భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ జీవిత చరిత్ర ‘ప్లేయింగ్ ఇట్ మై వే’ 8 భాషల్లో లభించనుంది.ఆంగ్ల మాధ్యమంలో విడుదలైన ఈ పుస్తకం మరో 6 నెలల్లో 8 భాషల్లోకి అనువాదం కానుంది.
ఒక ఉన్నతాధికారి మొదట మరాఠీలోకి అనువదించిన తర్వాత 8 భారతీయ భాషల్లోకి అనువాదం చేయడం జరుగుతుందని వెల్లడించారు.
భారత్ కు చెందిన పబ్లిషింగ్ సంస్థ హాట్ చెట్ పూణేకు చెందిన మెహతా ముద్రణకార్యాలయంతో సచిన్ పుస్తకానికి సంబంధించి ఒప్పందాన్ని కుదుర్చుకుందని మెహతా ముద్రణా సంస్థ స్థాపకుడు అనిల్ మెహతా వెల్లడించారు.
ఆయన ప్రస్తుతం ఈ పుస్తకాన్ని తాము అనువాదం చేస్తున్నామని తెలిపారు.
మరాఠీ భాషలో ‘ప్లేయింగ్ ఇట్ మై వే’ ను ఆవిష్కరించిన తర్వాత 50వేల కాపీలకు పైగా అమ్ముడవుతాయని మెహతా స్పష్టం చేశారు.
No comments:
Post a Comment