Radio LIVE


Breaking News

Tuesday 26 August 2014

36 సంవత్సరాల పాటు తల్లి కడుపులోనే అస్థిపంజరం

1978వ సంవత్సరంలో కంటాభాయ్ థాక్రే అనే భారతీయ మహిళ వయస్సు 24 సంవత్సరాలు అప్పుడు తను గర్భవతి.పరీక్షల నిమిత్తం డాక్టర్ దగ్గరకు వెళ్ళగా ఆమెను పరీక్షించిన డాక్టర్ పిండం గర్భసంచికి బయట ఉండడం గమనించి బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని ఆమెకు వివరించారు.డాక్టర్లు అలా చెప్పడంతో ఆపరేషన్ చేస్తారేమో అని బయపడిన తను అక్కడినుండి పారిపోయింది.తరువాత నొప్పి వస్తుంటే చిన్నపాటి క్లినిక్ లో చికిత్స చేయించుకుంది.
కొన్ని రోజుల తరువాత నొప్పి తగ్గడంతో సమస్య పూర్తిగా తగ్గిపోయింది అని థాక్రే భావించింది.తరువాత కూడా తనకు ఎలాంటి నొప్పికూడా అనిపించలేదు.
కాని 36 సంవత్సరాల తరువాత అంటే ప్రస్తుతం తనకు కడుపులో తీవ్రమైన నొప్పి రావడం అది తగ్గకపోవడంతో ఆసుపత్రికి వెళ్ళాల్సివచ్చింది.ప్రస్తుతం తన వయస్సు 60 సంవత్సరాలు,అయితే నొప్పితో నాగపూర్ లోని ఎన్కేపీ సాల్వే ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లోని డాక్టర్ల వద్దకు వెళ్ళింది.
అక్కడ డాక్టర్ ముర్తజా అక్తర్ చెప్పినదాని ప్రకారం తను ఆసుపత్రిలో చేరే సమయానికి తనకు తగ్గకుండా కడుపులో నొప్పి రావడం మరియు తీవ్రమైన జ్వరంతో పాటు మూత్ర సంభంద సమస్యతో బాధపడుతుంది.కడుపులో కుడిచేతి వైపు ఒక ముద్దలాంటి పదార్ధం గమనిచాం,అది కాన్సర్ గడ్డ అని అనుకున్నామని డాక్టర్ ముర్తజా తెలిపారు.తరువాత సోనోగ్రఫి,సీటీ స్కాన్ చేసిన డాక్టర్లు అది కాన్సర్ గడ్డ కాదని పరిపక్వ దశలోని అస్థిపంజరం అని గుర్తించారు.
షాక్ కు గురైన డాక్టర్లు అసలేం జరిగిందో అని పేషెంట్ ను వివరాలు అడగ్గా 1978లో జరిగిన సంఘటన డాక్టర్లకు వివరించింది.అప్పుడు ఆపరేషన్ చేస్తారు అని బయపడి ఆసుపత్రి నుండి తన ఊరికి పారిపోయాను అని చెప్పింది.ఇలాంటి ఘటనలు ఏమైనా ఇది వరకు జరిగాయ అని డాక్టర్లు ఆరాతీయగా అచ్చు ఇలానే బెల్జియంలో కూడా ఈ ఘటన జరిగింది అని తెలుసుకున్నారు.
బెల్జియం యువతికి 18సంవత్సరాల తరువాత ఆపరేషన్ చేసి అస్థిపంజరాన్ని తొలిగించారు.దీనిని ఎక్టోపిక్ ప్రీగ్నేన్సీ అంటారు,అంటే గర్భసంచికి బయట పిండం ఏర్పడడం.
థాక్రే ప్రస్తుతానికి ఆరోగ్యంగా ఉందని కోలుకుంటుంది అని డాక్టర్లు తెలిపారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates