Radio LIVE


Breaking News

Thursday, 3 April 2014

తెలంగాణాలో నేటి నుండి షురూ

తెలంగాణాలో సార్వత్రిక ఎన్నికలకు నేటి నుండి నామినేషన్లు స్వీకరించనున్నారు.అయితే బుధవారం దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తాం అని రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శి భన్వర్ లాల్ తెలిపారు.
17 లోక్ సభ ,119 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 7నుండి ఇంటింటికి తిరిగి ఓటరు స్లిప్పులు పంపిణి చేస్తామని,మొదట జంట నగరాల్లో, ఈనెల 10నుండి తెలంగాణా ఇతర జిల్లాల్లో ఓటరు స్లిప్పుల పంపిణి ఉంటుంది అని భన్వర్ లాల్ అన్నారు.
సెలవు దినాలు అయిన జగ్జీవన్ రామ్ జయంతి(ఏప్రిల్ 5), శ్రీరామనవమి(ఏప్రిల్ 8) మరియు రెండో శనివారం(ఏప్రిల్ 12) ఈ మూడు రోజుల్లో నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణలకు అవకాశం ఉంది అని భన్వర్ లాల్ చెప్పారు.
ఏప్రిల్ 30న ఎన్నికలు జరగనున్నాయి.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates