Radio LIVE


Breaking News

Wednesday 27 May 2015

పండ్లు తినడం మంచిదా…? లేక పండ్ల రసాలు తాగటం మంచిదా …?

చాలా మంది పండ్లు తినడంకంటే పండ్ల రసాలు తాగడానికి ఎక్కువగా ఇష్టపడతారు.అయితే పండ్లు తినడం మంచిదా లేక వాటిని జ్యూస్ చేసుకొని తాగడం మంచిదా,పండ్లు తినడం వల్ల లాభమా,పండ్ల రసాలు తాగడం మంచిదా చూద్దాం …
పండును జ్యూస్ చేసినప్పుడు రెండు కోల్పోతాం.ఒకటి గుజ్జు అయితే రెండవది పండు మీది పై పొర.
ఏ పండు అయినా పండుగానే తినడం మంచిది.ముఖ్యంగా పండ్లను జ్యూస్ చేసుకొని తాగడం వలన అందులో ఉండే పీచు పదార్థాన్ని పూర్తిగా కోల్పోతాము.పండు తొక్క ఆరోగ్యానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది.ముఖ్యంగా ద్రాక్ష పండ్ల వల్ల కాన్సర్ వ్యాధి నుండి కాపాడుకునే అవకాశం ఉంది.
పండ్ల రసాలు రుచికరంగా,తాజాగా ఉన్నప్పటికీ పండ్లు పండ్లుగానే తింటేనే ఆరోగ్యానికి మంచిది.
పండ్లను జ్యూస్ చేసే క్రమంలో పండ్లు తీవ్ర ఒత్తిడికి గురౌతాయి.ఇలా గురైనప్పుడు కొన్ని పోషకాలు,ముఖ్యంగా పీచు పదార్థాలు,నీటిలో కరిగే విటమిన్లు కోల్పోతాం.అంటే పండ్ల రసాలలో మొత్తం పోషకాలు కోల్పోనప్పటికీ పండులో ఉండే పోషకాలు పండ్ల రసాలలో ఉండే పోషకాలకంటే ఎక్కువే.
ఉదాహరణకు 500 మి.లీటర్ల నారింజ రసంలో 250 మి.గ్రా ల విటమిన్ ‘సి’ ఉంటుంది,అదే క్యాలరీల విషయానికి వస్తే  300 క్యాలరీలు ఉంటాయి,పీచు పదార్ధం ఏమాత్రం ఉండదు.ఒక నారింజ పండులో 150 మి.గ్రా ల విటమిన్ ‘సి’ ఉంటుంది.
ముఖ్యమైన విషయానికి వస్తే ఇంట్లో కంటే బయట తాగే పండ్ల రసాల వల్ల ఆరోగ్యానికి హాని జరిగే అవకాశం ఎక్కువ.బయట తాగే పండ్ల రసాలలో పండ్ల రసం శాతం తక్కువగా ఉంటుంది.వారు తయారు చేసే పండ్ల రసాలకు ఎక్కువ పంచదారతో పాటు ఎక్కువ ఐస్ ను కలుపుతారు.దీనివల్ల కావలసిన పండ్లలోని నిజమైన పోషకాల కంటే ఎక్కువ కెలోరీలు శరీరంలో చేరి ఊబకాయానికి తోడ్పడతాయి.
కాబట్టి పండ్లను ఎక్కువగా తీసుకుంటూ పండ్ల రసాలను అప్పుడప్పుడూ తీసుకోవడం మంచిది.పీచు పదార్ధం పరంగా పండ్లను,క్యాలరీల పరంగా పండ్ల రసాలు తీసుకోవచ్చు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates