Radio LIVE


Breaking News

Thursday 30 April 2015

ప్రఖ్యాత కార్టూనిస్ట్ గోపులు మృతి

ప్రముఖ చిత్రకారుడు, కార్టూనిస్ట్ S.గోపాలన్ (91) మరణించారు. S.గోపాలన్ పత్రికారంగంలో గోపులుగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. తమిళ హాస్య పత్రిక ఆనంద్ వికటన్ లో ఆయన భిన్నమైన శైలిలో వేసిన చిత్రాలు, కార్టూన్లు ఎన్నోఏండ్లు పాఠకులనుఅలరించాయి.
అయితే గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న గోపులు బుధవారం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.
గోపాలన్ 1924 లో తంజావూరులో జన్మించారు. కుంభకోణం స్కూల్ లో చిత్రకళ విద్యను పూర్తి చేసిన గోపాలన్ ఆనంద వికటన్ అనే పత్రికలో చేరారు.
1986 వరకు కూడా కవర్ పేజ్ డిజైన్లు, రాజకీయ వ్యంగ్య కార్టూన్లు, మ్యాగజైన్ కాలాలకు చిత్రాలను గీశారు. ఇక్కడే ప్రఖ్యాత కార్టూనిస్ట్ మాలి తో గోపాలన్ కు పరిచయం ఏర్పడింది.
అయితే గోపాలన్ యొక్క కలం పేరును గోపులుగా మార్చినది మాలినే. బాపు తన గురువుగా గోపులును చెప్పుకునేవారు.
గోపులు అందుకున్న అవార్డులు :
ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్ట్స్(బెంగళూర్) గోపులుకు లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డుతో సత్కరించింది.
తమిళనాడు ప్రభుత్వం కళైమామణి అవార్డుతో సత్కరించింది.
మురుసోళి, ఎంఏ చిదంబరం చెట్టియార్ అవార్డులను అందుకున్నారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates