బాహబలి చిత్రంలో మరో పోస్టర్ ను విడుదల చేశారు దర్శకుడు రాజమౌళి.ధీరత్వం ఉట్టిపడేలా యుద్దరంగంలో పోరాడుతున్న భల్లాలదేవ పాత్రను పోషించిన రాణా పోస్టర్ ను ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు మౌళి.భల్లాలదేవ ఒక నిరంకుశ రాజు అని తన ట్వీట్ లో తెలిపాడు దర్శకుడు రాజమౌళి.
ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్ లు చూస్తుంటే సినిమా మీద అంచనాలు ఎక్కువయ్యాయి.మే 22న చివరి పోస్టర్ ను విడుదల చేశాక మే 31న ఆడియో విడుదల చేస్తున్నారు.ఆడియోను లహరి మ్యూజిక్ ద్వారా విడుదల చేస్తున్నట్టు లహరి మ్యూజిక్ అధినేత జి.మనోహర్ నాయుడు తెలిపారు.ఇప్పటి వరకు ఏ సినిమాకు లేని విధంగా బాహుబలి సినిమా ఆడియో తెలుగు,తమిళ హక్కులను దక్కించుకుంది లహరి మ్యూజిక్.
No comments:
Post a Comment