
ఇప్పటి వరకు ప్రపంచకప్ లో భారత్ పై గెలవని పాకిస్తాన్ ఈసారైనా విజయం
సాధించాలనే కల కలగానే మిగిలిపోయింది. ప్రపంచకప్ లో పాకిస్తాన్ పై భారత్
విజయాల పరంపరను కొనసాగించింది. 131 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన
ధోని సేన మొదటి 3 ఓవర్లలో కేవలం 7 పరుగులు మాత్రమే చేయగలిగింది. రోహిత్
శర్మ, శిఖర్ ధావన్ మొదట తడబడినా 50 పరుగుల మొదటి వికెట్ భాగస్వామ్యాన్ని
నెలకొల్పారు. తరువాత 11 పరుగుల వ్యవదిలో శిఖర్ 30(28),
రోహిత్24(21),యువరాజ్ సింగ్1(2) లు అవుట్ అవడంతో కష్టాల్లో పడ్డట్టు
కనిపించినా సూపర్ ఫామ్ లో ఉన్న కోహ్లి36(32),రైనా35(28) అద్భుతంగా
ఆడారు.ఇంకో వికెట్ పడకుండా మ్యాచ్ ముగించారు.
మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల
నష్టానికి 130 పరుగులు చేసింది. ఆది నుండి పాకిస్తాన్ బ్యాట్స్ మెన్
పరుగులు చేయకుండా భారత్ బౌలర్లు కట్టడి చేశారు. భారత్ బౌలర్లు ముఖ్యంగా
స్పిన్నర్లు మిశ్రా, జడేజా మరియు అశ్విన్ కట్టుదిట్టమైన బౌలింగ్ చేశారు.
మిశ్రా 22 పరుగులకు 2 వికెట్లు,జడేజా,షమీ, భువనేశ్వర్ కుమార్ తలా ఒక వికెట్
తీసుకున్నారు. ఉమర్ అక్మల్ 33 ,శెహజాద్ 22, మక్సూద్ 21 పరుగులతో
రాణించారు.
Man of the match : Amit Mishra
India Innings -131/3 (18.3 overs)
Pakistan Innings -130/7 (20 overs)
No comments:
Post a Comment