గోకడం ఉపశమనాన్ని ఇస్తుంది.దురద చోట గోకుతుంటే ఎందుకు పదే పదే గోకాలనిపిస్తుంది? పదే పదే గోకడం వల్ల శరీరానికి ఏమైనా హాని కలుగుతుందా మొదలగు అంశాల గురించి తెలుసుకుందాం.
నిజానికి దురద కలిగినప్పుడు గోకడం కంటే అతిపెద్ద ఉపశమనం లేదు అని చెప్పడంలో ఏలాంటి సందేహం అవసరం లేదు.కొంతమంది దురదను తట్టుకోలేక రక్తం వచ్చేలా గోక్కుంటారు.
ఇక్కడ ఆశ్చర్య పోవాల్సిన విషయం ఏమిటంటే దురద పెట్టడానికి మన చర్మం ఏ విధంగాను కారణం కాదంట,అలాగే గోకడం వల్ల చర్మానికి ఏలాంటి ఉపశమనం ఉండదట.వెన్నుపూసలో ఉండే ప్రత్యేక నాడీ కణాల వ్యవస్థ దురద,గోకడం వంటి వాటిని పూర్తిగా నియత్రిస్తుంది.శరీరం మీద దురద కలిగినప్పుడు ఈ ప్రదేశంలో ఉండే నాడీ కణాలు చాలా చురుకుగా ఉంటాయి. కోతులమీద ప్రయోగం చేసి మరీ ఈ విషయాన్ని తెలుసుకున్నారు.వెన్నుముక లో ఉండే STT(spinothalamic tract ) నాడీ కణాలు నొప్పిని,శరీరానికి తాకే వేడిని ఇవి మెదడుకు చేరవేస్తాయి.
మెదడులోని ఏ భాగం అయితే బాధ కలిగినప్పటి సంకేతాలను గ్రహిస్తుందో అదే భాగం దురద సంకేతాలను స్వీకరిస్తుంది.
మెదడులోని ఏ భాగం అయితే బాధ కలిగినప్పటి సంకేతాలను గ్రహిస్తుందో అదే భాగం దురద సంకేతాలను స్వీకరిస్తుంది.
నిజానికి సాధారణంగా వచ్చే దురదకు-గోకడానికి మధ్య శారీరక పరమైన నిర్మాణ సంబంధం ఏంటో డాక్టర్లు కూడా తెలుసుకోలేకపోయారట.
దురదకు కారణం మెదడులో సెరొటోనిన్ విడుదల అవుతుంది.ఇదే దురద తీవ్రతను పెంచుతుంది.గోకినప్పుడు కలిగే నొప్పి కూడా ఎక్కువగానే ఉంటుంది.ఈ నొప్పికి సంబంధించిన సంకేతాలు మెదడుకు అందినప్పుడు న్యూరో ట్రాన్స్ మిట్టర్ సెరొటోనిన్ నొప్పి అనే బాధను నియంత్రిస్తుంది.ముఖ్యంగా దీర్గకాళిక దురదతో బాధ పడే వాళ్ళలో దురద నొప్పికి కారణం అవుతుంది.శరీరం నొప్పి సంకేతాలకు ప్రభావితం అయినప్పుడు మాత్రం దురద అనేది మరింత బాధను కలిగిస్తుంది.
మరి సెరొటోనిన్ ను నియంత్రిస్తే పూర్తిగా దురద తగ్గుతుందా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే సెరొటోనిన్ ఎముకల జీవక్రియకు,ఎదుగుటకు,వృద్దాప్యం వంటి వాటిలో కీలక పాత్ర పోషిస్తుంది ఈ సెరొటోనిన్.
No comments:
Post a Comment