Radio LIVE


Breaking News

Tuesday, 15 April 2014

హిజ్రాలను ఇక నుండి 3వ కేటగిరీగా గుర్తించాలి - సుప్రీం

సుప్రీంకోర్టు ఈరోజు(మంగళవారం) సంచలన తీర్పు ఇచ్చింది. హిజ్రాలకు ప్రత్యేక హక్కులు కల్పించాలని సుప్రీంకోర్టు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారి చేసింది. హిజ్రాలకు వైద్య సదుపాయాలూ కల్పించాలని విద్య మరియు ఉపాధి రంగాలలో సమాన హక్కులను కల్పించాలని సుప్రీం కోర్టు సూచించింది. లింగ మార్పిడి చేసుకున్న వారిని వెనకబడిన వారిగా గుర్తించాలని ఈ సందర్భంగా సుప్రీం తెలిపింది
Read more ...

Monday, 14 April 2014

సీమాంధ్ర వైఎస్ఆర్ సీపీ అభ్యర్థుల జాబితా

సీమాంధ్ర ప్రాంతంలో మొత్తం 175 నియోజకవర్గాలుండగా 170 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను వైఎస్ఆర్ సీపీ ప్రకటించింది.పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నుంచి అసెంబ్లీ బరిలోకి దిగుతున్నారు.
అభ్యర్థుల జాబితా:
కురుపాం -పాముల పుష్పశ్రీవాణి
పార్వతీపురం -జె.ప్రసన్నకుమార్
సాలూరు -రాజన్నదొర
పాలకొండ -వి.కళావతి
ఇచ్ఛాపురం - ఎన్.రామారావు
పలాస - వి.బాబూరావు
టెక్కలి - దువ్వాడ శ్రీనివాస్
పాతపట్నం కె.వెంకటరమణ
శ్రీకాకుళం - ధర్మాన ప్రసాదరావు
ఆముదాలవలస - తమ్మినేని సీతారాం
నరసన్నపేట - ధర్మాన కృష్ణదాస్
అరకు -సర్వేశ్వరరావు
పాడేరు - జి.ఈశ్వరి
ఎచ్చెర్ల - జి.కిరణ్ కుమార్
రాజాం - కంబాల జోగులు
బొబ్బిలి - రావు సుజయ్ కృష్ణ రంగారావు
చీపురుపల్లి - బల్లాన చంద్రశేఖర్
గజపతినగరం - కె.శ్రీనివాసరావు
నెల్లిమర్ల - డాక్టర్ పి.సురేష్
విజయనగరం - కె.వీరభద్రస్వామి
శృంగవరపు కోట - ఆర్.జగన్నాథం
భీమిలి - కర్రి సీతారాం
విశాఖ ఈస్ట్ - వంశీకృష్ణ యాదవ్
విశాఖ సౌత్ - కె.గురువులు
విశాఖ నార్త్ - సిహెచ్.వెంకటరావు
విశాఖ వెస్ట్ - దాడి రత్నాకర్
గాజువాక - తిప్పల నాగిరెడ్డి
చోడవరం - కరణం ధర్మశ్రీ
మాడుగుల - ముత్యాల నాయుడు
అనకాపల్లి - కొణతాల రఘు
పెందుర్తి - గండి బాబ్జీ
యలమంచిలి - ప్రగడ నాగేశ్వరరావు
పాయకరావుపేట - చెంగల వెంకట్రావు
నర్సీపట్నం - పెట్ల ఉమాశంకర గణేశ్
రంపచోడవరం - అనంత ఉదయభాస్కర్
తుని - దాడిశెట్టి రాజా
ప్రత్తిపాడు - వరుపుల సుబ్బారావు
పిఠాపురం - పెండెం దొరబాబు
కాకినాడ రూరల్ - సిహెచ్ శ్రీనివాస వేణుగోపాలకృష్ణ
పెద్దాపురం - తోట సుబ్బారావు నాయుడు
కాకినాడ సిటీ - చంద్రశేఖరరెడ్డి
జగ్గంపేట - జ్యోతుల నెహ్రూ
రామచంద్రపురం - పి.సుభాష్ చంద్రబోస్
ముమ్మిడివరం - గుత్తుల సాయి
అమలాపురం - గొల్ల బాబూరావు
రాజోలు - బత్తుల రాజేశ్వరరావు
కొత్తపేట - చిర్ల జగ్గిరెడ్డి
మండపేట - గిరజాల వెంకటస్వామినాయుడు
అనపర్తి - డాక్టర్ సూర్యనారాయణరెడ్డి
రాజానగరం - జక్కంపూడి విజయలక్ష్మి
రాజమండ్రి సిటీ - బొమ్మన రాజకుమార్
రాజమండ్రి రూరల్ - ఆకుల వీర్రాజు
కొవ్వూరు - తానేటి వనిత
నిడదవోలు - రాజీవ్ కృష్ణ
గోపాలపురం - తలారి వెంకటరావు
నరసాపురం - కొత్తపల్లి సుబ్బారాయుడు
భీమవరం - గ్రంధి శ్రీనివాస్
ఉండి - పాతపాటి సర్రాజు
తణుకు - చీర్ల రాధయ్య
తాడేపల్లిగూడెం - తోట గోపి
ఉంగుగూరు - ఉప్పల శ్రీనివాసరావు
దెందులూరు - కారుమూరి నాగేశ్వరరావు
ఏలూరు - ఆళ్లనాని
పోలవరం - తెల్లం బాలరాజు
చింతలపూడి - డాక్టర్ దేవీప్రియ
నూజివీడు - మేకా ప్రతాప్ అప్పారావు
కైకలూరు - రాంప్రసాద్
గన్నవరం - దుట్టా రామచంద్రరావు
గుడివాడ - కొడాలినాని
పెడన - బి.వేదవ్యాస్
మచిలీపట్నం - పేర్ని నాని
అవనిగడ్డ - సింహాద్రి రమేష్ బాబు
పామర్రు - ఉప్పులేటి కల్పన
పెనమలూరు - కె.విద్యాసాగర్
తిరువూరు - రక్షన్నిధి
విజయవాడ వెస్ట్ - జలీల్ ఖాన్
విజయవాడ సెంట్రల్ - గౌతమ్ రెడ్డి
విజయవాడ ఈస్ట్ - వంగవీటి రాధాకృష్ణ
మైలవరం - జోగి రమేష్
నందిగామ - ఎం.జగన్మోహనరావు
జగ్గయ్యపేట - సామినేని ఉదయభాను
తాడికొండ - హెచ్.క్రిస్టినా
మంగళగిరి - ఆళ్ల రామకృష్ణారెడ్డి
పొన్నూరు - రావి వెంకటరమణ
తెనాలి - అన్నాబత్తుల శివకుమార్
ప్రత్తిపాడు - మేకతోటి సుచరిత
గుంటూరు వెస్ట్ - లేళ్ల అప్పిరెడ్డి
గుంటూరు ఈస్ట్ - ముస్తఫా
పెదకూరపాడు - బోళ్ల బ్రహ్మనాయుడు
చిలకలూరిపేట - మర్రి రాజశేఖర్
నరసరావుపేట - డాక్టర్ శ్రీనివాసరెడ్డి
సత్తెనపల్లి - అంబటి రాంబాబు
వినుకొండ - డాక్టర్ నన్నపనేని సుధ
గురజాల - జంగా కృష్ణమూర్తి
మాచర్ల - పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
వేమూరు - మెరుగు నాగార్జున
రేపల్లె - మోపిదేవి వెంకటరమణ
బాపట్ల - కోన రఘుపతి
పర్చూరు - గొట్టిపాటి భరత్
అద్దంకి - గొట్టిపాటి రవికుమార్
చీరాల - యాదం బాలాజీ
ఎర్రగొండపాలెం - పాలపర్తి డేవిడ్ రాజు
దర్శి - బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
ఒంగోలు - బాలినేని శ్రీనివాసరెడ్డి
కొండెపి - జూపూడి ప్రభాకర్ రావు
గిద్దలూరు - ఎం.అశోక్ రెడ్డి
కనిగిరి - మధుసూదన్ యాదవ్
ఆళ్లగడ్డ - భూమా శోభా నాగిరెడ్డి
శ్రీశైలం - రాజశేఖర్ రెడ్డి
నందికొట్కూరు - ఐసయ్య
పాణ్యం - గౌరు చరితారెడ్డి
నంద్యాల - భూమా నాగిరెడ్డి
బనగానపల్లె - కాటసాని రామిరెడ్డి
డోన్ - రాజేంద్రనాధ్ రెడ్డి
కర్నూలు - ఎస్వీ మోహన్ రెడ్డి
పత్తికొండ - కోట్ల హరిచక్రపాణిరెడ్డి
కొడుమూరు - మణి గాంధీ
ఎమ్మిగనూరు - జగన్ మోహన్ రెడ్డి
మంత్రాలయం - బాలనాగిరెడ్డి
ఆదోని - వై.సాయిప్రసాద రెడ్డి
ఆలూరు - గుమ్మనూరి జయరాములు
రాయదుర్గం-కాపు రామచంద్రా రెడ్డి
ఉరవకొండ-వై విశ్వేశ్వర్ రెడ్డి
గుంతకల్-వై వెంకట్రామిరెడ్డి
తాడిపత్రి-వైఆర్ రామిరెడ్డి
శింగనమల (ఎస్పీ)-పద్మావతి
అనంతపురం అర్బన్-బి గురనాథ్ రెడ్డి
కళ్యాణదుర్గం-తిప్పేస్వామి
రాప్తాడు-తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి
మడకశిర (ఎస్సీ)-తిప్పేస్వామి
హిందూపురం-నవీన్ నిశ్చల్
పెనుకొండ-శంకర్ నారాయణ
పుట్టపర్తి-సోమశేఖర్ రెడ్డి
ధర్మవరం-కే వెంకట్రామిరెడ్డి
కదిరి-చాంద్ బాష
బద్వేలు (ఎస్సీ)-జయరాములు
కడప-అంజాద్ బాష
పులివెందుల-వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
కమలాపురం-పి రవీంద్రనాథ్ రెడ్డి
జమ్మలమడుగు-దేవగుడి ఆదినారాయణ రెడ్డి
ప్రొద్దుటూరు-రాచంపల్లి ప్రసాద్ రెడ్డి
మైదుకూరు-రఘురామి రెడ్డి
కందుకూరు-పోతుల రామారావు
కావలి-ప్రతాప్ కుమార్ రెడ్డి
ఆత్మకూరు-మేకపాటి గౌతం రెడ్డి
కోవూరు-ఎన్ ప్రసన్న కుమార్ రెడ్డి
నెల్లూరు సిటీ-అనిల్ కుమార్ యాదవ్
నెల్లూరు రూరల్-కాటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
ఉదయగిరి-మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి
సర్వేపల్లి-కాకాని గోవర్ధన్ రెడ్డి
గూడురు (ఎస్సీ)-పీ సునీల్ కుమార్
సూళ్లూరుపేట (ఎస్సీ)-సంజీవయ్య
వెంకటగిరి-కొమ్మి లక్ష్మి నాయుడు
తిరుపతి-కరుణాకర్ రెడ్డి
శ్రీకాళహస్తి-బియ్యపు మధుసూదన్ రెడ్డి
సత్యవేడు (ఎస్సీ)-ఆదిమూలం
రాజంపేట-అమర్ నాథ్ రెడ్డి
కోడూరు (ఎస్సీ)-కోరుముట్ల శ్రీనివాసులు
రాయచోటి-శ్రీకాంత్ రెడ్డి
తంబాళ్లపల్లి-ప్రవీణ్ కుమార్ రెడ్డి
పీలేరు-చింతల రామచంద్రారెడ్డి
మదనపల్లి-దేశాయ్ తిప్పారెడ్డి
పుంగనూరు-పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
చంద్రగిరి-చెవిరెడ్డి భాస్కర రెడ్డి
నగరి-ఆర్ కే రోజా సెల్వమణి
గంగాధర నెల్లూరు (ఎస్సీ)-కే నారాయణ స్వామి
చిత్తూరు-జంగాలపల్లి శ్రీనివాస్
పూతలపట్టు-సునీల్
పలమనేరు-ఎన్ అమర్ నాథ్ రెడ్డి
కుప్పం-చంద్రమౌళి
Read more ...

Sunday, 13 April 2014

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ శాసనసభ అభ్యర్థుల జాబితా

1.అమలాపురం - జంగా గౌతమ్‌
2.రాజోలు - సరెళ్ల విజయ ప్రసాద్‌
3.గన్నవరం - పాముల రాజేశ్వరీ దేవి
4.కొత్తపేట - ఆకుల రామకృష్ణ
5.మండపేట - కామన ప్రభాకరరావు
6.రాజానగరం - అంకం నాగేశ్వరరావు
7.రాజమండ్రి రూరల్ - శ్రీమతి రాయుడు రాజవెల్లి
8.జగ్గంపేట - తోట సూర్యనారాయణ మూర్తి
9.రంపచోడవరం - కేవీవీ సత్యనారాయణ రెడ్డి
10.నిడదవోలు - కామిశెట్టి వెంకట సత్యనారాయణ
11.ఆచంట - ఇందుగపల్లి రామానుజ రావు
12.పాలకొల్లు - బాల నాగేశ్వరరావు
13.నరసాపురం - నాగతులసీరావు
14.భీమవరం - యెర్లగడ్డ రాము
15.ఉండి - గాడిరాజు లచ్చిరాజు
16.తాడేపల్లిగూడెం -  దేవతి పద్మావతి
17.దెందులూరు - మాగంటి వీరేంద్ర ప్రసాద్‌
18.ఏలూరు - వెంకట పద్మరాజు
19.గోపాలపురం - కాంతవల్లి కృష్ణవేణి
20.పోలవరం - కంగల పోసిరత్నం
21.తిరువూరు - రాజీవ్‌ రత్న ప్రసాద్
22.నూజివీడు - చిన్నం రామకోటయ్య
23.గుడివాడ - అట్లూరి సుబ్బారావు
24.పామర్రు - డి.వై.దాస్‌
25.విజయవాడ వెస్ట్ - వెలంపల్లి శ్రీనివాసరావు
26.విజయవాడ సెంట్రల్‌ - మల్లాడి విష్ణువర్థన్‌రావు
27.విజయవాడ ఈస్ట్ - దేవినేని రాజశేఖర్‌
28.మైలవరం - ఆప్పసాని సందీప్‌
29.నందిగామ - బోడపాటి బాబూరావు
30.జగ్గయ్యపేట - వేముల నాగేశ్వరరావు
31.పెదకూరపాడు - పక్కల సూరిబాబు
32.తాడికొండ - చల్లగాలి కిషోర్‌
33.మంగళగిరి - కాండ్రు కమల
34.పొన్నూరు - తేళ్ల వెంకటేష్‌ యాదవ్
35.వేమూరు - రేవెండ్ల భరత్‌బాబు
36.రేపల్లె - మోపిదేవి శ్రీనివాసరావు
37.తెనాలి - నాదెండ్ల మనోహర్‌
38.బాపట్ల - సి.హెచ్. నారాయణరెడ్డి
39.ప్రత్తిపాడు - కొరివి వినయ్‌కుమార్
40.గుంటూరు వెస్ట్ - కన్నా లక్ష్మీనారాయణ
41.గుంటూరు ఈస్ట్ - ఎస్‌కే మస్తాన్ వలీ
42.చిలకలూరిపేట - ఎం. హనుమంతరావు
43.నరసరావుపేట - కాసు మహేష్‌రెడ్డి
44.సత్తెనపల్లి - యెర్రం వెంకటేశ్వరరెడ్డి
45.వినుకొండ - ఎం. మల్లిఖార్జునరావు
46.గురజాల - ఆనం సంజీవ్‌రెడ్డి
47.మాచర్ల - రాంశెట్టి నరేంద్ర బాబు
48.దర్శి - కోట పోతుల  జ్వాలారావు
49.పర్చూరు - మోదుగుల కృష్ణారెడ్డి
50.అద్దంకి - గాలం లక్ష్మీయాదవ్
51.చీరాల - మెండు నిశాంత్‌
52.మార్కాపురం - ఏలూరి రామచంద్రారెడ్డి
53.సంతనూతలపాడు - నూతల తిరుమల రావు
54.ఒంగోలు - యెద్దు శశికాంత్‌ భూషణ్‌
55.కందుకూరు - వెంకట్రావ్ యాదవ్‌
60.కొండేపి - జి.రాజ్‌విమల్‌
61.గిద్దలూరు - కందుల గౌతమ్‌రెడ్డి
62.కనిగిరి - ముక్కు ఉగ్రనరసింహారెడ్డి
63.కోవూరు - జి.వెంకటరమణ
64.నెల్లూరు సిటీ - ఏసీ సుబ్బారెడ్డి
65.నెల్లూరు రూరల్‌- ఆనం విజయకుమార్‌రెడ్డి
66.సర్వేపల్లి - కె.పట్టాభిరామయ్య
67.గూడూరు - పనబాక కృష్ణయ్య
68.సూళ్లూరుపేట - డి.మధుసూదనరావు
69.వెంకటగిరి - ఎన్‌.రామ్‌కుమార్‌రెడ్డి
70.బద్వేల్ - జె.కమల్ ప్రభాస్‌
71.రాజంపేట - గాజుల భాస్కర్‌
72.కడప - మహ్మద్‌ అష్రాఫ్‌
73.రాయచోటి - షేక్ ఫజ్లే ఇల్లా
74.పులివెందుల - రాజగోపాల్‌రెడ్డి
75.ఆళ్లగడ్డ - టి.ఎ.నరసింహారావు
76.శ్రీశైలం - షబానా
77.నందికొట్కూరు - చెరుకూరి అశోకరత్నం
78.కర్నూలు - అహ్మద్ అలీఖాన్
79.నంద్యాల - జూపల్లి రాకేష్‌రెడ్డి
80.బనగానపల్లి - పేర రామసుబ్బారెడ్డి
81.డోన్ - ఎల్‌.లక్ష్మీరెడ్డి
82.పత్తికొండ - కె.లక్ష్మీనారాయణరెడ్డి
83.కోడుమూరు - పి.మురళీకృష్ణ
84.ఆదోని - మనియర్ యూనిస్‌
Read more ...

ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా


లోక్‌సభకు కాంగ్రెస్ పార్టీ నుండి పోటీచేసే ఆంధ్రప్రదేశ్ అభ్యర్థుల జాబితా ఆపార్టీ నేతలు ఆదివారం విడుదల చేశారు.
అభ్యర్థుల జాబితా:
అరకు: కిశోర్ చంద్రదేవ్
విజయనగరం: బొత్స ఝానీ
శ్రీకాకుళం-కిల్లి కృపారాణి
రాజమండ్రి-కందుల దుర్గేష్
అమలాపురం-మహేశ్వర్‌రావు
నర్సాపురం-బాపిరాజు
రాజంపేట-సాయిప్రతాప్
నంద్యాల-రామయ్య
హిందూపురం - వెంకట్రాముడు
తిరుపతి-చింతా మోహన్
నెల్లూరు-వాకాటి నారాయణరెడ్డి
నర్సారావుపేట-కాసు వెంకట కృష్ణారెడ్డి
గుంటూరు-షేక్ వహీద్
విజయవాడ-దేవినేని అవినాశ్
ఏలూరు-నాగేశ్వర్‌రావు
బాపట్ల-పనబాక లక్ష్మీ
కర్నూలు-కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి
Read more ...

భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం - సమీక్ష

భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడ్డాక ఒక్కసారి మాత్రమే ఎన్నికలు జరిగాయి. 2008లో డీ లిమిటేషన్ వల్ల కొత్తగా ఏర్పడిన నియోజకవర్గమే భువనగిరి. ఇంతకుముందు ఉన్న మిర్యాలగూడ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు చాలా వరకు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కలిపారు.
2009 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి పోటీ చేసిన కోమటి రెడ్డి రాజగోపాల్ మొదటిసారిగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి గెలుపొందారు.
2014 పార్లమెంట్ ఎన్నికలు ప్రత్యేకమైనవి  అని చెప్పవచ్చు. కాంగ్రెస్ నుండి కోమటి రెడ్డి రాజగోపాల్ మళ్ళీ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. మొదటి సారి గెలుస్తామనే ధీమాతో ఉంది తెరాస, ఆ పార్టీ నుండి డాక్టర్ జేఏసి నేత బూర నర్సయ్య గౌడ్ బరిలో ఉన్నాడు. ఇక బీజేపీ నుండి నల్లు ఇంద్రసేనా రెడ్డి పోటీ చేస్తున్నారు.
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం అంటే ఒక ప్రత్యేకత ఉంటుంది.  మూడు జిల్లాల నియోజకవర్గాల సముదాయమే  ఈ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం. నల్గొండ జిల్లాకు చెందిన తుంగతుర్తి, మునుగోడ్, నకిరేకల్, భువనగిరి, ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా వరంగల్ జిల్లాకు చెందిన జనగాం మరియు రంగారెడ్డి జిల్లాకు చెందిన ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గాలు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి.
డీ లిమిటేషన్ లో పోయిన మిర్యాలగూడ పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీల బలాబలాలు పరిశీలిస్తే క్రింది విధంగా ఉన్నాయి.
1962-67    -    Laxmi Dass
1967-71    -    G. S. Reddy
1971-77    -    B. N. Reddy
1977-80    -    G. S. Reddy
1980-84    -    G. S. Reddy

1984-89    -    Bheemireddy Narsimha Reddy
1989-91    -    Baddam Narsimha Reddy
1991-96    -    Baddam Narsimha Reddy
1996-98    -    Baddam Narsimha Reddy
1998-99    -    Baddam Narsimha Reddy
1999-04    -    Jaipal Reddy
2004-09    -    Jaipal Reddy
 మిర్యాలగూడ పార్లమెంట్ కు జరిగిన 12 ఎన్నికల్లో 9సార్లు కాంగ్రెస్ గెలిచి తమ సత్తాను ఎప్పటికప్పుడు ఇక్కడ కాంగ్రెస్ నిరూపించుకుంది.మిగతా మూడు సార్లు కమ్యూనిస్ట్ లు గెలిచారు.
Read more ...

ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం - సమీక్ష

ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం రంగారెడ్డి జిల్లాలోనిది. అయితే ఇబ్రహీంపట్నం మాత్రం భువనగిరి  పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. ప్రస్తుతం ఇక్కడ టీడీపీ ఎమ్మెల్ల్యే మంచిరెడ్డి.కిషన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు.
13సార్లు ఇప్పటి వరకు ఎన్నికలు జరగగా అయిదు సార్లు కాంగ్రెస్ గెలుచుకోగా టీడీపీ , సీపీఎం లు 3సార్లు గెలిచాయి. 1981 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్(ఐ) అభ్యర్థి ఎ.జి.కృష్ణ గెలుపొందారు.
ఇప్పటి వరకు గెలిచినా అభ్యర్థులు :
1957 -  లక్ష్మీ నర్సయ్య (కాంగ్రెస్)
1962 -  లక్ష్మీ నర్సయ్య (కాంగ్రెస్)
1967 -  లక్ష్మీ నర్సయ్య(కాంగ్రెస్)
1972 -  అనంత రెడ్డి (కాంగ్రెస్)
1978 - సుమిత్రా దేవి(కాంగ్రెస్ - ఐ)
1981 - ఎ.జి.కృష్ణ(కాంగ్రెస్ - ఐ)
1983 -  ఎ.జి.కృష్ణ(కాంగ్రెస్)
1985 -  సత్యనారాయణ కె (టీడీపీ)
1989 -  కొండిగరి రాములు(సీపీఎం)
1994 -  కొండిగరి రాములు(సీపీఎం)
1999 -  కోడూరు పుష్ప లీల(టీడీపీ)
2004 -  మస్కు నర్సయ్య (సీపీఎం)
2009 -  మంచిరెడ్డి కిషన్ రెడ్డి(టీడీపీ)
 2014 లో ఏ పార్టీ నుండి ఎవరు :
తెరాస - కంచర్ల శేఖర్ రెడ్డి
టీడీపీ/బీజేపీ -  మంచిరెడ్డి కిషన్ రెడ్డి
కాంగ్రెస్/సిపిఐ -  మల్లేష్
ఎంఐఎం  -  యాదయ్య పి
Read more ...

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం - సమీక్ష

నల్గొండ జిల్లాలో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. అయితే ఈ అసెంబ్లీ నియోజకవర్గం  భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉంటుంది.
ఈ నియోజకవర్గం 1967లో ఏర్పడింది. ఇప్పటి వరకు జరిగిన 10 ఎన్నికల్లో 5 సార్లు కాంగ్రెస్,5 సార్లు సీపీఐ గెలుచుకున్నాయి. ఇంకో పార్టీ ఇప్పటి వరకు ఇక్కడ గెలవలేకపోయాయి. కాంగ్రెస్ గెలిచినా 5సార్లలో నాలుగు సార్లు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గెలిచారు.1967,72,78,83 ఎన్నికల్లో వరుసగా 4సార్లు ఇక్కడి ప్రజలు పాల్వయిని ఎన్నుకొన్నారు. 1985,89,94 ఎన్నికల్లో సీపీఐ పార్టీ నుండి పోటీ చేసిన ఉజ్జిని  నారాయణ రావు హ్యాట్రిక్ విజయం సాధించారు.
1967-2009 వరకు వివరాలు:
1967,72,78,83 -  పాల్వాయి గోవర్దన్ రెడ్డి(కాంగ్రెస్)
1985,89,94 -  ఉజ్జిని నారాయణ రావు(సీపీఐ)
1999 -  పాల్వాయి గోవర్దన్ రెడ్డి(కాంగ్రెస్)
2004 -  పల్లా వెంకట్ రెడ్డి (కాంగ్రెస్)
2009 -  ఉజ్జిని యాదగిరి రావు (సీపీఐ)
2014 లో జరగనున్న ఎన్నికల్లో సీపీఐ, కాంగ్రెస్ కాకుండా ఇంకో పార్టీ గెలిచే అవకాశం ఉంది అని తెరాస భావిస్తుంది. తెలంగాణా రాష్ట్ర సమితి నుండి కూసుకుంట్ల ప్రభాకర్, బీజేపీ నుండి గంగిడి మనోహర్ రెడ్డి, కాంగ్రెస్/సీపీఐ అభ్యర్థి వెంకట్ రెడ్డి పోటీలో ఉన్నారు.
 మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్న మండలాలు :
మునుగోడు, నారాయణపూర్, మర్రిగూడ,నాంపల్లె, చండూర్ మరియు చౌటుప్పల్
Read more ...

భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం - సమీక్ష

భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఇప్పటి వరకు టీడీపీ 6 సార్లు గెలుపొందగా 4సార్లు కాంగ్రెస్ గెలుచుకుంది. పీడీఎఫ్, సీపీఐ ఒక్కోసారి గెలుపొందాయి. నల్గొండ జిల్లా అంటే కమ్యూనిస్ట్ ల ప్రాభవం ఎక్కువగా ఉన్న జిల్లా, కాని భువనగిరి నియోజకవర్గం మాత్రం అందుకు భిన్నం. 1962లో సీపీఐ గెలుపు మినహా ఇప్పటి వరకు కమ్యూనిస్ట్ ల ప్రాభవం భువనగిరి నియోజకవర్గం మీద లేదు. 
అత్యధికంగా టీడీపీ అభ్యర్థి ఎలిమినేటి మాధవ రెడ్డి 4 సార్లు ఇక్కడి నుండి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తరువాత కొండా లక్ష్మణ్ బాపూజీ 3సార్లు, ఉమా మాధవ రెడ్డి 2సార్లు గెలిచారు.1985 నుండి ఇప్పటి వరకు ఇక్కడ తెలుగుదేశం పార్టీ మినహా మరే పార్టీ గెలుచుకోలేదు. అది కూడా మాధవ రెడ్డి కుటుంబమే చక్రం తిప్పుతుంది ఇక్కడ. మాధవ రెడ్డి నక్సల్స్ బాంబ్ పేల్చిన ఘటనలో మరణించిన అనంతరం ఆయన సతీమణి ఉమా మాధవ రెడ్డి 2004,2009లో వరుసగా విజయం సాధించింది.క్విట్ ఇండియా,నాన్ ముల్కీ మరియు తెలంగాణా ఉద్యమాల్లో పాల్గొన్న కొండా లక్ష్మణ్ బాపూజీ కాంగ్రెస్ పార్టీ నుండి 1967,72,78 లో మూడు సార్లు గెలిచారు.
ఇప్పటి వరకు ఎవరెవరు గెలిచారు
1957 -  ఆర్. నారాయణ రెడ్డి(పీడీఎఫ్)
1962 -  ఎ. రామచంద్రా రెడ్డి (సీపీఐ)
1967,1972,1978 -  కొండా లక్ష్మణ్ బాపూజీ (కాంగ్రెస్)
1983 -  కొమ్మిడి నరసింహా రెడ్డి (కాంగ్రెస్)
1985,89,94,99 - ఎలిమినేటి మాధవ రెడ్డి(టీడీపీ)
2004,09 -  ఉమా మాధవ రెడ్డి(టీడీపీ)
2014 ఎన్నికల విషయానికి వస్తే తెరాస పార్టీ నుండి పైలా శేఖర్ రెడ్డి, టీడీపీ నుండి మరోసారి ఉమా మాధవ రెడ్డి, కాంగ్రెస్ నుండి వెంకటేశ్వర్లు పోటీలో ఉన్నారు.
Read more ...

Saturday, 12 April 2014

నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గం - సమీక్ష

నల్గొండ జిల్లాలో చారిత్రక నేపధ్యం ఉన్న నియోజకవర్గాల్లో నకిరేకల్ ముందుంటుంది. రాజాకారులకు వ్యతిరేకంగా పోరాడిన వారిలో నంద్యాల శ్రీనివాస రెడ్డి ముఖ్యుడు. నంద్యాలతో పాటు పన్నాల రాఘవ రెడ్డి, బీసీ నేత కొండా నాగయ్య మరియు చింతపల్లి చిన్న రాములు కూడా రాజాకారులకు వ్యతిరేఖంగా పోరాడిన వారే. వీరందరికీ జన్మనిచ్చిన గడ్డ నకిరేకల్. ఘన చరిత్ర ఉన్న నకిరేకల్ లో ఇప్పటి వరకు ఏ పార్టీలు రాజ్యమేలాయో చూద్దాం.
డీ లిమిటేషన్ తరువాత నల్గొండ జిల్లాలో పెద్ద అసెంబ్లీ నియోజకవర్గం నకిరేకల్.
 నకిరేకల్ నియోజకవర్గం అనగానే కమ్యూనిస్ట్ ల కంచుకోట అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు నకిరేకల్ నియోజకవర్గంలో 12 సార్లు ఎన్నికలు జరగగా 8 సార్లు సీపీఎం జయకేతనం ఎగురవేయగా కాంగ్రెస్ రెండు సార్లు, పీడీఎఫ్, సీపీఐ తలా ఒక్కోసారి గెలుపొందాయి.
1957 జరిగిన మొదటి ఎన్నికల్లో పీడీఎఫ్ నుండి పోటీ చేసిన ధర్మ భిక్షం గెలిచాడు. 1962 ఎన్నికల్లో సీపీఐ నుండి పోటీ చేసి నంద్యాల శ్రీనివాస్ రెడ్డి గెలుపొందాడు. 1967 నుండి 2004 వరకు జరిగిన ఎన్నికల్లో సీపీఎం పార్టీకి అడ్డు లేకుండా పోయింది. అయితే 1972 లో ఒక్కసారి మాత్రం కాంగ్రెస్ పార్టీనుండి నిల్చున్న మూసపాటి కమలమ్మ విజయం సాధించింది. 1967,1978,1983,19851989,1994 వరుసగా అయిదు సార్లు మొత్తంగా ఆరు సార్లు నర్రా రాఘవ రెడ్డికి నకిరేకల్ ప్రజలు  పట్టంఘట్టారు.
1999,2004 లో సీపీఎం పార్టీకే చెందిన నోముల నర్సింహయ్య వరసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. దాదాపుగా 31 సంవత్సరాలు నకిరేకల్ ప్రజలు సీపీఎం పార్టీనే గెలిపించారు. 2009 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి చిరుమర్తి లింగయ్య సీపీఎం పార్టీ అభ్యర్థి మామిడి నర్సయ్య పై 12176 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో టీడీపీ పార్టీ ఉనికిని నిరూపించుకోలేకపోయింది.
2014లో జరిగే ఎన్నికలు మాత్రం ప్రత్యేకం అని చెప్పవచ్చు. తెలంగాణ సాధించిన పార్టీగా తెరాస, తెలంగాణా తీసుకొచ్చిన పార్టీగా కాంగ్రెస్ పోటీకి సిద్ధమయ్యాయి.
తెరాస పార్టీ నుండి వీరేశం, కాంగ్రెస్ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పోటీ పడుతుండగా బీజీపీ నుండి చెరుకు లక్ష్మీ భాయి తమ తమ అదృష్టాలను పరీక్షించుకోబోతున్నారు.
Read more ...

ఆలేర్ నియోజకవర్గం - సమీక్ష

నల్గొండ జిల్లాలో ఉన్న ఆలేర్ నియోజకవర్గం రాజకీయాలు పరిశీలిస్తే చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 12 సార్లు ఎన్నికలు జరగగా నాలుగు సార్లు కాంగ్రెస్ పార్టీ, టీడీపీ మరియు ఇండిపెండెంట్ లు రెండు సార్లు గెలవగా పీడీఎఫ్, సీపీఐ,కాంగ్రెస్(ఐ) మరియు తెరాస తలా ఒక్కోసారి ఇక్కడ గెలుపొందాయి.
 ఆలేర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటిసారి 1957 లో ఎన్నికలు జరిగాయి. పీడీఎఫ్ పార్టీకి చెందిన ఆరుట్ల కమలాదేవి కాంగ్రేస్ అభ్యర్థి పున్నా రెడ్డి మీద విజయం సాధించి ఆలేర్ అసెంబ్లీ నియోజకవర్గ మొదటి  మహిళ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సాయుధ పోరాట నేపధ్యం ఉన్న ఆరుట్ల కమలాదేవి నిజం వెన్నుల్లో వణుకు పుట్టించిన వీర వనిత.
1962 ఎన్నికల్లో సీపీఐ తరుపున పోటీ చేసిన కమలదేవినే మళ్ళీ ఆలేరు ప్రజలు ఎన్నుకున్నారు. 1967 లో రాజకీయాలనుండి ఆరుట్ల కమలాదేవి తప్పుకుంది. అదే సంవత్సరం జరిగిన ఎన్నికల్లో పున్నా రెడ్డి కాంగ్రెస్ నుండి గెలిచాడు,72 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ నుండి పోటీ చేసి పున్నా రెడ్డి గెలుపొందడం జరిగింది.
1978 సంవత్సరంలో కాంగ్రెస్(ఐ) నుండి పోటీ చేసిన సల్లూరి పోచయ్య గెలిచాడు. 1983 లో జరిగిన ఎన్నికల నుండి ఆలేరు రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ఈ ఎన్నికల్లో మొదటి సారిగా మోత్కుపల్లి నర్సింహులు జయకేతనం ఎగురవేశాడు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన మోత్కుపల్లి కాంగ్రెస్ అభ్యర్థి పోచయ్య పై గెలుపొందాడు. ఇక మోత్కుపల్లి వెనక్కి తిరిగి చూడలేదు, ఆలేరు నియోజకవర్గ ప్రజలు వరుసగా 5సార్లు మోత్కుపల్లికే పట్టం కట్టారు. అయితే 1983లో ఇండిపెండెంట్ గా గెలిచినా మోత్కుపల్లి 1985లో టీడీపీ నుండి,1989లో మళ్ళీ ఇండిపెండెంట్ గా,1994లో టీడీపీ నుండి 1999లో కాంగ్రెస్ నుండి గెలుపొందాడు.
మోత్కుపల్లి 5సంవత్సరాల విజయపరంపరకు 2004 సంవత్సరంలో తెరాస అడ్డుకట్ట వేసింది. కాంగ్రెస్ నుండి టీడీపీ లోకి వచ్చిన మోత్కుపల్లి 2004 ఎన్నికల్లో డాక్టర్. కుందూరు నగేష్(తెరాస) చేతిలో 24825 ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. ఇక 2009 ఎన్నికల విషయానికి వస్తే ఏకంగా ఆలేరు నియోజకవర్గం నుండి 18మంది పోటీలో నిలిచారు. కాంగ్రెస్ నుండి పోటీ చేసిన బూడిద బిక్షమయ్య తెరాస అభ్యర్థి కళ్ళెం యాదగిరి రెడ్డి మీద గెలిచాడు.
2014 ఎన్నికల విషయానికి వస్తే కాంగ్రెస్ నుండి బిక్షమయ్య గౌడ్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. తెరాస పార్టీ నుండి సునీత మహేందర్ రెడ్డి పోటి చేస్తుంది. తెలంగాణా తీసుకొచ్చాం కాబట్టి మేమే గెలుస్తామని తెరాస గెలుపు పై ధీమాగా ఉంది. బీజీపీ అభ్యర్థి కాసం వేంకటేశ్వర్లు పోటీ చేస్తున్నారు.
ఆలేరు నియోజకవర్గ పరిధిలో ఎమ్. తుర్కపల్లి, రాజాపేట్,యాదగిరిగుట్ట, ఆలేరు, గుండాల,ఆత్మకూరు(ఎమ్) మరియు బొమ్మల రామారం మండలాలు వస్తాయి.
Read more ...

Thursday, 10 April 2014

జనగాం అసెంబ్లీ నియోజక వర్గం - సమీక్ష

వరంగల్ జిల్లాకు చెందిన జనగాం అసెంబ్లీ నియోజక వర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఉన్నది వరంగల్ జిల్లానే అయినప్పటికీ పార్లమెంట్ స్థానం మాత్రం నల్గొండ జిల్లా భువనగిరి పరిధిలోకి వస్తుంది.
ఇక్కడ ఇప్పటి వరకు 12 సార్లు ఎన్నికలు జరగగా 7సార్లు కాంగ్రెస్, రెండు సార్లు సీపీఎం గెలుపొందగా  కాంగ్రెస్(ఐ),పీడీఎఫ్ మరియు ఇండిపెండెంట్ ఒక్కోసారి గెలుచుకున్నారు.
కాంగ్రెస్ కు పెట్టని గోడ జనగాం అని చెప్పవచ్చు. తెలుగుదేశం ప్రభంజనంలో కూడా కాంగ్రెస్ జనగాం స్థానాన్ని నిలబెట్టుకుంది. మొట్టమొదటి సారిగా 1957లో జరిగిన ఎన్నికల్లో జి. గోపాల్ రెడ్డి పీడీఎఫ్ పార్టీ తరపున పోటి చేసి కాంగ్రెస్ అభ్యర్థి మీద గెలిచాడు.1962,67,72 లలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుచుకుంది. 1978లో కాంగ్రెస్(ఐ),1983 లో ఇండిపెండెంట్ అభ్యర్థి, 1985లో మొదటిసారిగా సీపీఎం గెలుచుకుంది.
తరువాతి జరిగిన 5 ఎన్నికల్లో 4 సార్లు కాంగ్రెస్ అభ్యర్థి పొన్నాల లక్ష్మయ్య జయకేతనం ఎగురవేశారు జనగాంలో . 1989 లో మొదటిసారి పొన్నాల కాంగ్రెస్ నుండి పోటీ చేసి గెలుపొందాడు. అయితే 1994 లో మాత్రం సీపీఎం పార్టీ నుండి పోటీ చేసిన చరగొండ రాజి రెడ్డి చేతిలో పొన్నాల అనూహ్యంగా 24508 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. 1999 లో తెదేపా అభ్యర్థి ప్రేమలత రెడ్డి పై, 2004 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బస్వా రెడ్డి పై గెలుపొందాడు. 2009 లో మొదటి సారి పోటీ చేసిన తెరాస అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మీద స్వల్ప ఆధిక్యంతో పొన్నాలా నెగ్గాడు. పొన్నాల కు 40.47 శాతం ఓట్లు పోలుకాగా ప్రతాప్ రెడ్డి కి 40.31 శాతం ఓట్లు పోలయ్యాయి.
ఈసారి పొన్నాల టీ-పీసీసీ చీఫ్ గా జనగాం అసెంబ్లీ కి కాంగ్రెస్ తరపున పోటి చేస్తుండగా, తెరాస తరపున ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పోటి చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో  పొన్నాలను ఓడించడానికి తెరాస ప్రయత్నిస్తుంది. తెలంగాణా ఉద్యమంలో ఎక్కడ పాల్గొనలేదు అనే ప్రచారంతో తెరాస ముందుకు పోతుంటే, తెలంగాణా మావల్లే వచ్చింది అని కాంగ్రెస్ వెళ్తుంది. ఎవరిది గెలుపో తెలుసుకోవాలంటే పలితాల వరకు ఆగాల్సిందే.
Read more ...

తుంగతుర్తి నియోజకవర్గం - సమీక్ష

తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం గురించిన విషయాలు, విశేషాలు తెలుసుకుందాం.
తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నల్గొండ జిల్లాలో ఉంది. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో భాగం తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం. ఇది వరకు మిర్యాలగూడ పార్లమెంట్ పరిధిలో ఉన్న తుంగతుర్తి 2008 డీ లిమిటేషన్ లో భాగంగా భువనగిరిగి మారింది.
తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గం 1967 లో ఏర్పడింది. ఇప్పటి వరకు పదిసార్లు ఇక్కడ ఎన్నికలు జరగగా సిపిఎం మూడుసార్లు,కాంగ్రెస్‌(ఐ) మూడుసార్లు, తెలుగుదేశం రెండుసార్లు,ఇండిపెండెంట్లు రెండుసార్లు గెలిచారు.
ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచు కోట అయిన నల్గొండ జిల్లాలోని తుంగతుర్తిలో సీపీఎం మూడు సార్లు జయకేతనం ఎగురవేసింది.భీమ్‌రెడ్డి నరసింహారెడ్డి(సీపీఎం) 1967 లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. తరువాత 1978,1983లో భీమ్‌రెడ్డి నరసింహారెడ్డి సోదరి మల్లు స్వరాజ్యం(సీపీఎం) రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తరువాతి నుండి స్పష్టంగా కాంగ్రెస్ ఆధిపత్యం చెలాయించింది. రాంరెడ్డి దామోదర్ రెడ్డి రాకతో ఇక సీపీఎం నామరూపాలు లేకుండా పోయింది.
1985,1989,1994లలో హ్యాట్రిక్ విజయాలతో దామోదర్ రెడ్డి దూసుకుపోయారు. 1994లో మాత్రం కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటి చేసి మూడోసారి విజయం సాధించారు. ఇక 1999 ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనంతో మొదటి సారిగా తుంగతుర్తి అసెంబ్లీ తెదేపా ఖాతాలోకి వెళ్ళింది. అప్పటి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా ఉన్న సంకినేని వెంకటేశ్వర్లు టీడీపీ తరుపున పోటి చేసి దామోదర్ రెడ్డి మీద విజయం సాధించాడు.
2004 ఎనికల్లో మళ్ళీ దామోదర్ రెడ్డి, సంకినేని వెంకటేశ్వర్ల మీద 13184 ఓట్ల మెజారిటీతో గెలిచి ప్రతీకారం తీర్చుకున్నాడు. 2008 డీ లిమిటేషన్ లో భాగంగా తుంగతుర్తి నియోజక వర్గం ఎస్సీ కి రిజర్వ్ కావడంతో టీడీపీ తరుపున మోత్కుపల్లి నర్సింహులు సమీప కాంగ్రెస్ అభ్యర్థి జి.నర్సయ్య మీద 11863 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
ఈసారి పోటి మరింత రసవత్తరంగా ఉండనుంది. మొదటి సారిగా ఇక్కడ తెరాస పోటిచేస్తుంది. తెలంగాణా రావడానికి కారణం మేమే అని తెరాస, తెలంగాణా తీసుకొచ్చింది మేమే అని కాంగ్రెస్ ప్రజల ముందుకు వెళ్తున్నాయి. తెరాస నుండి విద్యార్థి నేత గాదరి కిషోర్, కాంగ్రెస్ నుండి టీజేఏసి నేత అద్దంకి దయాకర్ పోటిచేస్తున్నారు. టీడీపీ నుండి ఈసారి మోత్కుపల్లి ఇక్కడి నుండి పోటీ చేయడం లేదు, అయితే తెదేపా నుండి పి. రజని కుమారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.కాంగ్రెస్ నుండి టికెట్ ఆశించి భంగపడ్డ గుడిపాటి నర్సయ్య కాంగ్రెస్ రెబెల్ గా పోటీ చేస్తున్నారు.
Read more ...

Friday, 4 April 2014

గజ్వేల్ నుంచి అసెంబ్లీ స్థానానికి కేసీఆర్ పోటీ

గజ్వేల్ నియోజకవర్గం నుండి ఈ సారి అసెంబ్లీకి పోటీ చేయనున్నట్లు కెసిఆర్ చెప్పారు.తెలంగాణా భవన్ లో ఆయన శుక్రవారం ఉదయం 10.57 నిమిషాలకు 69 మందితో అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు.అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఈ సందర్భంగా కెసిఆర్ చెప్పారు. మిగతా 50 అసెంబ్లీ, 17 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.
Read more ...

టీ20 ప్రపంచకప్ లో ఫైనల్ కు చేరిన శ్రీలంక

మిర్పూర్: ట్వంటీ 20 ప్రపంచకప్ లో మరోసారి శ్రీలంక ఫైనల్ కు చేరింది.వెస్టిండీస్ తో జరిగిన తొలి సెమీ ఫైనల్ డే అండ్ నైట్ మ్యాచ్ కు వరుణుడు అడ్డంకిగా మారడంతో ఫలితాన్ని డక్ వర్త్ లూయిస్ ప్రకారం ప్రకటించారు.వెస్టిండీస్ 13.5 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టానికి 80 తో ఉన్నదశలో ఒక్కసారిగా భారీ రాళ్ళ వర్షం పడడంతో డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం శ్రీలంక 27 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్ చేరింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 161 పరుగులు చేసింది.మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లు తిరుమన్నే(44), మాథ్యూస్(40) పరుగులు చేయడంతో మంచి స్కోర్ ను విండీస్ ముందు ఉంచగలిగింది శ్రీలంక.
161 పరుగుల లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన వెస్టిండీస్ నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారభించింది. ఓపెనర్లు క్రిస్ గేల్(3), స్మిత్ (17) పరుగులు మాత్రమే చేశారు. శామ్యూల్స్(16), సమీ(0) తో క్రీజ్ లో ఉండగా వర్షం పడింది. అప్పటికి విండీస్ స్కోర్ 4 వికెట్ల నష్టానికి 80 పరుగులతో ఉంది. విండీస్ గెలవడానికి 107 పరుగులు అవసరం ఉండే.డిఫెండింగ్ ఛాంపియన్ లుగా బరిలోకి దిగిన విండీస్ సెమీ ఫైనల్ లో ఇంటి దారి పట్టాల్సి వచ్చింది.
Read more ...

Current Affairs 2nd April 2014

1.2013 సంవత్సరానికి గాను తమిళనాడు కు చెందిన వినోత్ కుమార్ కు 'యంగ్ అచీవర్ అవార్డ్' లభించింది. వ్యవసాయ రంగంలో చేసిన కృషికి ఈ అవార్డ్ ను హిమాచల్ ప్రదేశ్ కు చెందిన డాక్టర్. వైఎస్ పర్ మార్ యూనివర్సిటీ అందజేసింది.
2.కలిసి పని చేసుకోవడానికి టాటా సన్స్ మరియు సింగపూర్ ఎయిర్ లైన్స్ కి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఎన్ఒసి(No Objection Certificate) జారీ చేసింది.
Read more ...

Current Affairs 1st April 2014

1.రేపో రేట్ కు సంబంధించి ఎలాంటి మార్పు చేయడంలేదు అని,8% గానే ఉంటుంది అని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘు రామ్ రంజన్ తెలిపారు. మొదటి ద్వి నెలవారీ ద్రవ్య విధానం విడుదల సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
2.ఈరోజు నుండి H-1B వీసాలను అంగీకరిస్తున్నట్లు అమెరికా తెలిపింది.
3.అంతర్జాతీయ చెస్ సమాఖ్య FIDE చెస్ ర్యాంకులను ప్రదర్శించింది.పురుషుల విభాగంలో మన దేశానికి చెందిన విశ్వనాథన్ ఆనంద్ 3వ స్థానంలో కొనసాగుతున్నాడు. మొదటి స్థానంలో మాగ్నస్ కార్లసన్ కొనసాగుతున్నాడు.
మహిళల విభాగంలో తెలుగమ్మాయి కోనేరు హంపి 3వ స్థానంలో కొనసాగుతుంది. మొదటి స్థానంలో హంగేరీ కి చెందిన జుడిత్ పోల్గర్ కొనసాగుతుంది.
Read more ...

Current Affairs 31st March 2014

1.1.అంతర్గత శాఖా మంత్రిగా ఉన్న మాన్యుయల్ వల్స్ ,ఫ్రాన్స్ దేశ తదుపరి ప్రధాని కానున్నారు. ప్రస్తుత ప్రధానిగా ఉన్న జీన్ మార్క్ స్థానంలో వల్స్ ప్రధాని కానున్నారు.
2.ఉత్తరాఖండ్ లో 125 కోట్ల జల విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణానికి BHEL మరియు ఉత్తరాఖండ్ Jala Vidyuth Nigam Ltd మధ్య ఒప్పందం కుదిరింది.ఈ ఒప్పందంతో భెల్ అదనంగా సంవత్సరానికి 20000మెగా వాట్ల ఉత్పత్తి అధికంగా చేయనుంది.
3.హైకోర్టు, సుప్రీమ్ కోర్టు జడ్జీల పదవీవిరమణ సదుపాయాలు సబార్డినేట్ కోర్టు జడ్జీలతో సమానము అని సుప్రీమ్ కోర్టు తెలిపింది.
Read more ...

Thursday, 3 April 2014

టీ20 ప్రపంచకప్ తొలి సెమి ఫైనల్ నేడు


టీ20 ప్రపంచకప్ లో ఈరోజు జరిగే మొదటి సెమి ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంక, వెస్టిండీస్ తలపడనున్నాయి. గ్రూప్-1లో శ్రీలంక అగ్రస్థానంలో నిలవగా, గ్రూప్-2లో వెస్టిండీస్ ద్వితీయ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.
రెండు జట్ల బలాబలాలు సమానంగా ఉండడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. వెస్టిండీస్ టీమ్ లో చాలా వరకు భారీ హిట్టర్లు ఉండడం వారికే కలిసొచ్చే అంశం, కాని స్పిన్ బౌలింగ్ సమర్దంగా ఆడలేకపోవడం వారి బలహీనతో. బౌలింగ్ తో వెస్టిండీస్ ను కట్టడి చేయగలమనే దీమాతో శ్రీలంక బరిలోకి దిగుతుంది. శ్రీలంక బ్యాటింగ్ విషయానికి వస్తే కాస్త నిలకడలేమి కనిపిస్తుంది. ఒక మ్యాచ్ లో రాణించిన ఆటగాడు ఇంకో మ్యాచ్ లో రాణించడం లేదు.
ఇరు జట్లు గెలుపుపై ధీమాగా ఉన్నాయి.
Read more ...
Designed By Published.. Blogger Templates