Radio LIVE


Breaking News

Monday, 1 December 2014

అరంగేట్రంలోనే హ్యాట్రిక్ తో సంచలనం

బంగ్లాదేష్ కు చెందిన యువ స్పిన్నర్ తాజుల్ ఉస్లామ్ తను ఆడిన తొలి వన్డేలోనే సంచలనం సృష్టించాడు. జింబాబ్వే పై అరంగేట్రం మ్యాచ్‌లోనే హ్యాట్రిక్ సాధించి, ఆ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ 22 ఏళ్ళ ఎడం చేతి బౌలర్ మొదట 27 వ ఓవర్ చివరి బంతికి తినాషే పన్యన్గర ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత తను వేసిన మరుసటి ఓవర్లో తొలి బంతితో జాన్ న్యుంబ్ ను వికెట్ల ముందు దొరకబుచ్చుకొని హ్యాట్రిక్ ముందు నిలిచాడు. మరుసటి బంతికే టెన్డాయి చటారా ను బౌల్డ్ చేసి హ్యాట్రిక్ సాధించాడు. ఇస్లామ్ 11 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. వన్డే అంతర్జాతీయ మ్యాచుల్లో హ్యాట్రిక్ తీసిన నాల్గవ బంగ్లాదేశీ కాగా, ప్రపంచంలో 45 వ బౌలర్. అయితే అరంగేట్రంలోనే హ్యాట్రిక్ తీసిన ఆటగాళ్ళలో మొదటివాడు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates