Radio LIVE


Breaking News

Tuesday 16 December 2014

పాక్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో ఉగ్రవాదుల కాల్పులు..

తాలిబన్ ఉగ్రవాదులు మంగళవారం ఉదయాన్నే తమ రక్తదాహం తీర్చుకున్నారు.పెషావర్ లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో ఉగ్రవాదులు చొరబడి కాల్పులు జరిపి 160 మందిని పొట్టన పెట్టుకున్నారు.మంగళవారం ఉదయాన్నే ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లో వెళ్లి వాహనాన్ని తగలబెట్టి పాఠశాలలోకి చొరబడి కాల్పులతో అంతా రక్తసికం చేశారు. పాఠశాలలో బీతవాహ పరిస్థితి నెలకొంది.మృతుల్లో విద్యార్ధులు,పాఠశాల సిబ్బంది కూడా ఉన్నారు.గాయపడిన మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పెషావర్ సైనిక పాఠశాలను సైనికులు తమ అధినంలోకి తీసుకున్నారు.సుమారు 9 గంటల పాటు సైనిక చర్య కొనసాగింది. ఈ ఘటనలో తాలిబన్లు ఒక్కో గదికి తిరుగుతూ పాశవికంగా విద్యార్ధులపై కాల్పులకు పాల్పడ్డారు. పాఠశాలలో చొరబడిన ఉగ్రవాదుల్లో 6 హతమైనట్లు పాక్ సైన్యం తెలిపింది. వెంటనే పెషావర్ చేరుకున్న పాక్ ప్రధాని పరిస్థితిని సమీక్షించారు.ఆయన ఈ ఘటనపై బుధవారం అఖిల పక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం 11 గంటలకు పెషావర్లోని అన్ని పార్లమెంటరీ పార్టీలతో సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. నవాజ్ షరీఫ్ ఆర్మీ స్కూల్ పై దాడిని జాతీయ విషాధంగా ప్రకటించారు.పిల్లలను కోల్పోవడం తనకు వ్యక్తిగత నష్టమని ఆయన అన్నారు. ఈ సంఘటనతో ప్రపంచం యావత్తు దిగ్బ్రాంతికి గురైంది.వివిధ దేశాలు ఉగ్రవాద చర్యను ముక్తకంఠంతో ఖండించాయి. ఇదిలా ఉండగా.. ఆర్మీ స్కూల్ పై దాడికి పాల్పడింది తామేనని ప్రతీకార చర్యగానే ఈ దాడికి దిగినట్లు తాలిబన్ ప్రకటించింది.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates