Radio LIVE


Breaking News

Saturday 1 November 2014

భారత్,శ్రీలంక మొదటి వన్డే నేడు


వెస్టిండీస్ పర్యటన అర్ధాంతరంగా ముగియడంతో ఆగమేఘాల మీద భారత్ తో సీరీస్ ఆడడానికి శ్రీలంక క్రికెట్ బోర్డును ఒప్పించింది బీసీసీఐ.అందులో భాగంగా జరుగనున్న 5 వన్డేల సీరీస్ లో మొదటి మ్యాచ్ ను ఆదివారం కటక్ లో నిర్వహిస్తున్నారు.
భారాబతి స్టేడియంలో జరిగే మొదటి మ్యాచ్ కు కోహ్లి కెప్టెన్ గా వ్యవహరిస్తాడు.శ్రీలంకతో జరిగే మొదటి మూడు మ్యాచ్ లకు ధోనికి సెలెక్టర్లు విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే.
ఇరు జట్ల బలాబలాలు చూస్తే భారత్ జట్టే పటిష్టంగా కనిపిస్తుంది.భువనేశ్వర్,షమీ లేకపోవడంతో భారమంతా ఇషాంత్ శర్మమీదనే పడనుంది.వరుణ్,ఉమేష్ లకు ప్రపంచ కప్ కు ముందు సత్తా చాటడానికి మంచి అవకాశమని చెప్పవచ్చు.బ్యాటింగ్ విషయానికి వస్తే రహనే,ధావన్ లు ఓపెనర్లు వస్తారు.కాని నిలకడలేమితో ప్రపంచ కప్ కు వీరి స్థానం కూడా ప్రశ్నార్థకంగానే ఉంది.రోహిత్ శర్మ మొదటి మూడు మ్యాచ్ లకు అందుబాటులో లేనప్పటికీ పోటిలో ఉన్నాడు.శ్రీలంకతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో 143 పరుగులు సాధించాడు.ఇంగ్లాండ్ పర్యటనలో ఘోరంగా విఫలమైన కోహ్లి వెస్టిండీస్ పర్యటనతో ఫామ్ లోకి రావడం మంచి పరిణామం.రైనాకు ఇది 200వ వన్డే మ్యాచ్ కావడం విశేషం.12వ భారత ఆటగాడిగా రైనా ఈ ఘనత సాధించాడు.
శ్రీలంక విషయానికొస్తే వీరి బౌలింగ్ కూడా సాధారణంగానే ఉంది.మలింగా,హేరాత్ లేకపోవడం లోటే.బ్యాటింగ్ లో దిల్షాన్,సంగక్కర,జయవర్ధనే,కుశల్ పెరేరా కీలకం కానున్నారు.
వర్షం పడే అవకాశాలు ఏ మాత్రం లేకపోవడంతో మ్యాచ్ సజావుగా జరుగేఅవకాశం ఉంది.
భారత కాలమానప్రకారం మ్యాచ్ మధ్యాహ్నం 1:30 కు మొదలవుతుంది.స్టార్ స్పోర్ట్స్,డీడీ లలో ప్రత్యక్షప్రసారమవుతుంది.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates