రెండు నిమిషాల మ్యాగీ నూడుల్స్ కు మరిన్ని కష్టాలు ఎదురుకానున్నాయి.మ్యాగీ నూడుల్స్ తయారి సంస్థ అయిన నెస్ట్లే ఇండియాను త్వరలో ప్రాసిక్యూట్ చేయనున్నారు.ఉత్తరప్రదేశ్ కు చెందిన ఆహార భద్రత మరియుఔషధ నిర్వహణ(FDA) సంస్థ నెస్ట్లే ఇండియాను విచారించడానికి అనుమతినిచ్చింది.
మ్యాగీ నూడుల్స్ లో ఎక్కువ మోతాదులో సీసం ఉంది అనే ఫిర్యాదుతో అసలు కథ మొదలైంది.ఉత్తరప్రదేశ్ లోని బారాబంకి జిల్లా అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో నెస్ట్లే కు వ్యతిరేకంగా ఫిర్యాదు నమోదు కానుంది.
ఉత్తరప్రదేశ్ ఆహార భద్రత మరియు ఔషధ నిర్వహణ(FDA) సంస్థ దాదాపు 12 డజన్లకు పైన్నే వివిధ దుకాణాల నుండి రాష్ట్ర వ్యాప్తంగా మ్యాగీ నూడుల్స్ ను సేకరించి పరీక్షంచగా మోతాదుకు మించి సీసం నూడుల్స్ లో వాడినట్టు తేలింది.మ్యాగీ నూడుల్స్ లో 17.2 ppm ల సీసం వాడినట్టు స్పష్టంగా తేలింది.ఇది మోతాదులో వాడాల్సిన దానికంటే చాలా ఎక్కువ.అలాగే ఎక్కువ మొత్తంలో సోడియం గ్లుటామేట్ ను అధిక మొత్తంలో వాడినట్టు పరీక్షలో తేలింది.
ఐతే కంపెనీ వాదన మాత్రం మరోల ఉంది.ఒక్క శాతం కంటే ఎక్కువ మొత్తంలో సీసం వాడలేదని స్పష్టం చేసింది.ఇది లెక్కలోనికి రాదనీ వారి వాదన.
No comments:
Post a Comment