ఈ నెల 13న భారత రాష్ట్రాల ప్రతినిధులతో అబుదాబిలో యునైటెడ్
అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని భారత రాయబార కార్యాలయం,ప్రవాస బారతీయ వ్యవహార
మంత్రిత్వశాఖల సంయుక్త ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించనున్నారు.
ఇందులో గోవా,పంజాబ్ రాష్టాల మంత్రులు మరియు వివిధ రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొంటున్నారు.ఈ సదస్సుకు తెలంగాణా,ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రులు కేసిఆర్,చంద్రబాబులకు ఆయా రాష్ట్రాల అధికారులతో పాటు మంత్రులను కూడా పంపాలని ఆదివారం వారికీ వినతి పత్రాలు సమర్పించినట్లు వలసదారుల హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మంద భీంరెడ్డి మీడియాకు తెలిపారు.
యూఏఈ లో 17.5 లక్షల మంది భారతీయులు నివసిస్తుండగా తెలంగాణా,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు ఇందులో 1.7 లక్షల మంది ఉన్నట్లు అబుదాబిలోని భారత రాయబార కార్యాలయం లెక్కల ప్రకారం తెలుస్తుంది.
ఈ సదస్సులో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వలస కార్మికుల సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై అలాగే వలస కార్మికుల ఫిర్యాదులను పరిష్కరించడానికి ప్రవాసి భారతీయ సంఘాల పాత్రపై చర్చించనున్నారు.

No comments:
Post a Comment