Radio LIVE


Breaking News
Showing posts with label News. Show all posts
Showing posts with label News. Show all posts

Tuesday, 5 May 2015

బ్రిటన్ 4వ తరం యువరాణి పేరు ఖరారు

బ్రిటన్ రాజకుటుంబంలోకి వచ్చిన బుల్లి యువరాణి పేరును రాజకుటుంబం ప్రకటించింది.
బ్రిటన్ ప్రిన్స్ విలియమ్స్, కేట్ మిడిల్ టన్ దంపతులకు ఆదివారం రెండవ సంతానంగా ఆడశిశువు జన్మించింది.
కేన్సింగ్ టన్ ప్యాలస్ ఈ చిన్నారి పేరును యువరాణికి ‘చార్లోట్టీ ఎలిజబెత్ డయానా’ అని ప్రకటించింది.
బ్రిటన్ మహారాణి ఎలిజబెత్, విలియమ్స్ తల్లిదండ్రులు చార్లెస్, దయానాల పేర్లు కలిసి వచ్చేట్టు ఈ బుల్లి యువరాణికి పేరు పెట్టినట్లు తెలిసింది.
Read more ...

ఫేస్ బుక్ సీవోవో భర్త డేవిడ్ మృతి

సోషల్ మీడియా వెబ్ సైట్ ఫేస్ బుక్ సీవోవో సెర్లిన్ సాండ్ బర్గ్ భర్త డేవిడ్ గోల్ బర్గ్ మృతి చెందారు.
మంగళవారం 47 ఏళ్ల డేవిడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని అధికారులు వెల్లడించారు.
మెక్సికోలోని ఓ రిసార్స్వ కు డేవిడ్ గోల్డ్ బర్గ్ ఫ్యామిలీ ట్రిప్ కోసం వెళ్లారు. డేవిడ్ రిసార్ట్స్ లోని హోటల్ జిమ్ లో ట్రేడ్ మిల్ వాక్ చేస్తుండగా జారీ పడడంతో అతని తలకు గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న డేవిడ్ ను చికిత్స నిమిత్తం న్యూవో వెల్లట్రా లోని ఓ ఆస్పత్రికి తరలించారు.
అయితే డేవిడ్ తలకు తీవ్రంగా గాయలవడం , రక్తస్రావం ఎక్కువవ్వడం వలన అతన్ని రక్షించలేక పోయామని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.
Read more ...

Monday, 4 May 2015

అంధురాలిపై 3నెలల్లో 9 మంది అత్యాచారం ఆపై అమ్మకం..

రాజస్థాన్ లోని చందనఖేడి గ్రామంలో దారుణం జరిగింది. ఓ అంధురాలిపై 3 నెలల్లో 9 మంది అత్యాచారాలకు పాల్పడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ..ఆమె అంధురాలు.
ఇంటి ముందు కూర్చుని ఉండగా ఇదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆమెను అపహరించుకుపోయాడు. వేరేక్కడో ఓ ఇంట్లో ఆమెను ఉంచి 3నెలల వ్యవధిలో ఆమెపై 9 మంది కామాంధులు అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం ఆమెను రూ.50,000కు అమ్మకానికి పెట్టారు.
అయితే అంధురాలు కావడంతో
ఆమెను ఎవరూ కొనుక్కోలేదు.
దీంతో ఆమెను తీసుకువచ్చి మళ్లి ఇంటి ముందే వదిలి వెళ్లిపోయాడు.
ఈ మేరకు బాధితురాలు తమకు ఫిర్యాదు చేసిందని పోలీసులు వెల్లడించారు.
పోలీసులు తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బాధితురాలు పేర్కొంది.
ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.ఈ కేసులో SP సత్యేంద్ర సిన్హా బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.
Read more ...

బాహుబలి చిత్రంలో భారీ శివలింగంతో ప్రభాస్

టాలీవుడు జక్కన ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, అనుష్క జంటగా తెరకెక్కనున్న బారీ చిత్రం ‘బాహుబలి’ (ద బిగినింగ్).
రాజమౌళి ఈ చిత్రానికి సంబంధించి కథానాయకుడు ప్రభాస్ పోస్టర్ ను సోమవారం ట్విట్టర్ లో పోస్టు చేశారు. భారీకాయుడైన ప్రభాస్ జలపాతం నడుమ భారీ శివలింగాన్ని భుజాలపై మోసుకువస్తున్న ఈ పోస్టర్ ని చూస్తుంటే బాహుబలి చిత్రంపై అంచనాలను మరింతగా పెంచేస్తోంది.

సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉంటూ వార్తల్లో నిలిచే రాజమౌళి బాహుబలి విశేషాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఈ సినిమాపై అంచనాలను రోజురోజుకు పెంచేస్తున్నారు.
మే 1న విడుదల చేసిన పోస్టర్ కు ఆద్భుతమైన స్పందన రావడంతో రెట్టించిన ఉత్సాహంతో ట్విట్టర్ వేదికగా దర్శకుడు రాజమౌళి సోమవారం ప్రభాస్ పోస్టర్ ను విడుదల చేశారు.
Read more ...

రగ్బీ ఆటలో గుండెపోటు..మృతి చెందిన క్రీడాకారుడు

లండన్ లో జరుగుతున్న “ద వేల్స్ ఇంటర్నేషనల్ రగ్బీ లీగ్” లో విషాదం చోటుచేసుకుంది. లీగ్ లో నార్తన్ ఇంగీష్ క్లబ్ కైగ్ లీ కోగార్స్ తరపున డేనీ జోన్స్ అనే క్రీడాకారుడు రగ్బీ ఆడుతున్నాడు.
ఇతను మైదానంలో రగ్బీ ఆడుతూనే కుప్పకూలాడు. హుటాహుటిన మైదానంలోనే ప్రాధమిక చికిత్స అందించిన వైద్యులు అనంతరం రాయల్ ఫ్రీ ఆసుపత్రికి తరలించారు. డేనీ జోన్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే మృతిచెందాడు.
డేనీ కి ఐదు నెలల కవల పిల్లలు ఉన్నారు. డేనీ సహజ నాయకుడని, డ్రెస్సింగ్ రూంలో అతడి స్థానం భర్తీ కాదని, ఆయన మృతితో తాము విషాదంలో మునిగిపోయినట్లు క్లబ్ కైగ్ లీ కోగార్స్ ఓ ప్రకటనలో తెలిపింది.
Read more ...

తెలంగాణ సీఎస్ తో భేటి అయిన ఆస్ట్రియా సైంటిస్టుల బృందం

ఆస్ట్రియా సైంటిస్టుల బృందం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ తో భేటి అయింది.
హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, నీటి శుద్ధి వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.
హుస్సేన్ సాగర్ ప్రక్షాళన కోసం తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే.
అయితే ఈ నేపధ్యంలోనే ఆదివారం ఆస్ట్రియా సైంటిస్టుల బృందం హుస్సేన్ సాగర్ ను పరిశీలించారు.
ఈ మేరకు సోమవారం డాన్యూబ్ నదిని శుద్ధి చేసిన పద్ధతిలోనే హుస్సేన్ సాగర్ ని కూడా శుద్ధి చేసే ఛాన్స్ ఉందని వారు సూచించారు.
ఈ బృందం మంగళవారం దీనిపై ముఖ్యమంత్రి KCR కు నివేదికను ఇవ్వనున్నారు.
Read more ...

కిడ్నాప్ కు గురైన సిగ్మా క్యాబ్స్ ఎండీ కుమారుడు అశ్విన్ కుమార్

సిగ్మా క్యాబ్స్ యజమాని కూమరుడు అశ్విన్ కుమార్(17) కిడ్నాప్ అయ్యారు.ఇన్నోవా కారులో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అశ్విన్ కుమార్ ను ఎక్కించుకొని పారిపోయారు.
రైతిబౌతి ఫిల్లర్ నంబర్ 45 వద్ద ఈ ఘటన చోటు చేసుకోగా.. సిగ్మా క్యాబ్స్ ఎండీ కుటుంబ సభ్యులు లంగర్ హౌస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తూను ప్రారంభించారు. వ్యాపార విభేదాలే బాలుడి అపహరణకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.
Read more ...

ఆవుకు హాల్ టిక్కెట్..మే 10న పరీక్షకు హాజరుకానున్న గోమాత

వచ్చే ఆదివారం శ్రీనగర్ లో జరగాల్సి ఉన్న పాలిటెక్నిక్ డిప్లొమా ప్రవేశ పరీక్ష రాసేందుకు ఓ ఆవుకు హాల్ టిక్కెట్ వచ్చింది. ఆశ్చర్యపోకండి..మీరు చదివింది నిజమే.
అధికారులు పరీక్ష రాసే అవకాశాన్ని సాక్షాత్తూ గోమాతకే కల్పిస్తూ హాల్ టిక్కెట్ ను మంజూరు చేసేశారు.
హాల్ టిక్కెట్ పై అభ్యర్ధిని పేరు ‘గోధుమరంగు గోవు’.., తండ్రిపేరు ‘ ఎర్రని ఎద్దు’గా పేర్కొంటూ హాల్ టిక్కెట్ ను జారి చేశారు.
అంతేకాదు పరీక్షా కేంద్రంగా ఓ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను కూడా కేటాయించారు.

ఈ విషయపై జమ్మూ-కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ “ అద్భుతం! గోధుమరంగు గోమాత పరీక్షకు హాజరుకావాలని తాను కోరుకుంటున్నట్లు” వెల్లడించారు. మే 10వ తేదీన జరిగే పరీక్షకు ఈ గోమాత హాజరు కావడమే ఇక మిగిలింది.
Read more ...

TV లైవ్ షోలో బాలుడిపై చెంపదెబ్బ కొట్టిన వర్ధమాన నటి

ఓ ప్రముఖ టీవీ షోలో తనతో అసభ్యంగా ప్రవర్తించాడనే కారణంతో టాలీవుడు వర్ధమాన నటి ఖుషి ముఖర్జీ ఓ బాలుడిపై చెయ్ చేసుకున్నది.


తాను నిద్రిస్తుండగా సుమారు ఉదయం 2.30 గంటలకు హోటల్ లో పని పనిచేసే బాలుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు చేయడం వివాదాస్పదమైంది.

ఈ నేపధ్యంలో సినీనటి, బాలుడితో ప్రముఖ TV ఛానెల్ చర్చా కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే ఈ చర్చ సాగుతుండగానే ఇంకా పోలీసులు సీన్ లోకి రాకముందే భావోద్వేగానికి గురైన సినీ నటి ఆ బాలుడి చెంపను చెళ్లుమనిపించింది.
Read more ...

ఢిల్లీ లో బుద్ధ పూర్ణిమ దివస్-2015ను ప్రారంభించిన ప్రధాని మోడీ

ఈరోజు న్యూఢిల్లీ లో అంతర్జాతీయ బుద్ధ పూర్ణిమ దివస్-2015 ను భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ప్రధానితో పాటు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బుద్ధ దివస్ లో భాగంగా నేపాల్ భూకంప మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధనలు చేశారు.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ప్రపంచంలోనే భారత్ వివిధ మతాలకు, భక్తి బావానికి ఆలవాలమైందని, మొదట మన ఇండియాలోనే బుద్ధిజం పుట్టిందని మోదీ అన్నారు.
భారతదేశంలో బుద్ధుని జయంతి ఉత్సవాల నిర్వహణతో పర్యాటక రంగం మరింత వేగంగా వృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు.
Read more ...

ప్రసాదం లేదని చెప్పిన పూజారిపై దాడి చేసిన మహిళ

యూపీలోని సరాయ్ గ్రామంలోని ఓ దేవాలయంకు వచ్చిన ఓ మహిళ పూజారి తనపట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ పిడిగుద్దుల వర్షం కురిపించింది.అంతే కాదు పోలీసులు వచ్చి విచారణ జరుపుతుండగా కూడా ఇదే తరహా పిడిగుద్దులతో పూజారిని చితకబాదింది.
కాగా,ఆ వ్యక్తి మాట్లాడుతూ.. తాను దేవాలయంలో పూజరినని, మహిళను ఏమీ అనలేదని, ఎలాంటి అసభ్య ప్రవర్తనతో వేధించలేదని అన్నాడు.కేవలం ప్రసాదం అయిపోయిందని చెప్పినందుకే తనని చితకబాడుతోందని పోలీసులకు మొరపెట్టుకున్నాడు.
Read more ...

6 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన ఇద్దరు మైనర్లు

ఇద్దరు మైనర్లు ఓ ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. బెంగళూర్ లో ఈ ఘటన జరిగింది.
బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఆ ఇద్దరు మైనర్ నిందితులని పోలీసులు అరెస్టు చేశారు.న్యాయమూర్తి ఆదేశాల మేరకు జువైనల్ హోంకు తరలించారు.
Read more ...

Sunday, 3 May 2015

ఇరాక్ లో 25 మంది యజిదీల ఊచకోత

ఇస్లామిక్ మిలిటెంట్లు తమ నిర్బంధంలో ఉన్న 25 మంది యజిదీ తెగ ప్రజలను ఉత్తర ఇరాక్ లోని సిరియా సరిహద్దు సమీపాన “తల్ ఆఫర్” పట్టణంలో కాల్చి చంపారు.
యాజిదీ వర్గానికి చెందిన చట్ట సభ సభ్యడు ఈ విషయాన్ని వెల్లడించాడు.
అయితే ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియదు. ఇంకా 1400 మంది యజిదీ ప్రజలు ఐసిస్ ఉగ్రవాదుల చెరలో ఉన్నట్లు అంచనా. కాగా వారీని ఇస్లాంలోకి మారడానికి నిరాకరించినందుకే చంపినట్లు బావిస్తున్నారు.
Read more ...

సిరియాలో అమెరికా డ్రోన్ దాడులు..52 మంది మృతి

అమెరికా ఆధ్వర్యంలో సిరియాలోని “అలెప్పో”రాష్టంలో వైమానిక దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 52 మంది పౌరులు మృతిచెందారు.
బ్రిటన్ కేంద్రంగా పని చేస్తున్న మానవ హక్కుల ప్రతినిధి  “ రమీ అబ్దుల్ రహ్మాన్” మృతి చెందిన వారిలో 7 బాలలున్నారని తెలిపారు.
శుక్రవారం రాత్రి ఓ గ్రామంపై ఉగ్రవాదులతో పోరాడుతున్న సిరియా, కుర్దిష్ యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయని, అయితే ఈ ఘటనలో ఉగ్రవాదుల విమానం ఒక్కటి కూడా లేదని ఆయన వెల్లడించారు.
Read more ...

Saturday, 2 May 2015

ఆడ శిశువుకు జన్మనిచ్చిన ప్రిన్స్ విలియమ్స్ భార్య కేట్

ప్రిన్స్ విలియమ్స్ తండ్రి అయ్యాడు.
పండంటి ఆడ శిశివుకు అతని భార్య కేట్ మిడిల్ టన్ జన్మనిచ్చింది.
బ్రిటన్ సింహాసనానికి ఈ పాప నాల్గవ వారసురాలు. శనివారం ఉదయం ఎనిమిదన్నరకు కేట్ మిడిల్ టన్ ప్రసవించినట్లు కేన్సింగ్ టన్ రాజ ప్రాసాదం అధికార వర్గాలు ప్రకటించాయి.
ఈ సందర్భంగా రాజా కుటుంబీకులు భారీ సంబరాల వేడుకకు సిద్దమవుతున్నారు.
Read more ...

మే 29కి సల్మాన్ ఖాన్ కేసు విచారణ వాయిదా

ప్రముఖ బాలీవుడు నటుడు సల్మాన్ ఖాన్ అక్రమయుదాల కేసు ఈ నెల 29కి వాయిదా పడింది. సాక్షుల వాగ్మూలలను శనివారం జ్యూడిషియల్ మేజిస్టేట్ రికార్డ్ చేశారు.
కోర్టు ముందు ప్రాసిక్యూషన్ సరైన ఆధారాలను ఉంచనందున ఈ కేసు విచారణను 29 వ తేదికి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు.
ఈ కండల వీరుడు 1998 లో రెండు కృష్ణ జింకలను వేటాడిన కేసులో అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నాడన్న ఆరోపణల నేపధ్యంలో ఇతనిపై కేసును నమోదు చేసిన విషయం తెలిసిందే.
Read more ...

“ఇండియన్ ఐడిల్ జూనియర్” న్యాయనిర్ణేతగా మారనున్న సోనాక్షి సిన్హా

బాలీవుడు నటి సోనాక్షి సిన్హా ఇండియన్ ఐడిల్ జూనియర్ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ట్రైలర్ చాలా పాపులర్ అయింది. అంతేకాదు ఈ ట్రైలర్ లో ఒక చిన్నారి పాడిన పాటకు సోనాక్షి స్టెప్పులు కూడా వేయడం విశేషం.
అభిమానుల నుంచి ఈ ట్రైలర్ కి వచ్చిన స్పందనకు సోనాక్షి సిన్హా ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు వెల్లడించింది.
Read more ...

తెలంగాణ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులను జారి చేసింది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా 418 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, 125 అసిస్టెంట్ ఇంజనీర్ల నియామకాలకు ఉత్తర్వులు జారీ చేసింది.
TPSC ఛైర్మన్ ఘంటా చక్రపాణి
Read more ...

నేపాల్ భూకంపం బాధిత గ్రామాన్ని దత్తత తీసుకుంటున్న CRPF

CRPF భూకంపదాటికి అతలాకుతలమైన నేపాల్ ను సహాయం అందించేందుకు మరో అడుగు ముందుకేసింది. భూకంపంలో దెబ్బతిన్న ఒక గ్ర్రామాన్ని దత్తత తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు CRPF సీనియర్ అధికారి ఒకరు అన్నారు.
CRPF ఐజీ అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. నేపాల్ లోని "కిరికట్ అనే గ్రామాన్ని" దత్తత తీసుకొని ఆ గ్రామంలో కూలిపోయిన కట్టడాలన్నీ తిరిగి నిర్మించాలనుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే కిరికిట్ గ్రామాన్ని నేపాల్ భూకంపం సంభవించిన తర్వాత ఎవరు సందర్శించాలేదని తమకు సమాచారం అందిందని ఆయన తెలిపారు. అందుకే ఆ గ్ర్రామాన్ని దత్తత తీసుకొని బాగుచేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించారు.
Read more ...

నేపాల్ భూకంపం ఘటనలో 6,624 కు చేరిన మృతుల సంఖ్య



నేపాల్ లో గత శనివారం రిక్టర్ స్కేల్ పై 7.9గా నమోదైన భూకంపం దాటికి భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది.వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు, లక్షాలాది మంది నిరాశ్రయులైనారు. అయితే ఈ భూకంపంలో మృతి చెందిన వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఈ రోజు ఉదయం కూడా నేపాల్ లో 4.5తీవ్రతతో భూమి కంపించింది.  
ఈరోజు వరకు నేపాల్ భూకంపంలో మృతి చెందిన వారి సంఖ్య 6,624కు చేరిందని మరియు 14,025 మంది క్షతగాత్రులైనట్లు నేపాల్ జాతీయ విపత్తు సంస్థ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది.
Read more ...
Designed By Published.. Blogger Templates