టీ20 ప్రపంచకప్ లో ఈరోజు జరిగే మొదటి సెమి ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంక,
వెస్టిండీస్ తలపడనున్నాయి. గ్రూప్-1లో శ్రీలంక అగ్రస్థానంలో నిలవగా,
గ్రూప్-2లో వెస్టిండీస్ ద్వితీయ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.
రెండు జట్ల బలాబలాలు సమానంగా ఉండడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం
ఉంది. వెస్టిండీస్ టీమ్ లో చాలా వరకు భారీ హిట్టర్లు ఉండడం వారికే
కలిసొచ్చే అంశం, కాని స్పిన్ బౌలింగ్ సమర్దంగా ఆడలేకపోవడం వారి బలహీనతో.
బౌలింగ్ తో వెస్టిండీస్ ను కట్టడి చేయగలమనే దీమాతో శ్రీలంక బరిలోకి
దిగుతుంది. శ్రీలంక బ్యాటింగ్ విషయానికి వస్తే కాస్త నిలకడలేమి
కనిపిస్తుంది. ఒక మ్యాచ్ లో రాణించిన ఆటగాడు ఇంకో మ్యాచ్ లో రాణించడం లేదు.
ఇరు జట్లు గెలుపుపై ధీమాగా ఉన్నాయి.
No comments:
Post a Comment