Radio LIVE


Breaking News

Thursday 4 September 2014

పాన్ కార్డు ఉంటే రేషన్ కార్డు లేనట్టే - సర్వే ఆధారంగా రేషన్ కార్డుల జారీ!

        
         కారు,బంగ్లా,సాగుభూమి ఎక్కువగా ఉండి మీకు రేషన్ కార్డు ఉందా?పాన్ కార్డు కూడా ఉందా? అయితే మీకు రేషన్ కార్డు ఇక లేనట్టే.సమగ్ర సర్వే వివరాల ఆధారంగా అర్హులైన వారికే రేషన్ కార్డు అందేలా తెలంగాణా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.అందుకుగాను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్‌పీటర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ రూపొందించిన విధివిధానాలను ప్రభుత్వానికి నివేదిక రూపంలో సమర్పించింది.


             ఈ నివేదిక ప్రకారం ఆదాయపన్ను చెల్లిస్తూ పాన్ కార్డు కలిగి ఉన్నవారికి,నాలుగు చక్రాల వాహనాలు(సొంత అవసరాల కొరకు కారు,జీపు)వినియోగించే కుటుంబాలకు,ప్రభుత్వ ఉద్యోగం ఉన్నవారికి రేషన్ కార్డు జారీ చేయదు ప్రభుత్వం.ఇంకా ఎక్కువ విస్తీర్ణంలో సాగుభూమి ఉన్నా కూడా,అధిక విస్తీర్ణంలో నిర్మించుకున్న పక్కా ఇండ్ల యజమానులకు సైతం రేషన్ కార్డు జారీ చేయరు.అయితే పక్కా ఇండ్ల వైశాల్యం ఆయ పరిసరాలను బట్టి నిర్ణయిస్తారు.అంటే గ్రామీణ ప్రాంతమా,మునిసిపాలిటి ప్రాంతమా,కార్పోరేషన్ ప్రాంతమా అని చూసి నిర్ణయిస్తారు.

             తెలంగాణా రాష్ట్రంలో దాదాపు 91 లక్షల రేషన్ కార్డులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు,రాష్ట్రంలో ఉన్న కుటుంబాలకంటే ఇవి చాలా ఎక్కువ.అసలైన లబ్దీదారులకు మాత్రమే రేషన్ కార్డులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.దీనికిగాను 3275 మీ సేవా కేంద్రాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం గుర్తించింది.కొత్త రేషన్ కార్డులను మీసేవా కేంద్రాల ద్వారా అందజేయనున్నారు.వీటిని ఆధార్ డేటాబేస్ ఆధారంగా అందజేస్తారు.మారుమూల ప్రాంతాలకు డేటాబేస్ తో అనుసంధానం చేసిన వాహనాలతో అధికారులు అక్కడికే వెళ్లి రేషన్ కార్డులు అందజేస్తారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates