Radio LIVE


Breaking News
Showing posts with label health. Show all posts
Showing posts with label health. Show all posts

Saturday, 30 May 2015

గోకడం వల్ల దురద నుండి ఎందుకు ఉపశమనం కలుగుతుంది


గోకడం ఉపశమనాన్ని ఇస్తుంది.దురద చోట గోకుతుంటే ఎందుకు పదే పదే గోకాలనిపిస్తుంది? పదే పదే గోకడం వల్ల శరీరానికి ఏమైనా హాని కలుగుతుందా మొదలగు అంశాల గురించి తెలుసుకుందాం.
నిజానికి దురద కలిగినప్పుడు గోకడం కంటే అతిపెద్ద ఉపశమనం లేదు అని చెప్పడంలో ఏలాంటి సందేహం అవసరం లేదు.కొంతమంది దురదను తట్టుకోలేక రక్తం వచ్చేలా గోక్కుంటారు.
ఇక్కడ ఆశ్చర్య పోవాల్సిన విషయం ఏమిటంటే దురద పెట్టడానికి మన చర్మం ఏ విధంగాను కారణం కాదంట,అలాగే గోకడం వల్ల చర్మానికి ఏలాంటి ఉపశమనం ఉండదట.వెన్నుపూసలో ఉండే ప్రత్యేక నాడీ కణాల వ్యవస్థ దురద,గోకడం వంటి వాటిని పూర్తిగా నియత్రిస్తుంది.శరీరం మీద దురద కలిగినప్పుడు ఈ ప్రదేశంలో ఉండే నాడీ కణాలు చాలా చురుకుగా ఉంటాయి. కోతులమీద ప్రయోగం చేసి మరీ ఈ విషయాన్ని తెలుసుకున్నారు.వెన్నుముక లో ఉండే STT(spinothalamic tract ) నాడీ కణాలు నొప్పిని,శరీరానికి తాకే వేడిని ఇవి మెదడుకు చేరవేస్తాయి.

మెదడులోని ఏ భాగం అయితే బాధ కలిగినప్పటి సంకేతాలను గ్రహిస్తుందో అదే భాగం దురద సంకేతాలను స్వీకరిస్తుంది.
నిజానికి సాధారణంగా వచ్చే దురదకు-గోకడానికి మధ్య శారీరక పరమైన నిర్మాణ సంబంధం ఏంటో డాక్టర్లు కూడా తెలుసుకోలేకపోయారట.
దురదకు కారణం మెదడులో సెరొటోనిన్ విడుదల అవుతుంది.ఇదే దురద తీవ్రతను పెంచుతుంది.గోకినప్పుడు కలిగే నొప్పి కూడా ఎక్కువగానే ఉంటుంది.ఈ నొప్పికి సంబంధించిన సంకేతాలు మెదడుకు అందినప్పుడు న్యూరో ట్రాన్స్ మిట్టర్ సెరొటోనిన్ నొప్పి అనే బాధను నియంత్రిస్తుంది.ముఖ్యంగా దీర్గకాళిక దురదతో బాధ పడే వాళ్ళలో దురద నొప్పికి కారణం అవుతుంది.శరీరం నొప్పి సంకేతాలకు ప్రభావితం అయినప్పుడు మాత్రం దురద అనేది మరింత బాధను కలిగిస్తుంది.
మరి సెరొటోనిన్ ను నియంత్రిస్తే పూర్తిగా దురద తగ్గుతుందా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే సెరొటోనిన్ ఎముకల జీవక్రియకు,ఎదుగుటకు,వృద్దాప్యం వంటి వాటిలో కీలక పాత్ర పోషిస్తుంది ఈ సెరొటోనిన్.
Read more ...

మ్యాగీ నూడుల్స్ వివాదం : విచారణను ఎదుర్కోనున్న నెస్ట్లే ఇండియా


రెండు నిమిషాల మ్యాగీ నూడుల్స్ కు మరిన్ని కష్టాలు ఎదురుకానున్నాయి.మ్యాగీ నూడుల్స్ తయారి సంస్థ అయిన నెస్ట్లే ఇండియాను త్వరలో ప్రాసిక్యూట్ చేయనున్నారు.ఉత్తరప్రదేశ్ కు చెందిన ఆహార భద్రత మరియుఔషధ నిర్వహణ(FDA) సంస్థ నెస్ట్లే ఇండియాను విచారించడానికి అనుమతినిచ్చింది.
మ్యాగీ నూడుల్స్ లో ఎక్కువ మోతాదులో సీసం ఉంది అనే ఫిర్యాదుతో అసలు కథ మొదలైంది.ఉత్తరప్రదేశ్ లోని బారాబంకి జిల్లా అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో నెస్ట్లే  కు వ్యతిరేకంగా ఫిర్యాదు నమోదు కానుంది.
ఉత్తరప్రదేశ్ ఆహార భద్రత మరియు ఔషధ నిర్వహణ(FDA) సంస్థ దాదాపు 12 డజన్లకు పైన్నే వివిధ దుకాణాల నుండి రాష్ట్ర వ్యాప్తంగా మ్యాగీ నూడుల్స్ ను సేకరించి పరీక్షంచగా మోతాదుకు మించి సీసం నూడుల్స్ లో వాడినట్టు తేలింది.మ్యాగీ నూడుల్స్ లో 17.2 ppm ల సీసం వాడినట్టు స్పష్టంగా తేలింది.ఇది మోతాదులో వాడాల్సిన దానికంటే చాలా ఎక్కువ.అలాగే ఎక్కువ మొత్తంలో సోడియం గ్లుటామేట్ ను అధిక మొత్తంలో వాడినట్టు పరీక్షలో తేలింది.
ఐతే కంపెనీ వాదన మాత్రం మరోల ఉంది.ఒక్క శాతం కంటే ఎక్కువ మొత్తంలో సీసం వాడలేదని స్పష్టం చేసింది.ఇది లెక్కలోనికి రాదనీ వారి వాదన.
Read more ...

Thursday, 28 May 2015

వెంట్రుకలు,గోళ్ళు కత్తిరించినప్పుడు నొప్పి కలగకపోవడానికి కారణం ఏమిటి ?


శరీరంలో ఏ భాగం కొంచం తెగినా భరించలేని నొప్పి కలుగుతుంది కాని,వెంట్రుకలు మరియు గోళ్ళు కత్తిరించినప్పుడు మాత్రం నొప్పి కలగదు.అందుకు కారణం.............!
గోళ్ళు మృత కణాలతో తయారౌతాయి.సాధారణంగా ఒక మనిషికి కాళ్ళకు,చేతులకు కలిపి 20 గోళ్ళు ఉంటాయి.వీటిని కత్తిరించినప్పుడు ఏలాంటి బాధ,నొప్పి కలగకపోవడానికి కారణం అవి మృత కణాలతో ఏర్పడడమే.శరీరానికి బయటకు వచ్చే ప్రత్యేక అమరిక ఉంటుంది గోళ్ళకు.గోళ్ళలో 'కెరాటిన్' అనే కఠినమైన పదార్థం ఉంటుంది.
గోళ్ళ మొదటి భాగం చర్మానికి అతుక్కొని అనువైన తంతువులుగా ఉంటాయి.ఈ తంతువుల వలన గోళ్ళు  స్థిరంగా వ్రేల్లకు చివర్లో ఉంటాయి.సాధారణంగా గోళ్ళు మందంగా ఉన్నప్పటికీ శరీరం లోపల ఉండే వీటి చిగుర్లు మాత్రం పలచగా ఉంటాయి.సంవత్సరానికి రెండు ఇంచుల వరకు గోళ్ళు పెరుగుతాయి.
అదే విధంగా వెంట్రుకలు కూడా కెరోటిన్ తో తయారు చేయబడిన సూక్ష్మతంతు నిర్మాణం.ప్రతీ నెల 13 మిల్లీమీటర్ల వరకు వెంట్రుకలు పెరుగుతాయి.సాదారణంగా మనిషికి ఒక లక్ష వరకు వెంట్రుకలు ఉంటాయి.
ఇవి మృత కణాలతో తయారు కావడం వల్ల,రక్తనాళాలతో సంబంధం ఉండకపోవడం వల్ల వీటికి రక్త ప్రసరణ వ్యవస్థ ఉండదు.అందువల్ల వీటిని కత్తిరించినప్పుడు నాడీ వ్యవస్థ ఏమాత్రం ప్రభావితం కాదు.కాబట్టి నొప్పి అనే బాధ మెదడుకు అస్సలు తెలియదు.
Read more ...

Wednesday, 27 May 2015

పండ్లు తినడం మంచిదా…? లేక పండ్ల రసాలు తాగటం మంచిదా …?

చాలా మంది పండ్లు తినడంకంటే పండ్ల రసాలు తాగడానికి ఎక్కువగా ఇష్టపడతారు.అయితే పండ్లు తినడం మంచిదా లేక వాటిని జ్యూస్ చేసుకొని తాగడం మంచిదా,పండ్లు తినడం వల్ల లాభమా,పండ్ల రసాలు తాగడం మంచిదా చూద్దాం …
పండును జ్యూస్ చేసినప్పుడు రెండు కోల్పోతాం.ఒకటి గుజ్జు అయితే రెండవది పండు మీది పై పొర.
ఏ పండు అయినా పండుగానే తినడం మంచిది.ముఖ్యంగా పండ్లను జ్యూస్ చేసుకొని తాగడం వలన అందులో ఉండే పీచు పదార్థాన్ని పూర్తిగా కోల్పోతాము.పండు తొక్క ఆరోగ్యానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది.ముఖ్యంగా ద్రాక్ష పండ్ల వల్ల కాన్సర్ వ్యాధి నుండి కాపాడుకునే అవకాశం ఉంది.
పండ్ల రసాలు రుచికరంగా,తాజాగా ఉన్నప్పటికీ పండ్లు పండ్లుగానే తింటేనే ఆరోగ్యానికి మంచిది.
పండ్లను జ్యూస్ చేసే క్రమంలో పండ్లు తీవ్ర ఒత్తిడికి గురౌతాయి.ఇలా గురైనప్పుడు కొన్ని పోషకాలు,ముఖ్యంగా పీచు పదార్థాలు,నీటిలో కరిగే విటమిన్లు కోల్పోతాం.అంటే పండ్ల రసాలలో మొత్తం పోషకాలు కోల్పోనప్పటికీ పండులో ఉండే పోషకాలు పండ్ల రసాలలో ఉండే పోషకాలకంటే ఎక్కువే.
ఉదాహరణకు 500 మి.లీటర్ల నారింజ రసంలో 250 మి.గ్రా ల విటమిన్ ‘సి’ ఉంటుంది,అదే క్యాలరీల విషయానికి వస్తే  300 క్యాలరీలు ఉంటాయి,పీచు పదార్ధం ఏమాత్రం ఉండదు.ఒక నారింజ పండులో 150 మి.గ్రా ల విటమిన్ ‘సి’ ఉంటుంది.
ముఖ్యమైన విషయానికి వస్తే ఇంట్లో కంటే బయట తాగే పండ్ల రసాల వల్ల ఆరోగ్యానికి హాని జరిగే అవకాశం ఎక్కువ.బయట తాగే పండ్ల రసాలలో పండ్ల రసం శాతం తక్కువగా ఉంటుంది.వారు తయారు చేసే పండ్ల రసాలకు ఎక్కువ పంచదారతో పాటు ఎక్కువ ఐస్ ను కలుపుతారు.దీనివల్ల కావలసిన పండ్లలోని నిజమైన పోషకాల కంటే ఎక్కువ కెలోరీలు శరీరంలో చేరి ఊబకాయానికి తోడ్పడతాయి.
కాబట్టి పండ్లను ఎక్కువగా తీసుకుంటూ పండ్ల రసాలను అప్పుడప్పుడూ తీసుకోవడం మంచిది.పీచు పదార్ధం పరంగా పండ్లను,క్యాలరీల పరంగా పండ్ల రసాలు తీసుకోవచ్చు.
Read more ...
Designed By Published.. Blogger Templates