సాహస విక్రమ ధీశాలి ! రణతంత్ర కళా కుశలి !! అంటూ చివరి బాహుబలి పోస్టర్ ను ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు దర్శకుడు రాజమౌళి.భారీ శివలింగం మోస్తున్న ప్రభాస్ మొదటి పోస్టర్ ను విడుదల చేసిన రాజమౌళి,శుక్రవారం బాహుబలి చివరి పోస్టర్ లో ప్రభాస్ రణరంగంలో శతృవులను చీల్చి చెండాడుతున్న పోస్టర్ ను విడుదల చేశారు.
సామాజిక మాధ్యమాల ద్వారా బాహుబలి చిత్రానికి విపరీత ప్రచారం చేసిన రాజమౌళి చిత్ర ఆడియోను మే 31 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.
No comments:
Post a Comment