
అక్టోబర్12,2012 వరకు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో తొలి ఎనిమిది స్థానాలు ఉన్న జట్లను నేరుగా సూపర్-10కు అర్హత సాధించాయి.అప్పుడు 9,10 స్థానాలు సాధించిన బంగ్లాదేశ్,జింబాబ్వే లు క్వాలిఫైయింగ్ మ్యాచ్ లు ఆడనుంది. గ్రూప్-ఎ లో బంగ్లాదేశ్,ఆఫ్గానిస్తాన్,హాంకాంగ్,నేపాల్ లు ఉండగా గ్రూప్-బి లో జింబాబ్వే,నెదర్లాండ్స్,ఐర్లాండ్,యూఎఈ లు పోటీ పడుతున్నాయి.<p>గ్రూప్-ఎ లో మొదటి స్థానం సాధించిన జట్టు గ్రూప్-2 లోని భారత్,పాకిస్తాన్,ఆస్ట్రేలియా, వెస్టిండీస్ లతో కలిసి, గ్రూప్-బి లో మొదటి స్థానం సాధించిన జట్టు గ్రూప్-1 లోని దక్షిణాఫ్రికా,న్యూజిలాండ్,శ్రీలంక,ఇంగ్లాండ్ లతో కలిసి సూపర్-10 లో పోటీ పడనున్నాయి.
No comments:
Post a Comment