Radio LIVE


Breaking News

Monday, 1 September 2014

ఒక్క విజయం కోసం 31 సంవత్సరాల నిరీక్షణ


ముక్కోణపు వన్డే సీరీస్ లో భాగంగా జింబాబ్వే సంచలన విజయం అందుకుంది.ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్ లో జింబాబ్వే 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.క్రికెట్ అన్నప్పుడు గెలుపు ఓటములు మామూలే కాని జింబాబ్వే,ఆస్ట్రేలియా మీద గెలవడం నిజంగా ఒక సంచలనమే.ఎందుకంటే నాలుగు సార్లు ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియా మీద ఇప్పటి వరకు జింబాబ్వే ఒక్కసారే గెలిచింది.1983 జూన్ 9న మొదటిసారి ఆస్ట్రేలియాను చిత్తుచేసింది.మళ్ళీ ఇన్నాళ్ళ తరువాత విజయాన్ని పునరావృత్తం చేయగలిగింది.
 అభిమానులకు అభివాదం తెలుపుతున్న ఆటగాళ్ళు

ఆటగాళ్లకు సరైన జీతం ఇవ్వలేని స్థితిలో ఉంది జింబాబ్వే క్రికెట్ బోర్డు,అందుకు చాలామంది పేరున్న క్రికెటర్లు జట్టును వీడారు.దేశ క్రికెట్ సంక్షభంలో ఉన్న దశలో యువ ఆటగాళ్ళు జట్టుకు అండగా ఉండి తమ సత్తా చాటుతున్నారు.

ఆస్ట్రేలియా జట్టులో అందరూ స్టార్ ఆటగాళ్లే,బలమైన బ్యాటింగ్ ఆర్డర్ కు తోడు పదునైన బౌలింగ్ తో పటిష్టంగా ఉన్న ఆస్ట్రేలియాను జింబాబ్వే కట్టడి చేయగలిగింది.మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.లక్ష్య సాధనలో జింబాబ్వే ఒక దశలో 156 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన దశలో కెప్టెన్ చిగుంబరా(52),టెయిలెండర్ ఉత్సేయా(30) కలిసి మరో వికెట్ పడకుండా జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates