57 సంవత్సరాల మాజీ ప్రభుత్వ ఉద్యోగి(డాక్టర్) తిండి లేక చనిపోయిన నెల రోజుల తరువాత అతని శవాన్ని ఇంట్లో గుర్తించిన ఘటన మీరట్ లో సంభవించింది.వివరాలు పరిశీలిస్తే ...
హరేంద్ర బదాయ్ అనే మాజీ ప్రభుత్వ వైద్యుడు తన తమ్ముడు హరీష్ భదాయ్ తో కలిసి శాస్త్రీ నగర్ లో ఉన్న వారి ఇంట్లో నివాసం ఉంటున్నారు.అయితే ఇద్దరు సోదరులు మానసిక రుగ్మతలతో భాదపడుతున్నారు అని పోలీసు అధికారులు చెప్పారు.ఆ ఇంటి నుండి చెడువాసన రావడంతో చుట్టుపక్కల వారు పోలిసులకు సమాచారం అందించారు.పోలీసులు ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా హరేంద్ర బదాయ్ చనిపోయి ఉండడాన్ని గమనించారు.అప్పటికే శవం పూర్తిగా కుళ్ళి పోయింది.
ఇంట్లోనే ఉన్న హరేంద్ర తమ్ముడు చనిపోయిన అన్న శవాన్ని తీసుకుపోవడానికి అంగీకరించలేదు.తన అన్న నిద్రపోతున్నాడు అని తమ్ముడు హరీష్ బదాయ్ పోలిసులతో చెప్పాడు.గత నెలరోజులుగా శవంతోనే ఇంట్లో హరీష్ ఉంటున్నాడు అని అధికారులు తెలిపారు.
అన్నదమ్ములు ఇద్దరు ఇంట్లోనే ఉండడంతో తినడానికి తిండిలేక చనిపోయాడు అని తరువాత పోలిసుల విచారణలో తేలింది.గడిచిన 20 రోజుల నుండి వారికి నిత్యం ఆహరం అందించే టిఫిన్ సెంటర్ వారు కూడా రావడం లేదు అని పోలీసులు చెప్పారు.
తమ్ముడు ఎయిర్ ఫోర్సు ఆఫీసర్ కాగా అన్న సర్ధానాలో ని CHC లో వైద్యుడు.మానసిక రుగ్మతలతో వీరు ఉద్యోగాల నుండి వైదొలిగారు.శవాన్ని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించగా తమ్ముడిని పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు.
No comments:
Post a Comment