Radio LIVE


Breaking News
Showing posts with label Current Affairs. Show all posts
Showing posts with label Current Affairs. Show all posts

Tuesday, 5 May 2015

బ్రిటన్ 4వ తరం యువరాణి పేరు ఖరారు

బ్రిటన్ రాజకుటుంబంలోకి వచ్చిన బుల్లి యువరాణి పేరును రాజకుటుంబం ప్రకటించింది.
బ్రిటన్ ప్రిన్స్ విలియమ్స్, కేట్ మిడిల్ టన్ దంపతులకు ఆదివారం రెండవ సంతానంగా ఆడశిశువు జన్మించింది.
కేన్సింగ్ టన్ ప్యాలస్ ఈ చిన్నారి పేరును యువరాణికి ‘చార్లోట్టీ ఎలిజబెత్ డయానా’ అని ప్రకటించింది.
బ్రిటన్ మహారాణి ఎలిజబెత్, విలియమ్స్ తల్లిదండ్రులు చార్లెస్, దయానాల పేర్లు కలిసి వచ్చేట్టు ఈ బుల్లి యువరాణికి పేరు పెట్టినట్లు తెలిసింది.
Read more ...

Monday, 4 May 2015

రగ్బీ ఆటలో గుండెపోటు..మృతి చెందిన క్రీడాకారుడు

లండన్ లో జరుగుతున్న “ద వేల్స్ ఇంటర్నేషనల్ రగ్బీ లీగ్” లో విషాదం చోటుచేసుకుంది. లీగ్ లో నార్తన్ ఇంగీష్ క్లబ్ కైగ్ లీ కోగార్స్ తరపున డేనీ జోన్స్ అనే క్రీడాకారుడు రగ్బీ ఆడుతున్నాడు.
ఇతను మైదానంలో రగ్బీ ఆడుతూనే కుప్పకూలాడు. హుటాహుటిన మైదానంలోనే ప్రాధమిక చికిత్స అందించిన వైద్యులు అనంతరం రాయల్ ఫ్రీ ఆసుపత్రికి తరలించారు. డేనీ జోన్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే మృతిచెందాడు.
డేనీ కి ఐదు నెలల కవల పిల్లలు ఉన్నారు. డేనీ సహజ నాయకుడని, డ్రెస్సింగ్ రూంలో అతడి స్థానం భర్తీ కాదని, ఆయన మృతితో తాము విషాదంలో మునిగిపోయినట్లు క్లబ్ కైగ్ లీ కోగార్స్ ఓ ప్రకటనలో తెలిపింది.
Read more ...

తెలంగాణ సీఎస్ తో భేటి అయిన ఆస్ట్రియా సైంటిస్టుల బృందం

ఆస్ట్రియా సైంటిస్టుల బృందం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ తో భేటి అయింది.
హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, నీటి శుద్ధి వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.
హుస్సేన్ సాగర్ ప్రక్షాళన కోసం తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే.
అయితే ఈ నేపధ్యంలోనే ఆదివారం ఆస్ట్రియా సైంటిస్టుల బృందం హుస్సేన్ సాగర్ ను పరిశీలించారు.
ఈ మేరకు సోమవారం డాన్యూబ్ నదిని శుద్ధి చేసిన పద్ధతిలోనే హుస్సేన్ సాగర్ ని కూడా శుద్ధి చేసే ఛాన్స్ ఉందని వారు సూచించారు.
ఈ బృందం మంగళవారం దీనిపై ముఖ్యమంత్రి KCR కు నివేదికను ఇవ్వనున్నారు.
Read more ...

ఢిల్లీ లో బుద్ధ పూర్ణిమ దివస్-2015ను ప్రారంభించిన ప్రధాని మోడీ

ఈరోజు న్యూఢిల్లీ లో అంతర్జాతీయ బుద్ధ పూర్ణిమ దివస్-2015 ను భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ప్రధానితో పాటు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బుద్ధ దివస్ లో భాగంగా నేపాల్ భూకంప మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధనలు చేశారు.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ప్రపంచంలోనే భారత్ వివిధ మతాలకు, భక్తి బావానికి ఆలవాలమైందని, మొదట మన ఇండియాలోనే బుద్ధిజం పుట్టిందని మోదీ అన్నారు.
భారతదేశంలో బుద్ధుని జయంతి ఉత్సవాల నిర్వహణతో పర్యాటక రంగం మరింత వేగంగా వృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు.
Read more ...

Sunday, 3 May 2015

సిరియాలో అమెరికా డ్రోన్ దాడులు..52 మంది మృతి

అమెరికా ఆధ్వర్యంలో సిరియాలోని “అలెప్పో”రాష్టంలో వైమానిక దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 52 మంది పౌరులు మృతిచెందారు.
బ్రిటన్ కేంద్రంగా పని చేస్తున్న మానవ హక్కుల ప్రతినిధి  “ రమీ అబ్దుల్ రహ్మాన్” మృతి చెందిన వారిలో 7 బాలలున్నారని తెలిపారు.
శుక్రవారం రాత్రి ఓ గ్రామంపై ఉగ్రవాదులతో పోరాడుతున్న సిరియా, కుర్దిష్ యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయని, అయితే ఈ ఘటనలో ఉగ్రవాదుల విమానం ఒక్కటి కూడా లేదని ఆయన వెల్లడించారు.
Read more ...

Saturday, 2 May 2015

నేపాల్ భూకంపం బాధిత గ్రామాన్ని దత్తత తీసుకుంటున్న CRPF

CRPF భూకంపదాటికి అతలాకుతలమైన నేపాల్ ను సహాయం అందించేందుకు మరో అడుగు ముందుకేసింది. భూకంపంలో దెబ్బతిన్న ఒక గ్ర్రామాన్ని దత్తత తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు CRPF సీనియర్ అధికారి ఒకరు అన్నారు.
CRPF ఐజీ అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. నేపాల్ లోని "కిరికట్ అనే గ్రామాన్ని" దత్తత తీసుకొని ఆ గ్రామంలో కూలిపోయిన కట్టడాలన్నీ తిరిగి నిర్మించాలనుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే కిరికిట్ గ్రామాన్ని నేపాల్ భూకంపం సంభవించిన తర్వాత ఎవరు సందర్శించాలేదని తమకు సమాచారం అందిందని ఆయన తెలిపారు. అందుకే ఆ గ్ర్రామాన్ని దత్తత తీసుకొని బాగుచేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించారు.
Read more ...

Friday, 1 May 2015

హోంశాఖ చీఫ్ విజిలెన్స్ అధికారిగా అనితా రాజేంద్ర నియామకం

ఐఏఎస్ అధికారిణి అనితా రాజేంద్ర తెలంగాణ రాష్ట్ర హోంశాఖ చీఫ్ విజిలెన్స్ ఆఫిసర్ గా నియామకమయ్యారు. ప్రభుత్వం ఈమేరకు శుక్రవారం అనితా రాజేంద్రను నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది.
Read more ...

Thursday, 30 April 2015

అణు విద్యుదుత్పాదక దేశాల్లో 13వ స్థానంలో ఉన్న భారత్

భారతదేశం అణు విద్యుదుత్పాదక దేశాల్లో 13వ స్థానం దక్కించుకుందని గురువారం ప్రభుత్వం వెల్లడించింది. పవర్ రియాక్టర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజన్సీ విడుదల చేసిన నివేదికలో భారత్ 13వ స్థానాన్ని కైవశం చేసుకున్న విషయాన్ని తెలిపింది. ఈ మేరకు మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. అణు విద్యుదుత్పత్తి కోసం అత్యధిక రియాక్టరు ఉన్న దేశాల్లో ఇండియా 7వ స్థానంలో ఉందని, ప్రస్తుతం రియాక్టర్ల సామర్ధ్యం 5,780మెగావాట్లు ఉండగా ఇది 2019 కల్లా 10,080 మెగావాట్లకు చేరుతుందని ఆయన అన్నారు.
Read more ...

ప్రఖ్యాత కార్టూనిస్ట్ గోపులు మృతి

ప్రముఖ చిత్రకారుడు, కార్టూనిస్ట్ S.గోపాలన్ (91) మరణించారు. S.గోపాలన్ పత్రికారంగంలో గోపులుగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. తమిళ హాస్య పత్రిక ఆనంద్ వికటన్ లో ఆయన భిన్నమైన శైలిలో వేసిన చిత్రాలు, కార్టూన్లు ఎన్నోఏండ్లు పాఠకులనుఅలరించాయి.
అయితే గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న గోపులు బుధవారం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.
గోపాలన్ 1924 లో తంజావూరులో జన్మించారు. కుంభకోణం స్కూల్ లో చిత్రకళ విద్యను పూర్తి చేసిన గోపాలన్ ఆనంద వికటన్ అనే పత్రికలో చేరారు.
1986 వరకు కూడా కవర్ పేజ్ డిజైన్లు, రాజకీయ వ్యంగ్య కార్టూన్లు, మ్యాగజైన్ కాలాలకు చిత్రాలను గీశారు. ఇక్కడే ప్రఖ్యాత కార్టూనిస్ట్ మాలి తో గోపాలన్ కు పరిచయం ఏర్పడింది.
అయితే గోపాలన్ యొక్క కలం పేరును గోపులుగా మార్చినది మాలినే. బాపు తన గురువుగా గోపులును చెప్పుకునేవారు.
గోపులు అందుకున్న అవార్డులు :
ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్ట్స్(బెంగళూర్) గోపులుకు లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డుతో సత్కరించింది.
తమిళనాడు ప్రభుత్వం కళైమామణి అవార్డుతో సత్కరించింది.
మురుసోళి, ఎంఏ చిదంబరం చెట్టియార్ అవార్డులను అందుకున్నారు.
Read more ...

Tuesday, 28 April 2015

షార్ కు కొత్త కంట్రోల్ సిస్టం : ECIL

ద్రవ ఇంధనం శాటిలైట్ లో నింపేందుకు కొత్త కంట్రోల్ సిస్టంను ECIL తయారు చేసింది. ఈ సిస్టం యంత్రాన్ని పూర్తిగా స్వదేశి పరిజ్ఞానంతో తయారు చేసినట్లు ఈసీఐఎల్ పేర్కోంది. ECIL ఈ కొత్త యంత్రాన్ని మంగళవారం షార్ డైరెక్టర్ ప్రసాద్ కు అప్పగించింది. ఈ సందర్భంగా వారు ఇకపై శాటిలైట్ ప్రయోగాల్లో పూర్తిగా స్వదేశి పరిజ్ఞానంనే వినియోగించాలని నిర్ణయించుకున్నారు.
7 శాటిలైట్లను 2016 నాటికి కక్ష్యలో ప్రవేశపెట్టనున్నామని ప్రసాద్ అన్నారు. వీటిలో భాగంగా జూన్ లో 3 యూకే కి చెందిన శాటిలైట్లను, జులై నాటికి 4 PSLV , ఒక GSLV లను ప్రయోగించనున్నట్లు ప్రసాద్ తెలిపారు. రూ.700 కోట్ల షార్ బడ్జెట్ లో విదేశాలకే రూ.100 కోట్లు చెల్లిస్తున్నామని ఈ చెల్లింపులను క్రమంగా తగ్గిస్తామని ఆయన వెల్లడించారు.
Read more ...

Sunday, 26 April 2015

నేడు ఢిల్లీ లో KTR కు హడ్కో అవార్డ్

తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కే.తారకరామారావు, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రేమాండ్ పీటర్స్ తో కలిసి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు కు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హాడ్కో (గృహ, పట్టణ అభివృద్ధి సంస్థ) సోమవారం ఢిల్లీ లో అవార్డు ను అందజేయనుంది. వీరు హడ్కో తన 47వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పోరేషన్ ద్వారా చేపట్టిన పథకాలు, లక్ష్యాలను గుర్తిస్తూ హడ్కో అవార్డు ను ప్రకటించింది.ఈ అవార్డును తీసుకోవడానికి తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పోరేషన్ వైస్ ఛైర్మెన్, మంత్రి KTR తో సహా ముఖ్య కార్యదర్శి పీటర్ ఢిల్లీ కి వెళ్లారు. అనంతరం ఢిల్లీ నుంచి బయలుదేరి హైదరాబాద్ లో పెరేడ్ గ్రాండ్ లో జరిగే TRS బహిరంగ సభలో మంత్రి పాల్గొంటారు.
Read more ...

పాకిస్థాన్ కు 110 అత్యాధునిక JF-17 అందించనున్న చైనా

పాకిస్థాన్ దేశం చైనా నుంచి 110 అత్యాధునిక JF-17 థండర్ ఫైటర్ జెట్ విమానాలను పొందనున్నది. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ వచ్చేవారం పాకిస్థాన్ పర్యాటన సందర్భంగా ఇరుదేశాల మధ్య జరిగే ఆర్ధిక, రక్షణ సహకారంపై జరిగే ఒప్పందంలో భాగంగా చైనా పాకిస్థాన్ కు జెట్ విమానాలను అందించనున్నదని రేడియో పాకిస్థాన్ తెలిపింది. చైనా ఎయిర్ క్రాఫ్ట్ ఇండస్ట్రీ అధినేత చైనా దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఒప్పందంలో భాగంగా 110 జెట్ విమానాలను చైనా నుంచి పాకిస్థాన్ కు అందించనున్నట్లు వెల్లడించారు. దీనిలో 50 జెట్ విమానాలను తొలివిడత మూడేండ్ల కాలంలో ఇవ్వనున్నట్లు సమాచారం.అయితే మిగిలిన 60 జెట్ విమానాలను ఎప్పటిలోగా అందిస్తారనే విషయంపై చైనా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
Read more ...

Thursday, 23 April 2015

పీపుల్స్ మ్యాగజైన్-2015 అందమైన మహిళగా సాండ్రా

పీపుల్స్ మ్యాగజైన్ 2015 సంవత్సరానికి గాను ప్రపంచ అత్యంత అందగత్తేగా హాలీవుడ్ నటి సాండ్రా బులోక్ ఎంపికయ్యారు.
గతంలో మూడు సార్లు పీపుల్స్ మ్యాగజైన్ ప్రపంచ అత్యంత అందగత్తెగా గౌరవాన్ని పొందిన నటి జూలియా రాబర్ట్స్.
కాగా ఈ సారి సాండ్రా ఫోటోని ముఖ చిత్రంగా పీపుల్స్ మ్యాగజైన్ తన తదుపరి సంచికను ముద్రించనున్నట్లు తెలిపింది.
Read more ...

Saturday, 18 April 2015

తెలంగాణ రాష్ట్ర ఒలంపిక్ సంఘం అధ్యక్షుడిగా జితేందర్ రెడ్డి ఎన్నిక

TRS ఎంపీ జితేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఒలంపిక్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.ఈ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. పోటీలో ఉన్న మిగిలిన పదవులకు ఆదివారం ఎన్నికలు జరగనున్నట్లు ఒలంపిక్ సంఘం నూతన్ అధ్యక్షుడు జితేందర్ రెడ్డి తెలిపారు. జాతీయ నియమ నిబంధనల ప్రకారం, హైకోర్ట్ ఉత్తత్వుల ప్రకారం ఈ ఎన్నికలు జరుగుతాయని ఆయన వెల్లడించారు.
Read more ...

తుఫాన్ పేర్ల జాబితా నుంచి ఐఎస్ఐఎస్ తొలగించిన ఐరాస

ఐక్యరాజ్య సమితి వాతావరణ సంస్థ తుఫాను పేర్ల జాబితా నుంచి isis ను తొలగించింది. isis అనేది ఈజిప్టు దేశస్తులు కొలిచే ప్రాచీన దేవత. ప్రపంచ వాతావరణ సంస్థ అధికార ప్రతినిధి క్లేర్ నుల్లిస్ 2016 లో తూర్పు ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో వచ్చే హరికేన్ల పేర్ల జాబితాలో ఈ దేవత పేరు చేర్చినట్లు చెప్పారు. మరోవైపు ఇరాక్, సిరియాలో ఇదే పేరున ఉన్న ఇస్లామిక్ స్టేట్ జిహాదిస్టు గ్రూప్ ఐసిస్ (isis) మారణహోమం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అందుచేత కోస్టారికాలో జరిగిన ప్రపంచ వాతావరణ సంస్థ హరికేన్ కమిటీ సమావేశంలో isis అనే పేరును తుఫాన్ పేర్ల జాబితా నుంచి తొలగించి దీని స్థానంలో ivette అనే పేరును ఆ జాబితాలో చేర్చారు.
Read more ...

Friday, 17 April 2015

ఈనెల 21న ఇథియోపియాకు వెళ్లనున్న సీఎస్ రాజీవ్ శర్మ

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఈ నెల 21న ఇథియోపియాకు వెళ్లనున్నారు. ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ ఆహ్వానం మేరకు రాజీవ్ శర్మ పర్యటనకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన తెలంగాణ తరపున ఇతియోపియలోని అడీస్అబాబా నగరంలో జరిగే ఇక్రిశాట్ గవర్నింగ్ బాడీ సమావేశంలో పాల్గొననున్నారు.
Read more ...

రెండో ప్రపంచ యుద్ధం నాటి విమాన వాహకనౌక గుర్తింపు : జేమ్స్ డెల్గాడో

రెండో ప్రపంచ యుద్ధ కాలంలో సముద్రంలో మునిగిపోయిన అమెరికా విమాన వాహక నౌకను కాలిఫోర్నియా లోని ఫాలెన్ ద్వీపం సమీపంలో పసిఫిక్ మహాసముద్రంలో గుర్తించారు. 64 ఏండ్ల క్రితం యూఎస్ఎస్ ఇండిపెండెన్స్ విమాన వాహకనౌక మునిగిపోయింది. నవంబర్ 1943 నుంచి ఆగస్టు 1945 వరకు ఇది సేవలనందించింది. నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) పరిశోధకుడు జేమ్స్ డెల్గాడో ఈ నౌక గురించి మాట్లాడుతూ.. ఇది సముద్రంలో 2,600 అడుగుల (800 మీటర్లు) లోతులో ఉందని, చెక్కుచెదరకుండా నిటారుగా అలాగే నిలబడి ఉందని, అమెరికా అణుబాంబు పరిక్ష కోసం నిర్మించిన 90 నౌకల్లో ఇదీ ఒకటని ఆయన వెల్లడించారు.
Read more ...

చంద్రుడి వయస్సు 447 కోట్ల ఏండ్లు : శాస్త్రవేత్తలు

తాజాగా పరిశోధకులు చంద్రుడు ఏర్పడి 4.47 బిలియన్ సంవత్సరాలు అయిందని తేల్చారు. అప్పుడప్పుడు సూర్యమండలంలో ఏర్పడే భూగోళం తన సమీపంలో ఉన్న మరో పాక్షిక గ్రహం మధ్య తీవ్రమైన గురుత్వ బలాల కారణంగా కొంత పదార్ధం విడిపోయి చంద్రుడు ఏర్పడ్డాడని , రెండు పాక్షిక గ్రహాల మధ్య ఉండిన గ్రహశకల బెలెట్ ను భారీ ఖగోళ పదార్ధాలు ఢీకొనడంతో వెలువడిన తీవ్రమైన వేడీ కూడా చంద్రుడు ఏర్పడడానికి కారణమైందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అపోలో వ్యోమనౌక తీసుకొచ్చిన పదార్ధ నమూనాలను అధ్యయనం చేసి ఈ పరిణామం 447 కోట్ల ఏండ్ల క్రితం జరిగిందని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు.
Read more ...

Thursday, 16 April 2015

విజయవంతమైన అగ్ని-3 పరిక్ష

గురువారం ఉదయం ఓడిశా తీరంలో నిర్వహించిన అగ్ని-3 క్షిపణి పరిక్ష విజయవంతమైంది. అణ్వస్త్రాలను మోసుకెళ్లే సామర్ధ్యమున్న అగ్ని-3 క్షిపణి..3,500 కి.మీ పరిధిలోని లక్ష్యాలను చేదించగలదని వెల్లడించారు.శాస్త్రవేత్తలు
Read more ...

Thursday, 9 April 2015

పద్మ అవార్డులు :2015


రాష్ట్రపతి భవన్ లో 8వ తేదీన జరిగిన పద్మ అవార్డుల వేడుకలో ప్రధాని మోడితో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో ప్రముఖ బాలీవుడు నటుడు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ విభూషణ్ అవార్డుని అందుకున్నారు. తెలుగు చిత్రసీమకు చెందిన ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు కు పద్మశ్రీ అవార్డ్ వరించింది. 2015 సంవత్సరానికి గాను మొత్తం 104 పద్మ అవార్డులను ప్రధానం చేశారు. 9 పద్మవిభూషణ్, 20 పద్మభూషణ్, 75 పద్మశ్రీ అవార్డులను వివిధ వ్యక్తులకు ఆయ రంగాల్లో చేసిన కృషికి గాను ప్రధానం చేశారు. పద్మ విభూషణ్ : అమితాబ్ బచ్చన్, ప్రిన్స్ కరీం ఆగా ఖాన్, K.వేణుగోపాల్, వీరేంద్ర హెగ్డే దిలీప్ కుమార్, K. అద్వాని , ప్రకాష్ సింగ్ బాదల్, R. శ్రీనివాసన్, రాంభద్రచార్య పద్మ భూషణ్ : పండిట్ గోకులోత్సవ్ జీ మహారాజ్, అంబరీష్, స్వామి సత్యమిత్రానంద గిరి , సుభాష్ సి కశ్యప్, ప్రొఫెసర్ మంజుల భార్గవ, విజయ భట్కర్, శివ కుమార స్వామిగలు , జాహను బారువా. పద్మశ్రీ అవార్డు: కోటా శ్రీనివాసరావు, లక్ష్మీ నందన్ బోరా, మిథాలీ రాజ్, అరుణన్, యోగేశ్ చావ్లా, శారద బూమెర్, కమల మెహతా, మస్కరనాన్, విద్యారాజేష్, రవీంద్ర జైన్, హరిదాన్, బిమెలా కుమారీ దేవి, బిబేక్ దేబ్రోయ్, అశోక్ భగత్, జాంగక్ బ్లామెం, నందరాజన్ రాజ్ చెట్టి, వివేక్ దేవరాయ్, సునీల్ జోగి, వైద్య రాజేశ్ కోటెచా, మితా లాల్ మెహతా, వీరేంద్ర రాజ్ మెహతా, త్రిపాఠి ముఖర్జీ, నీల్ హర్బర్ట్, నెంగక్యింరీహ్, దత్తాత్రేయుడు నోరి, జాదవ్ పాయోగ్, మోహన్ దాన్ పై, రాంబహదూర్ రాయ్, నరేంద్ర ప్రసాద్, రాజారామణ్, సత్యానంద మహారాజ్, యోగ రాజ్ శర్మ, జగన్మోహన్ సింగ్ రాజ్ పుత్, బీమల్ కుమార్ రాయ్, రిన్పోచే, శేఖర్ సేన్, మను శర్మ, వసంత శాస్త్రి, శివ కుమార్, రంగరాజన్ వాసుదేవన్ హరగోవింద లక్ష్మి శంకర్ త్రివేది, మహేష్ రాజ్ సోనీ. - See more at: http://www.radiojalsa.com/news/padma-awards-2015/#sthash.497eEPGl.dpuf
Read more ...
Designed By Published.. Blogger Templates