బాహుబలి కొత్త పోస్టర్ : బార్బేరియన్ సైనికుడిగా భయంకర 'కాళకేయ'
బాహుబలి సినిమా విడుదలకు రెండు నెలల ముందు నుండే దర్శకుడు రాజమౌళి సినిమా మీద మరింత అంచనాలను పెంచే పనిలో పడ్డాడు.అందులో భాగంగానే బాహుబలి చిత్ర పోస్టర్లను ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు.తాజాగా సోమవారం సాయంత్రం భయంకర 'కాళకేయ' పోస్టర్ ను విడుదల చేశారు.మర్యాద రామన్న చిత్రంలో బైరెడ్డిగా నటించిన ప్రభాకర్ 'కాళకేయ' పాత్రలో కనిపించే పోస్టర్ సినిమా మీద మరింత అంచనాలను పెంచేస్తున్నాయి.'రక్తం అతని దాహాన్ని తీర్చుతది,హింస అతనికి శాంతినిస్తుంది,లక్ష మంది బార్బెరియన్లకు అతను కమాండర్' అని రాజమౌళి ట్వీట్ చేస్తూ పోస్టర్ ను విడుదల చేశారు.ఇప్పటికే మే1 న బాహుబలి ఫస్ట్ లుక్ పోస్టర్ ను,మే 4న ప్రభాస్,మే 6న అనుష్క,మే 8న రమ్యకృష్ణ పోస్టర్లను విడుదల చేశారు రాజమౌళి.
No comments:
Post a Comment