Radio LIVE


Breaking News

Wednesday 3 September 2014

ప్ర్రాణం కోసం పరుగులు తీసిన గుండె-చెన్నై డాక్టర్ల అరుదైన శస్త్రచికిత్స


భారతీయ వైద్యరంగ చరిత్రలో నేడు మరవలేని రోజు.చెన్నై డాక్టర్లు గుండె మార్పిడి శస్త్రచికిత్స చేసి విజయం సాధించారు.బెంగుళూరు లో బ్రెయిన్ డెడ్ అయిన ఒక యువతి గుండెను చెన్నై ఫోర్టీస్ ఆసుపత్రిలోని ఒక రోగికి అమర్చి అధ్బుతాన్ని సృష్టించారు.గుండె మార్పిడి చేయాలంటే గుండెలో జీవం 6 గంటలకు మించి ఉండదు.అంత తక్కువ వ్యవదిలో గుండెను బెంగుళూరు నుండి చెన్నై కి తరలించి రోగికి అమర్చాలి అంటే ఆరుగంటలకు మించే సమయం పడుతుంది.కాని బెంగుళూరు,చెన్నై పోలీసులు చూపిన చొరవ అంతా ఇంతా కాదు.వారి సహకారంతో అనుకున్న సమయం కంటే ముందుగానే గుండెను బెంగుళూరు నుండి చెన్నైకి తరలించగాలిగారు.
వారం రోజులుగా దాతలకోసం చెన్నై ఫోర్టీస్ ఆసుపత్రి ఎదురుచూస్తున్నారు.బుధవారం ఉదయం బెంగళూరు బీజీఎస్ ఆసుపత్రికి ఫోన్ చేసి విషయం చెప్పారు చెన్నై డాక్టర్లు.ఆక్సిడెంట్ లో బ్రెయిన్ డెడ్ అయిన యువతి గుండె ఇచ్చేందుకు బంధువులు అంగీకరించడంతో యుద్దప్రాతిపదికన ఏర్పాట్లు చేశారు.వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో బెంగళూరు పోలీసులు ట్రాఫిక్ కట్టడి చేయగలిగారు.ప్రత్యేక ద్రావణంలో ఉంచిన గుండెతో అంబులన్స్ విమానాశ్రయానికి బయలుదేరింది.అంబులన్స్ ఆసుపత్రి నుండి కెంపే గౌడ విమానాశ్రయానికి చేరాలంటే కనీసం గంటన్నర పడుతుంది.మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాలకు అంబులన్స్ ఆసుపత్రి నుండి బయలుదేరింది.అంబులన్స్ వెళ్ళే దారిలో పక్కా ప్రణాళికతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిపివేశారు,కొన్ని దారిమళ్లించారు.సరిగ్గా అంబులన్స్ విమానాశ్రయానికి 2గంటల 57 నిమిషాలకు చేరుకుంది.
అప్పటికే సిద్దంగా ఉన్న ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం గుండెతో బయలుదేరి సరిగ్గా 4 గంటల 25 నిమిషాలకు చెన్నై విమానాశ్రయానికి చేరింది.విమానాశ్రయం నుండి ఆసుపత్రికి దూరం 12 కిలోమీటర్లు.అప్పటికే రెండు గంటల ముందు నుండే చెన్నై పోలీసులు కూడా ట్రాఫిక్ ను కట్టడి చేస్తూ వచ్చారు.అంబులన్స్ విమానాశ్రయం నుండి బయలుదేరి సరిగ్గా 10 నిమిషాల్లో ఆసుపత్రికి చేరింది.అక్కడ సిద్దంగా ఉన్న డాక్టర్ల బృందం గుండెను అమర్చడంలో విజయవంతమయ్యారు.
ఆద్యంతం సినీ ఫక్కీ లో జరిగిన ఈ ఘటనలో ప్రతీ ఒక్కరి సహకారం ఉంది,అందుకు ఫలితం కూడా దక్కింది.చికిత్స విజయవంతమైనట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.అయితే రోగిని 12 గంటలపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.ఆ తరువాతే వైద్యులు అధికారికంగా ప్రకటన చేయనున్నారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates