42 సంవత్సరాలుగా కోమాలో ఉన్న అరుణ షాన్ బాగ్ సోమవారం ఉదయం ముంబై లోని KEM ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచింది.నవంబర్ 27,1973 నుండి కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్(KEM) ఆసుపత్రే అరుణ కు ఇల్లైంది.వార్డు నెంబర్ 4 కు అనుబంధంగా ఉన్న గది లోనే అరుణకు ఇన్ని సంవత్సరాలుగా ఆసుపత్రి సేవ చేస్తూ వస్తుంది.ప్రస్తుతానికి అరుణ వయసు 68 సంవత్సరాలు.
అసలు అరుణ షాన్ బాగ్ ఎవరు? ఎందుకు ఆ ఆసుపత్రి 42 సంవత్సరాలుగా ఉచితంగా సేవ చేస్తుంది? అరుణకు ఏమైంది,1973 నుండి కోమాలో ఎందుకుంది ? వంటి వివరాల్లోకి వెళ్తే ...........!
అరుణ షాన్ బాగ్ KEM ఆసుపత్రిలో జూనియర్ నర్సు గా పనిచేసేది.ఆసుపత్రి దత్తత తీసుకున్న జంతువుల కోసం ఉంచిన ఆహారాన్ని ఆసుపత్రిలో వార్డు బాయ్ గా పనిచేసే సోహన్ లాల్ అనే వ్యక్తి దొంగిలించాడు అని తెలిసి అతన్ని మందలించింది అరుణ.అది మనసులో పెట్టుకున్న ఆ వ్యక్తి,అరుణ తన విధులు ముగించుకొని ఇంటికి వెళ్ళే సమయంలో ఒక్కసారిగా ఆమే మీద దాడి చేసి పైశాచికంగా అత్యాచారం చేసి,ఇనుప గొలుసుతో దాడి చేశాడు.ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అరుణను దాదాపు 11 గంటల వరకు ఎవరూ చూడలేదు.
ఈ దాడిలో మెదడుకు బలమైన గాయాలు కాగా చూపు కోల్పోయింది,పక్షవాతానికి గురైంది.ఇక ఆరోజు నుండి ఆసుపత్రి లోనే చికిత్స చేస్తున్నారు.అందులో పని చేసే సిబ్బంది ఆమెను కంటికి రెప్పలా చూసుకున్నారు.నిత్యకృత్యాలు కూడా తీర్చుకోలేని స్థితిలో గత 42 సంవత్సరాలుగా బెడ్ మీదే ఉంది అరుణ.అయినా అందులో పనిచేసే నర్సులు,ఆమెకు సేవా చేసేవారు ఆమెను భారం అనుకోలేదు.అరుణకు ఉన్న ఏకైక బంధువు సోదరి శాంతా నాయక్ కూడా రెండు సంవత్సరాల క్రితమే చనిపోయింది.
1982 నుండి అరుణ గురించి తెలిసిన పింకీ విరాణి అనే రచయిత్రి 'అరుణాస్ స్టొరీ' అనే పుస్తకాన్ని రచించింది.ఆమే దయానీయ పరిస్థితికి చలించిన పింకీ,అరుణ కారుణ్య మరణానికి అనుమతించాలని సుప్రీంకోర్టుకు వెళ్ళింది.2011 లో పింకీ వేసిన పిటీషన్ ను కొట్టిపారేసింది కోర్టు.అరుణను మేము చంపుకోము,తనకి వైద్యం మేమే చేసుకుంటాం అని KEM ఆసుపత్రి కోర్టుకు తెలిపింది.కోర్టు తీర్పుకు సంతోషించిన ఆసుపత్రి నర్సులు అందరికీ స్వీట్లు కూడా పంచారు.
No comments:
Post a Comment