శరీరంలో ఏ భాగం కొంచం తెగినా భరించలేని నొప్పి కలుగుతుంది కాని,వెంట్రుకలు మరియు గోళ్ళు కత్తిరించినప్పుడు మాత్రం నొప్పి కలగదు.అందుకు కారణం.............!
గోళ్ళు మృత కణాలతో తయారౌతాయి.సాధారణంగా ఒక మనిషికి కాళ్ళకు,చేతులకు కలిపి 20 గోళ్ళు ఉంటాయి.వీటిని కత్తిరించినప్పుడు ఏలాంటి బాధ,నొప్పి కలగకపోవడానికి కారణం అవి మృత కణాలతో ఏర్పడడమే.శరీరానికి బయటకు వచ్చే ప్రత్యేక అమరిక ఉంటుంది గోళ్ళకు.గోళ్ళలో 'కెరాటిన్' అనే కఠినమైన పదార్థం ఉంటుంది.
గోళ్ళ మొదటి భాగం చర్మానికి అతుక్కొని అనువైన తంతువులుగా ఉంటాయి.ఈ తంతువుల వలన గోళ్ళు స్థిరంగా వ్రేల్లకు చివర్లో ఉంటాయి.సాధారణంగా గోళ్ళు మందంగా ఉన్నప్పటికీ శరీరం లోపల ఉండే వీటి చిగుర్లు మాత్రం పలచగా ఉంటాయి.సంవత్సరానికి రెండు ఇంచుల వరకు గోళ్ళు పెరుగుతాయి.
అదే విధంగా వెంట్రుకలు కూడా కెరోటిన్ తో తయారు చేయబడిన సూక్ష్మతంతు నిర్మాణం.ప్రతీ నెల 13 మిల్లీమీటర్ల వరకు వెంట్రుకలు పెరుగుతాయి.సాదారణంగా మనిషికి ఒక లక్ష వరకు వెంట్రుకలు ఉంటాయి.
ఇవి మృత కణాలతో తయారు కావడం వల్ల,రక్తనాళాలతో సంబంధం ఉండకపోవడం వల్ల వీటికి రక్త ప్రసరణ వ్యవస్థ ఉండదు.అందువల్ల వీటిని కత్తిరించినప్పుడు నాడీ వ్యవస్థ ఏమాత్రం ప్రభావితం కాదు.కాబట్టి నొప్పి అనే బాధ మెదడుకు అస్సలు తెలియదు.
No comments:
Post a Comment