Radio LIVE


Breaking News

Friday 14 March 2014

పవన్ కళ్యాణ్ తన స్పీచ్ లో ఏం చెప్పారు

పవన్ కళ్యాణ్ పార్టీ పెడుతున్నట్టు .దాని పేరు జనసేన అని అది మీ సేన అని ప్రకటించారు.
నిజానికి సాయంత్రం 6:30కు ప్రారంభిస్తాడు అనుకున్నా 45 నిమిషాల
ఆలస్యంగా 07:16 గంటలకు స్టేజి మీదకు పవన్ కళ్యాణ్ వచ్చాడు.పవన్ కళ్యాణ్ స్టేజి మీదకు రాగానే అభిమానులు కోలాహలం
మధ్య చిరునవ్వుతో కొంచెం సేపు మౌనంగా ఉన్న తరువాత బాలగంగాధర్ తిలక్ కవిత "ఇల్లేమో దూరం,అసలే చీకటి గాఢాందకారం,దారంతా
గతుకులు చేతిలో దీపం లేదు కానీ గుండెల నిండా ధైర్యం ఉంది."తో తన ప్రసంగాన్ని కొనసాగించారు.బాంచన్ దొర కాల్మొక్త అనే మనస్తత్వం కాదు నాది అని అన్నారు.

అన్నయ్యకు ఎందుకు ఎదురోస్తాను

 అన్నయ్య మీద నాకు కోపం ఉండదు,అన్నయకు ఎందుకు ఎదురోస్తాను. ఎవరో ఢిల్లీ వాళ్ళు చేసిన పనికి అన్నయ్య మీద కోపం ఎందుకు.
అన్యాయాలకు,అక్రమాలకూ ఎదురెల్లే దారిలో అన్నయ్యకు ఎదురేల్లాల్సివచ్చింది తప్పా గుండెల్లో ఉన్న అన్నయ్యకు కాదు అని తండ్రి తరువాత
తండ్రి లాంటి అన్నయ్యకు నేను ఎదురెల్లను అని పవన్ అన్నారు.

నాకు పదవులు  తుచ్చమైనవి

 నేను సమాజం బాగుండాలని కోరుకునేవాడిని అంతే కాని మంత్రి కావాలని లేదు, ఢిల్లీ లో లాల్ బత్తి కారులో తిరగాలని లేదు
MP,MLA గా పోటి చేయాలని లేదు.ఇవన్నీ కావాలనుకుంటే ఒకప్పటి ప్రజా రాజ్యం లోనే వచ్చేవాడిని అని అన్నారు.

 విమర్శలు మొదలెట్టారు

 నేను పార్టీ పెడుతున్నాను అని వార్తలు రాగానే విమర్శలు చేయడం మొదలెట్టారు. కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ
కాంగ్రెస్ లో కలపాల్సిందే అన్నాడు, కాంగ్రెస్ లో కలపడానికి అదేమైన గంగా నదా అని అన్నారు. కెసిఆర్ పై పరోక్షంగా విమర్శలు చేశారు పవన్, తనకు
ఆయన అంటే అభిమానమని నేనేం చెప్పకుండానే తిడుతున్నారు అని అయినా పడతాను అని నేను ఎలా కనిపిస్తున్నాను ఏమైనా భయపడతానా
అని తెలంగాణా యాసలో అన్నారు. తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు నాకు చెల్లె లాంటిది అని నా తెలంగాణలో నా వారికి క్షమాపణ చెప్పేది
ఏంటి అని కవిత తన మీద చేసిన విమర్శలకు బదులిచ్చారు.
 ఇక కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ హనుమంత రావు పై తీవ్ర స్థాయిలో పవన్ విరుచుకుపడ్డారు.
ఆయన నన్ను మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అని విమర్శించాడు, మూడు పెళ్లిళ్లు చేసుకుంటే రాజకీయాలు రాకూడదా?ఒకర్ని పెళ్లి చేసుకుని
30 మందితో తిరిగితే తప్పు కాదా,రాహుల్ ఒక్క పెళ్లి కూడా చేసుకోలేదు కాని ఒక విషయం మెచ్చుకోవాలి, రాహుల్ పెళ్లి చేసుకోలేదు అన్నారు
కానీ, బ్రహ్మచారి అనలేదు.నా వ్యక్తిగత జీవితాన్ని ఎవరు విమర్శించినా నేను ఊరుకోను అని వారి వ్యక్తిగత జీవితాన్ని బయట పెట్టాల్సి వస్తుంది అని దానికి నాకు టీవీలు,మీడియా లాంటి నెట్ వర్క్  లేదని నా అభిమానులే పెద్ద నెట్ వర్క్ అని పవన్ కళ్యాణ్ అన్నారు.

గోటితో పోయేది గొడ్డలి దాకా తెచ్చారు

తెలంగాణ విభజన గోటితో పోయే సమస్య అని దానిని గోద్దలిదాకా తెచ్చారు. కోట్ల మంది ఇరువైపులా లో లోపల బాధ పడుతున్నారు
కుటుంబం లాంటి సమస్య అని నాలాంటి వారికే అర్థం అయినప్పుడు దశాబ్ధాల కాలంగా రాజకీయాల్లో వున్న మీకు అర్థం కాలేదా?
మొదటి నుండి తెలంగాణా సమస్యలను పట్టించుకోని ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు.టీఆర్ఎస్ నాయకులను, కాని ఉద్యమకారులను
కాని తప్పు పట్టడానికి లేదు. కెసిఆర్ ను తప్పు పడితే అది తప్పు ఇది ప్రతి ఒక్కరి తప్పు  అని అన్నారు.

భగత్ సింగ్ ను తలచుకుంటే బాధేస్తుంది

భగత్ సింగ్ బలిదానం తలుచుకుంటే నాకు బాధ కలుగుతుంది. భగత్ సింగ్ డైరీలు చదివాను. ఆయన 20సంవత్సరాల
వయసులోనే చనిపోయారు,ఆ వయసులో నాలాంటి వారు బలాదూర్ తిరుగుతుంటారు. భగత్ సింగ్... నీ స్పూర్తి చనిపోలేదు,నాలాంటి వారు ఉన్నారు.

నేను భారతీయుడిని

 ఈరోజు ఉదయం పేపర్లో చూశాను కాపు నాయకులు  పవన్ ని అంగీకరించమని అని. నాకు కులం అక్కర్లేదు,నేనేమైన వారిని అడిగానా.
నాకు కులం లేదు మతం లేదు అన్నిటికంటే ముందు నేను భారతీయున్ని.

వచ్చే రెండేళ్లలో పార్టీ నిర్మాణం

పార్టీ నిర్మాణానికి రెండేళ్ళ సమయం పడుతుంది,పార్టీకి జంప్ జిలానీలు అవసరం లేదు.
యువకుల కోసం వెదుకుతున్నాను,మన సిద్దాంతాలను మోయగలవారు మనకు అవసరం.
నాకు ఎవరితో శతృత్వం లేదు,అలా అని ప్రజా ధనం దోసుకున్తూనే చూస్తూ ఊరుకోను అని అలాంటి వారి తాట తీస్తాను.
నా దగ్గర గూండాలు లేరు అభిమానులు మాత్రమే ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీలాగా రావడం లేదు, సామాజిక భాధ్యతతో వస్తున్నాను.
ఎన్నికలలో పోటి అయిదు సంవత్సరాల తరువాతా,ఇంకో రెండు నెలల తరువాతా అనేది ఇంకా తెలియదు.
త్వరలో అందరిని కలుస్తాను, కాంగ్రెస్ వాళ్ళు అంటే చిరాకు.కాంగ్రెస్ తప్ప మరే పార్టీతోనైనా చేతులు కలపడానికి సిద్ధంగా వున్నా.
కాంగ్రెస్ హై కమాండ్, షిండే, చిదంబరం, జైరామ్ రమేష్, వీరప్పమొయిలీ..మీ అందరికీ చెబుతున్నా, మీరు చేసిన విభజన అస్సలు బాగాలేదు.
అందుకే పిలుపునిస్తున్నా----- కాంగ్రెస్ హటావో..దేశ్ బచావ్.
భగత్ సింగ్ బలిదానం తలుచుకుంటే బాధ కలుగుతుంది.

 

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates