Radio LIVE


Breaking News

Saturday 16 May 2015

చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ కి…..కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇంటికి….


ఐపీల్ 8వ సీజన్ లో ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ‘ప్లే ఆఫ్స్’ కి చేరింది.ఈ సీజన్ లో ప్లే ఆఫ్స్ కి చేరిన మొదటి జట్టు చెన్నై.శనివారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో గెలిచి 18 పాయింట్లతో పట్టికలో మొదటి స్థానాన్ని ఖరారు చేసుకుంది.
ఐపీల్ మొదలైన 2008వ సంవత్సరం నుండి ప్రతీ సీజన్లో ప్లే ఆఫ్స్ కి చేరుతూ వస్తుంది చెన్నై.
ఇప్పటి వరకు జరిగిన 8 సీజన్లలో చెన్నై, ప్లే ఆఫ్స్ ముగిసే సరికి పాయింట్ల పట్టికలో వారి స్థానం కింది విధంగా ఉంది:
2008 – మూడవ స్థానం
2009 – రెండవ స్థానం
2010 – మూడవ స్థానం
2011 – రెండవ స్థానం
2012 – నాలుగవ స్థానం
2013 – మొదటి స్థానం
2014 – మూడవ స్థానం
2015 – మొదటి స్థానం
గత సీజన్లో పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉండి కేవలం మూడు మ్యాచ్ లలో మాత్రమే ఓడిన పంజాబ్ అందుకు భిన్నంగా ఈసారి మూడు మ్యాచ్ లలో మాత్రమే గెలిచి 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.
శనివారం జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 130 పరుగులు మాత్రమే చేయగలిగింది.అక్షర్ పటేల్ 32,రిషి ధావన్ 25 పరుగులతో రాణించారు.పవన్ నెగి 2 వికెట్లు తీసుకున్నాడు.
131 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై లక్ష్యాన్ని సునాయాసంగా చేధించింది.మొదట 10 పరుగులకే ఓపెనర్లు కోల్పోయిన చెన్నైని సురేష్ రైనా(41*),డుప్లేసిస్ (55)లు మూడో వికెట్ కు 92 పరుగులు జోడించి విజయానికి చేరువ చేశారు.చివర్లో డుప్లేసిస్ ఔటైనా ధోని మిగతా కార్యాన్ని పూర్తి చేశాడు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates