
ప్రశ్నించే నాయకుడు ఇన్నాళ్లు లేకపోవడం మన దౌర్భాగ్యం,ఇదే నినాదంతో వవన్ వస్తే ప్రజలు ఆదరించి,గెలిపిస్తారని అభిప్రాయపడ్డారు.నేటి రాజకీయ పార్టీలు భ్రష్టు పట్టిపోయాయని శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు.నిన్నటి వరకు తిట్టిన వారిని ఈ రోజు పార్టీల్లో చేర్చుకుంటున్నారని, ఒక రోజులోనే ఆ నాయకుడు మంచివాడై పోతాడా అని శివాజీ ప్రశ్నించారు. ఇది అన్ని పార్టీలకూ వర్తిస్తుందని చెప్పారు.పార్టీలు కుల పార్టీలైపోతున్నాయని శివాజీ వాపోయారు. ఈలాంటి సమయంలో పవన్ లాంటి మంచి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు మేలు జరుగుతుంది అని శివాజీ చెప్పారు.
No comments:
Post a Comment