ వ్యవసాయ సదస్సు (అగ్రి టెక్ -2015) జరుగుతుంది.
ఈ సదస్సులో పాల్గొనడానికి వెళ్లిన పొచారం బృందం వెళ్లింది. దీనిలో భాగంగానే బుధవారం వారు పలు వ్యవసాయ క్షేత్రాల్లో పర్యటించి వివిధ పంటల సాగు విధానాన్ని పరిశీలించారు. అనంతరం టెల్ అవీవ్ పట్టణానికి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొఘల్ అనే గ్రామంలో పంటల సాగును అధ్యయనం చేశారు.
Read more ...

KTR అమెరికా పర్యటన

మే 2వ వారంలోతెలంగాణ పంచాయతీ రాజ్ , ఇతీశాఖ మంత్రి కే.తారక రామారావు అమెరికా పర్యటించనున్నారు. ఈ పర్యటన 15 రోజులపాటు జరగనుంది. ఈ పర్యటనలో KTR అమెరికాలోని వివిధ ప్రాంతాలలో పర్యటించి,తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించడానికి అమెరికాలోని పలు కంపెనీలు,పలువురు పారిశ్రామికవేత్తలతో, మరియు సంస్థలు సమావేశం అవుతారు. తన అమెరికా పర్యటనకు సంబంధించి బుధవారం KTR ట్విట్టర్ లో పేర్కొన్నారు. అమెరికా కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఐటీ, పారిశ్రామిక పాలసీలను వివరించునున్నట్లు తెలిపారు. అంతేకాదు అమెరికా లో ఉన్న ప్రవాస తెలంగాణ ప్రజలను కూడా భారీగా పెట్టుబడులు పెట్టాలని కోరనున్నారని సమాచారం.
Read more ...

మిషన్ కాకతీయకు రూ. 25 లక్షల విరాళం : క్రెడాయ్

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకం కోసం క్రెడాయ్ గతంలో ముఖ్యమంత్రికి రూ.50 లక్షలు విరాళాన్ని అందించింది. కాగా బుధవారం నాడు మంత్రి హరీష్ రావుకు మరో రూ.25 లక్షల చెక్కును క్రెడాయ్ ప్రతినిధులు విరాళంగా అందజేసింది. త్వరలోనే మరో రూ.25 లక్షలను ప్రభుత్వానికి అందజేయనున్నట్లు వారు వెల్లడించారు.
Read more ...

ఈతకు వెళ్లి మృతి చెందిన ఏడుగురు

మహబూబ్ నగర్ జిల్లాలోని ఆమనగల్లు మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఆమనగల్లు మండలంలోని సిరికొండ గౌరమ్మ చెరువులో ఈతకు వెళ్లిన ఏడుగురు మృతిచెందారు.వీరు విహారయాత్ర కోసం వెళ్లినట్లు తెలుస్తోంది. వీరంతా హైదరాబాద్ లోని చాంద్రయణగుట్ట వాసులుగా గుర్తించారు. మృతుల్లో 3 మహిళలు, 4 పురుషులు ఉన్నట్లు సమాచారం.
Read more ...

వెబ్ ఛానెల్ లో ఉద్యోగమంటూ మోసం చేసిన కేడి

శ్రీనివాస్ అనే వ్యక్తి వెబ్ ఛానెల్లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేశాడు. 70 మంది నిరుద్యోగుల నుంచి రేనా బ్రాడ్ కాస్టింగ్ గ్రూప్ ఆఫ్ నెట్ వర్క్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ వారి నుంచి రూ.3 లక్షలు వసూలు చేసి పత్తా లేకుండా ఉడాయించాడు. దీంతో బాధితుల ఎల్బీనగర్ పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read more ...
Designed By Published.. Blogger Templates