Radio LIVE


Breaking News
Showing posts with label Sports News. Show all posts
Showing posts with label Sports News. Show all posts

Monday, 4 May 2015

రగ్బీ ఆటలో గుండెపోటు..మృతి చెందిన క్రీడాకారుడు

లండన్ లో జరుగుతున్న “ద వేల్స్ ఇంటర్నేషనల్ రగ్బీ లీగ్” లో విషాదం చోటుచేసుకుంది. లీగ్ లో నార్తన్ ఇంగీష్ క్లబ్ కైగ్ లీ కోగార్స్ తరపున డేనీ జోన్స్ అనే క్రీడాకారుడు రగ్బీ ఆడుతున్నాడు.
ఇతను మైదానంలో రగ్బీ ఆడుతూనే కుప్పకూలాడు. హుటాహుటిన మైదానంలోనే ప్రాధమిక చికిత్స అందించిన వైద్యులు అనంతరం రాయల్ ఫ్రీ ఆసుపత్రికి తరలించారు. డేనీ జోన్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే మృతిచెందాడు.
డేనీ కి ఐదు నెలల కవల పిల్లలు ఉన్నారు. డేనీ సహజ నాయకుడని, డ్రెస్సింగ్ రూంలో అతడి స్థానం భర్తీ కాదని, ఆయన మృతితో తాము విషాదంలో మునిగిపోయినట్లు క్లబ్ కైగ్ లీ కోగార్స్ ఓ ప్రకటనలో తెలిపింది.
Read more ...

Friday, 24 April 2015

ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ నుంచి నిష్క్రమించిన సైనా

భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ నుంచి నిష్క్రమించింది. క్వార్టర్స్ లో చైనీస్ తైపీకి చెందిన జు యింగ్ తై చేతిలో సైనాకి పరాజయం ఎదురైంది. జు యింగ్ తై చేతిలో 21-16, 13-21, 18-21 తేడాతో సైనా ఓటమి పాలైంది.
Read more ...

Thursday, 16 April 2015

సైనా నెహ్వాల్ మళ్లీ నెంబర్.1

హైదరాబాద్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ మళ్లీ నెంబర్.1 స్థానాన్ని కైవశం చేసుకుంది. సైనా ఇండియన్ గ్రాండ్ ఫిక్స్ టోర్నీ లో స్వర్ణం సాధించడం ద్వారా మొదటి స్థానం సాధించింది. అనంతరం జరిగిన మలేషియా ఓపెన్ సెమీస్ లో చైనా క్రీడాకారిణి లీ జురయ్ చేతిలో ఓటమి పాలై కొద్ది రోజుల్లోనే ప్రధమ స్థానం కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే సైనా ఇటివల సింగపూర్ ఓపెన్ లో ఆడలేదు.ఈ టోర్నీలో లీ జురమ్ ఓడిపోవడంతో రెండు స్థానాలు కోల్పోయి మూడో స్థానానికి చేరుకుంది. దీంతో మళ్లీ సైనా నెహ్వాల్ నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది.
Read more ...

Saturday, 11 April 2015

పారుపల్లి కశ్యప్ కు సెమీస్ లో ఎదురుదెబ్బ



పారుపల్లి కశ్యప్ సింగపూర్ ఓపెన్ బ్యాట్మింటన్ సెమీస్ లో ఓటమి ఎదురైంది.
చైనీస్ షట్లర్ హూయున్ చేతిలో 22-20, 11-21 తేడాతో కశ్యప్ పరాజయం చెందాడు.  
ఈ ఓటమితో సింగపూర్ ఓపెన్ లో భారతీయుల పోరాటం ముగిసినట్లయింది.


Read more ...

2016 ఒలంపిక్స్ కు అర్హత సాధించిన భారత షూటర్



కొరియాలోని చాంగ్ వాన్లో జరిగిన ఐఎన్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ రైఫిల్ 10 మీటర్ల విభాగంలో భారత దేశానికి చెందిన షూటర్ అపూర్వి చండిల కాంస్యం సాధించింది.
అపూర్వి ఈ పతకం సాధించడం ద్వారా 2016 లో బ్రెజిల్ లోని రియో డీ జనిరో లో జరగనున్న ఒలంపిక్స్ కు అర్హత సాధించింది.     
Read more ...

Wednesday, 17 December 2014

ఎనిమిది భాషల్లోకి సచిన్ టెండుల్కర్ జీవిత చరిత్ర

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ జీవిత చరిత్ర ‘ప్లేయింగ్ ఇట్ మై వే’ 8 భాషల్లో లభించనుంది.ఆంగ్ల మాధ్యమంలో విడుదలైన ఈ పుస్తకం మరో 6 నెలల్లో 8 భాషల్లోకి అనువాదం కానుంది.
ఒక ఉన్నతాధికారి మొదట మరాఠీలోకి అనువదించిన తర్వాత 8 భారతీయ భాషల్లోకి అనువాదం చేయడం జరుగుతుందని వెల్లడించారు. భారత్ కు చెందిన పబ్లిషింగ్ సంస్థ హాట్ చెట్ పూణేకు చెందిన మెహతా ముద్రణకార్యాలయంతో సచిన్ పుస్తకానికి సంబంధించి ఒప్పందాన్ని కుదుర్చుకుందని మెహతా ముద్రణా సంస్థ స్థాపకుడు అనిల్ మెహతా వెల్లడించారు. ఆయన ప్రస్తుతం ఈ పుస్తకాన్ని తాము అనువాదం చేస్తున్నామని తెలిపారు. మరాఠీ భాషలో ‘ప్లేయింగ్ ఇట్ మై వే’ ను ఆవిష్కరించిన తర్వాత 50వేల కాపీలకు పైగా అమ్ముడవుతాయని మెహతా స్పష్టం చేశారు.
Read more ...

Sunday, 14 December 2014

హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేత జర్మనీ

జర్మనీ హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది.పాకిస్తాన్ జట్టుపై ఫైనల్ మ్యాచ్ లో 2-0 గోల్స్ తేడాతో జర్మనీ విజయం సాధించింది.భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ హాకీలో నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.ఆస్ట్రేలియా చేతిలో 1-2 గోల్ఫ్ తేడాతో భారత జట్టు ఓడిపోయింది.
Read more ...

పాకిస్తాన్ హాకీ జట్టుపై క్రమశిక్షణ చర్యలు: హాకీ సమైక్య

హాకీ సమైక్య పాకిస్తాన్ హాకీ జట్టుపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.ముగ్గురు ఆటగాళ్ళపై ఫైనల్లో ఆడకుండా వేటు పడే అవకాశం ఉంది.భారతదేశంపై సెమీఫైనల్లో విజయం తర్వాత ప్యానస్ ను పాక్ ప్లేయర్లు ఎగతాళి చేశారు.కాగా భారత హాకీ టీమ్ పాకిస్తాన్ కోచ్ క్షమాపనను తిరస్కరించింది.ఆటగాళ్లందరూ కూడా క్షమాపణ చెప్పాలని లేకపోతే మార్చి లో జరగబోయే ద్వైపాక్షిక సీరీస్ ను రద్దు చేసుకుంటామని భారత ఆటగాళ్ల టీమ్ డిమాండ్ చేస్తూ హెచ్చరించింది. .
Read more ...

Monday, 1 December 2014

అరంగేట్రంలోనే హ్యాట్రిక్ తో సంచలనం

బంగ్లాదేష్ కు చెందిన యువ స్పిన్నర్ తాజుల్ ఉస్లామ్ తను ఆడిన తొలి వన్డేలోనే సంచలనం సృష్టించాడు. జింబాబ్వే పై అరంగేట్రం మ్యాచ్‌లోనే హ్యాట్రిక్ సాధించి, ఆ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ 22 ఏళ్ళ ఎడం చేతి బౌలర్ మొదట 27 వ ఓవర్ చివరి బంతికి తినాషే పన్యన్గర ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత తను వేసిన మరుసటి ఓవర్లో తొలి బంతితో జాన్ న్యుంబ్ ను వికెట్ల ముందు దొరకబుచ్చుకొని హ్యాట్రిక్ ముందు నిలిచాడు. మరుసటి బంతికే టెన్డాయి చటారా ను బౌల్డ్ చేసి హ్యాట్రిక్ సాధించాడు. ఇస్లామ్ 11 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. వన్డే అంతర్జాతీయ మ్యాచుల్లో హ్యాట్రిక్ తీసిన నాల్గవ బంగ్లాదేశీ కాగా, ప్రపంచంలో 45 వ బౌలర్. అయితే అరంగేట్రంలోనే హ్యాట్రిక్ తీసిన ఆటగాళ్ళలో మొదటివాడు.
Read more ...

Sunday, 30 November 2014

మకావు ఓపెన్ విజేత : పి.వి.సింధు

పి.వి. సింధు మకావు ఓపెన్ గ్రాండ్ ఫిక్స్ గోల్డ్ టోర్నీలో విజేతగా నిలిచింది. కొరియా క్రీడాకారునిపై 21-12, 21-17 తేడాతో గేలుపొందింది.
Read more ...

Thursday, 30 October 2014

ఐఎస్ఎస్ఎఫ్ అథ్లెట్ల కమిటీ ఛైర్మెన్ గా అభినవ్ బింద్రా

భారత స్టార్ షూటర్, ఒలంపిక్ స్వర్ణ విజేత అభినవ్ బింద్రాకు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య( ఐఎస్ఎస్ఎఫ్ ) అథ్లెట్ల కమిటీ ఛైర్మెన్ గా అభినవ్ బింద్రా ఎంపికయ్యాడు. అథ్లెట్ల కమిటీకి ఛైర్మెన్ తో పాటు ఐఎస్ఎస్ఎఫ్ అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ లో సభ్యునిగా కూడా బింద్ర వ్యవహరిస్తాడు. ఇండియా నుండి ఈ గౌరవం దక్కించుకున్న తొలి అథ్లెట్ అభినవ్ బింద్రానే.
Read more ...

Monday, 27 October 2014

సౌత్ ఆఫ్రికా ఫుట్ బాల్ కెప్టెన్ ను కాల్చి చంపిన దుండగులు

సౌత్ ఆఫ్రికా ఫుట్ బాల్ కెప్టెన్ సెన్ జో మేయవాను జోహేన్స్ బర్గ్ లోని తన సొంత ఇంట్లోనే దుండగులు కాల్చి చంపారు. అక్కడి మీడియా ప్రకారం దుండగులు అతడి ఇంట్లో ఆదివారం దోపిడీకి చొరబడి సెన్ జో ను చంపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇంట్లో చొరబడిన వారిలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారని, మరో వ్యక్తి బయట ఉన్నాడని వారు తెలిపారు.
Read more ...

Friday, 24 October 2014

వరల్డ్ బిలియర్డ్స్ లో పంకజ్ అద్వానీ విజయం

భారత్ కు చెందిన పంకజ్ అద్వానీ వరల్డ్ బిలియర్డ్స్ చాంపియన్ ఫైనల్స్ లో విజయం సాధించి ట్రోఫి గెలుచుకున్నాడు.ఫైనల్స్ లో ఆయన సింగపూర్ కు చెందిన గిల్ క్రిస్ట్ పై విజయం సాధించారు. ఈ ట్రోఫిని గెలవడం పంకజ్ కు ఇది 11 వ సారి.వీరిద్దరి మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ లో మాత్రం గిల్ క్రిస్ట్ చేతిలో అద్వాని 3-2 తేడాతో ఓటమి చవిచూసి ఫైనల్ లో అందుకు ప్రతీకారం తీర్చుకున్నాడు.
ఫైనల్ లో కూడా మొదట 3-2 తో అద్వానీ వెనకబడ్డప్పటికీ బ్రేక్ తరువాత జరిగిన తదుపరి మూడు ఫ్రేమ్ లను గెలిచి చివరకు 6-2 తో విజయసాధించాడు.
Score (final): Pankaj Advani defeated Peter Gilchrist 6-2: 23-151 (145unf), 151 (127)-16, 116-150, 151(108unf)-104, 150(150unf)-0, 151(118)-58, 150-4, 150(77unf)-145(104)
Read more ...

Wednesday, 22 October 2014

హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో భైచుంగ్ భూటియాకు చోటు

ఆసియన్ ఫుట్ బాల్ కాన్ఫెడరేషన్ (AFC) హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో భైచుంగ్ భూటియా చేరారు. దీనిని భారత ఫుట్ బాల్ సమాఖ్య ఒక ప్రకటనలో తెలిపింది.ఈ జాబితాలో బాటియాతో పాటు మరో 9 మంది చేరారు.ఫిలిప్పీన్స్ లో జరిగే ఏఎఫ్ సీ 60 వ వార్షికోత్సవంలో అవార్డులను ఇవ్వనున్నారు. భారత్ తరపున భైచుంగ్ భూటియా వందకు పైగా ఫుట్ బాల్ మ్యాచ్ లాడాడు.
Read more ...

భారత హాకీ కోచ్ గా కొనసాగనున్న టెర్రీవాల్ష్

భారత హాకీ చీఫ్ కోచ్ టేర్రివాల్ష్ తన రాజీనామాను ఉపసంహరించుకున్నారు.వేతనంపై ప్రభుత్వ పన్నుల విషయంలో, క్రీడా ప్రాధికర సంస్థ (సాయ్)తో విభేదాల కారణంగా ఆయన తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.రాజీనామా ఉపసంహరణతో ఒప్పందం ప్రకారం వాల్ష్ సేవలు 2016 ఒలంపిక్స్ వరకు కనసగానున్నాయి.
Read more ...

Friday, 5 September 2014

యుఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ సెమీస్ లో సానియా జోడి ఓటమి


యుఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ సెమీస్ లో సానియా-కారా బ్లాక్ జోడి అన్ సీడెడ్ హెంగిస్-సేన్నేట్టా చేతిలో 2-6,4-6 తేడాతో ఓటమి పాలయింది.
మేజర్ టోర్నీ లో 12 సంవత్సరాల తరువాత మార్టినా హెంగిస్ ఫైనల్ కు ప్రవేశించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
గత సంవత్సరం యుఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ సెమీస్ లో కూడా ఓడిపోయింది.
మిక్స్డ్ డబుల్స్ లో మాత్రం సోరేస్ తో జతకట్టిన సానియా ఫైనల్ లోకి ప్రవేశించింది.ఫైనల్ లో వీరు అన్ సీడెడ్ జంట యుఎస్ఎ కు చెందిన ఆబిగైల్ స్పియర్స్ మెక్సికో కు చెందిన శాంటియాగో  గొంజాలెజ్ తో తలపడతారు.
Read more ...
Designed By Published.. Blogger Templates