మహేష్ బాబుతో మూడో సినిమా : స్క్రిప్ట్ ఫైనల్ చేసిన పూరీజగన్నాథ్
ప్రిన్స్ మహేష్ బాబుతో మూడో సినిమా తీయడానికి పూరీజగన్నాథ్ స్క్రిప్ట్ తయారు చేసుకున్నాడు.ఈ విషయాన్ని స్వయంగా పూరీజగన్నాథ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు."ఇప్పుడే స్క్రిప్ట్ మొత్తం ఫైనల్ అయింది మహేష్ బాబుతో మూడో సినిమా కోసం,హ్యాట్రిక్ కోసం రెడీ గా ఉన్నాం,మహేష్ బాబు అభిమానులతో పంచుకోవడానికి సంతోషంగా ఉంది..చీర్స్" అని పూరీ తన ట్వీట్ లో తెలిపారు.ఐతే మహేష్-పూరీ కాంబినేషన్ లో వచ్చే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో ఇంకా స్పష్టత రాలేదు.'ధమ్కీ' అనే పేరు దాదాపుగా ఖరారు అయినట్టు తెలుస్తుంది.ప్రస్తుతానికి మహేష్ బాబు 'శ్రీమంతుడు' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది.జూన్ రెండో వారం కల్లా ఈ సినిమా పూర్తి అవుతుంది.ఆ వెంటనే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'బ్రహ్మోత్సవం' చిత్రంలో నటించనున్నారు మహేష్ బాబు.
Vry happy to share vit all Mahesh fans , just now finalised script for our 3rd film together .. Getting ready for hatrick 👍👍👍
Cheerrssss 👍
No comments:
Post a Comment