బాహుబలి క్యారెక్టర్ల ఫస్ట్ లుక్ లు వరుసగా ట్విట్టర్ ద్వారా విడుదల చేస్తున్న ఎస్ ఎస్ రాజమౌళి శుక్రవారం నాడు రమ్యకృష్ణ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
శివగామి గా బాహుబలి చిత్రంలో రమ్యకృష్ణ కనిపించనున్నారు.రమ్యకృష్ణ మా మొత్తం యూనిట్ కు ఒక చోదక శక్తిగా ఉంది, ఇంతలా సినిమా కోసం కష్టపడే వారిని ఇప్పటి వరకు నేను చూడలేదు,గత రెండున్నర సంవత్సరాలుగా మా బృందంతో పనిచేస్తున్నారు అని రాజమౌళి తన ట్విట్టర్ లో తెలిపారు.
రాజామౌళి విడుదల చేస్తున్న క్యారెక్టర్ల ఫస్ట్ లుక్ లు సినిమా మీద మరింత ఆసక్తిని రేపుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
#Sivagami
#EpitomeOfJustice
#Baahubali thebeginning
#LiveTheEpic pic.twitter.com/pVSx9JbSlr
— rajamouli ss (@ssrajamouli) May 8, 2015

No comments:
Post a Comment