Radio LIVE


Breaking News

Friday 29 August 2014

జపాన్ పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోడీ

ప్రధానిగా మోడీ మొదటిసారి జపాన్ పర్యటనకు బయలుదేరాడు.నేటి నుండి ఐదు రోజులపాటు ప్రధాని మోడీ జపాన్ లో పర్యటించనున్నారు.రిలయన్స్ అధినేత ముకేష్ అంబాని,విప్రో అధినేత అజీం ప్రేమ్ జీ లు కూడా ప్రధాని వెంట జపాన్ పర్యటనకు వెళ్ళారు.
ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే ముఖ్య ఉద్దేశ్యంగా ప్రధాని పర్యటన కొనసాగనుంది.జపాన్ స్మార్ట్ సిటీ అయిన క్యోటో నగరానికి ముందుగా మోడీ చేరుకుంటారు.మోడీకి స్వాగతం పలికేందుకు జపాన్ ప్రధాని ప్రత్యేకంగా క్యోటోకు
చేరుకోనున్నారు.అక్కడ ఇద్దరు ప్రధానులు వ్యక్తిగతంగా కలుసుకొని విందులో పాల్గొన్న తరువాత మాత్రమే అధికార చర్చల్లో పాల్గొననున్నారు.
భారత్ లో 100 స్మార్ట్ సిటీలను నిర్మించే ఉద్దేశ్యంలో ఉన్న మోడీ ముందుగా జపాన్ రాజధాని టోక్యో కాకుండా క్యోటో నగరానికి వెళ్లి పరిశీలించనున్నారు.
రెండు దేశాల మధ్యరక్షణ,అణుశక్తి,మౌలికసదుపాయాల అభివృద్ధి మొదలగు పలు అంశాల మీద ప్రత్యేకంగా చర్చలు జరిగే అవకాశం ఉంది.
నాకు సన్నిహితుడైన జపాన్ ప్రధాని షింజో అబే ఆహ్వానం మేరకు జపాన్ వెళ్తున్నందుకు ఆసక్తిగా ఉంది అని మోడీ అన్నారు.ఈ మధ్యే మోడీ కూడా జపాన్ బాషలో ట్వీట్ కూడా చేశారు.నా పర్యటన ఫలితాన్ని ఇస్తుంది అని నాకు నమ్మకం ఉంది అని మోడీ ఈ సందర్భంగా తెలిపారు.
జపాన్ ప్రధాని షింజో ట్విట్టర్ లో కేవలం ముగ్గురినే ఫాలో అవుతారు.వారిలో ఒకరు తన భార్య కాగా,ఇంకొకరు ఆ దేశ రాజకీయ నాయకుడు,మూడో వ్యక్తి భారత ప్రధాని మోడీ కావడం విశేషం.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates