
చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు IPL-7 లో ఆడడానికి ఎలాంటి అభ్యంతరం లేదు అని సుప్రీం కోర్టు పేర్కొంది.బీసీసీఐ ఉపాధ్యక్షుడే అధ్యక్షుడిగా వ్యవహరించాలని కూడా సూచించింది.దీంతో ఉపాద్యక్షుల్లో ఒకరైన శివలాల్ యాదవ్ బీసీసీఐ అధ్యక్షుడిగా పూర్తిస్థాయి భాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి.ఐపీఎల్-7 సీజన్ వరకు మాత్రం సునీల్ గవాస్కర్ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉండాలని సుప్రీం సూచించింది. బీసీసీఐ ఇతర వ్యవహారాలతో గవాస్కర్ కు సంబంధం ఉండదు. వ్యాక్యాతగా ఇప్పటికే చేసుకున్న కాంట్రాక్టులు గవాస్కర్ రద్దు చేసుకోవాలని, అందుకుగాను గవాస్కర్ కు పరిహారం చెల్లించాలని సుప్రీం కోర్టు తెలిపింది. ఐసీసీ సంబంధిత వ్యవహారాల్లో శ్రీనివాసన్ పాల్గొనేలా ఉత్తర్వులు ఇవ్వాలన్న పిటీషన్ ను కొట్టివేసింది కోర్టు.
No comments:
Post a Comment